90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Samsung Galaxy F14 5G

Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చిన Samsung Galaxy F14 5G
  • భారత్ లో Samsung Galaxy F14 5G ప్రారంభ ధర రూ.12,990

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ శుక్రవారం నాడు భారత్ లో లాంచైంది. ప్రస్తుతం ఉన్న Samsung Galaxy F13 కి సక్సెసర్ గా Samsung Galaxy F14 5G మార్కెట్ లోకి వచ్చింది. ఈ హ్యాండ్సెట్ 50ఎంపి మెయిన్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F14 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 6.6-ఇంచ్ డిస్ప్లేని ఈ ఫోన్ లో అందించారు. సరే, ఓసారి Samsung Galaxy F14 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F14 5G ధర, సేల్ తేదీ

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,990 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,990 గా నిర్ణయించారు. అయితే ఇవి ఇంట్రడక్టరీ ధరలని గమనించాలి. అంటే ఈ ధరల్ని శాంసంగ్ సంస్థ ఏ సమయంలోనైనా మార్చేస్తుంది. ఈ ఫోన్ సేల్ మార్చి 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1330 చిప్సెట్
  • 4జిబి/6జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. Samsung Galaxy F14 5G ఫోన్ లోజీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleస్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ తో లాంచైన Redmi Note 12 4G
Next articleలీకైన OnePlus Nord CE 3 Lite 5G ధర, ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.