Samsung Galaxy S20 FE 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Aug 2023 05:43:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/amazon-great-freedom-festival-sale-2023-best-deals-offers/ Fri, 04 Aug 2023 05:43:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7464 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో […]

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో చెక్ చేయండి. ఏదైనా ఓకే అనిపిస్తే ఆ ఉత్పత్తిని ఆఫర్ ముగిసే లోపు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి.

OnePlus 11 5G

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సేల్ లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.7-ఇంచ్ క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

అసలు ధర: రూ.56,999
డీల్ ధర: రూ.54,999

Apple iPhone 14

ఈ డిస్కౌంట్ సేల్ సందర్భంగా iPhone 14 ని కూడా తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. iPhone 14 లో ఏ15 బయోనిక్ చిప్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 12ఎంపి ప్రైమరీ + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 12ఎంపి ఫ్రంట్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, ఐపీ68 వాటర్ రెసిస్టంట్, గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. 6 కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.79,900
డీల్ ధర: రూ.67,499

Samsung Galaxy S20 FE 5G

మీరు గనుక ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Samsung Galaxy S20 FE 5G డివైజ్ ఒకటుంది. సేల్ లో ఈ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy S20 FE 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (మైక్రోఎస్డీకార్డ్ ద్వారా), 12ఎంపి ప్రైమరీ + 8ఎంపి టెలీఫోటో + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 30ఎక్స్ స్పేస్ జూమ్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.26,999
డీల్ ధర: రూ.24,999

ఆడియో ఉత్పత్తులపై డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆడియో ప్రొడక్ట్స్ పై మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Bullets Z1 నెక్ బ్యాండ్ ని సేల్ లో రూ.1,599 కే కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy Buds 2 Pro ని డిస్కౌంట్ పై రూ.10,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా OPPO Enco Air 3 Pro వైర్లెస్ ఇయర్‌బడ్స్ ని రూ.4,999 కే కొనుగోలు చేయవచ్చు. pTron Bassbuds Duo ని కేవలం రూ.499 కే కొనుగోలు చేయవచ్చు.

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
దిగొచ్చిన శాంసంగ్ ఫోన్ ధరలు: Galaxy S20 FE, Galaxy S21 FE 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s20-fe-s21-fe-price-cut-bank-offers/ Tue, 20 Sep 2022 08:19:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2454 హైలైట్స్: భారీగా పడిపోయిన శాంసంగ్ ఫోన్ల ధరలు ఫ్లాగ్షిప్ డివైజెస్ Galaxy S20 FE, Galaxy S21 FE ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఊహించని రీతిలో కనిపిస్తోన్న ధరలు, ఫ్లాగ్షిప్ సొంతం చేసుకునేందుకు ఇదే మంచి సమయం మీడియం బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్లను కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి. కంపెనీలు కూడా అదే రేంజ్ ఫోన్లను అందించాలని భావిస్తాయి. ప్రముఖ కంపెనీ శాంసంగ్ లో ఎస్-సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ […]

The post దిగొచ్చిన శాంసంగ్ ఫోన్ ధరలు: Galaxy S20 FE, Galaxy S21 FE 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారీగా పడిపోయిన శాంసంగ్ ఫోన్ల ధరలు
  • ఫ్లాగ్షిప్ డివైజెస్ Galaxy S20 FE, Galaxy S21 FE ఫోన్లపై భారీ డిస్కౌంట్
  • ఊహించని రీతిలో కనిపిస్తోన్న ధరలు, ఫ్లాగ్షిప్ సొంతం చేసుకునేందుకు ఇదే మంచి సమయం

మీడియం బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్లను కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి. కంపెనీలు కూడా అదే రేంజ్ ఫోన్లను అందించాలని భావిస్తాయి. ప్రముఖ కంపెనీ శాంసంగ్ లో ఎస్-సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లను అందరూ కొనలేరు. వాటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే మిండ్-రేంజ్ లో ఫ్లాగ్షిప్ అనుభూతిని అందించేందుకు శాంసంగ్ సంస్థ, ఎస్-సిరీస్ లో ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) ని తీసుకొచ్చింది. ఫ్లాగ్షిప్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ ఫోన్ల ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. దీంతో ఈ ఫోన్లను కొనేందుకు శాంసంగ్ ఎస్-సిరీస్ లవర్స్ ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా Galaxy S20 FE, Galaxy S21 FE ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించబడింది. ధర తగ్గడమే గాక, బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో మరింత చౌకగా ఈ ఫోన్లు లభిస్తున్నాయి.

వన్‌ప్లస్, రియల్మీ కంపెనీలకు చెందిన ఎక్కువ ఖరీదైన ఫోన్లకి Galaxy S20 FE, Galaxy S21 FE పోటీ ఇస్తున్నాయి. ఈ పండుగ సీజన్ లో Galaxy S20 FE, Galaxy S21 FE ఫోన్లను రూ.30,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Samsung ఆఫర్లు

Galaxy S20 FE 5జీ ఫోన్ రూ.29,999 ధరకే లభిస్తోంది. అలాగే శాంసంగ్ షాప్ యాప్ పై ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.3,000 అదనపు డిస్కౌంట్ కూడా వస్తుంది. దీంతో Galaxy S20 FE ఫోన్ రూ.26,999 కి లభించనుంది.

Samsung Galaxy S21 FE 5G కూడా ఫ్లిప్ కార్ట్ లో రూ.31,999 కి అందుబాటులో ఉంది. దీని సేల్ ప్రైస్ రూ.34,999 కాగా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి రూ.1500 అదనపు డిస్కౌంట్ లభించనుంది. ఈ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.1500 అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది.

Samsung Galaxy S21 FE స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ 2కే డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇందులో ఉంది. ఎగ్జినోస్ 2100 చిప్సెట్ ని ఇందులో అమర్చారు. ఈ చిప్ 5నానో మీటర్ ప్లాట్ఫామ్ పై తయారైంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy S21 ఫ్యాన్ ఎడిషన్ లో 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 12ఎంపి మెయిన్ సెన్సర్, 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32 ఎంపి కెమెరాను అమర్చారు.

Samsung Galaxy S21 FE లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ డ్యూయల్ సిమ్ 4జీ, 5జీ సపోర్ట్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post దిగొచ్చిన శాంసంగ్ ఫోన్ ధరలు: Galaxy S20 FE, Galaxy S21 FE 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>