Samsung Galaxy S23 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Apr 2024 18:06:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-galaxy-s23-plus-galaxy-s23-ultra-india-prices-pre-booking-offers/ Thu, 02 Feb 2023 11:30:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4758 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ […]

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 1 న భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్స్
  • భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, ఆఫర్స్ ని ప్రకటించిన శాంసంగ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది.

Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ ఎస్23 కంటే పెద్ద డిస్ప్లే, బ్యాటరీతో వచ్చింది. ఇక ఎస్23 ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో వచ్చింది. ప్రస్తుతం Samsung Galaxy S23 సిరీస్ వివిధ మాధ్యమాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఓసారి భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy S23 ధర

స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ధర రూ.74,999. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.79,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, ల్యావెండర్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Plus ధర

Samsung Galaxy S23 Plus 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది. 8జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Ultra ధర

Samsung Galaxy S23 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.1,24,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,34,999 గా ఉంది. ఇక 1టిబి వేరియంట్ ధర రూ.1,54,999 గా ఉంది.

Samsung Galaxy S23 Ultra ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయతే ఈ డివైజ్ రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో కేవలం శాంసంగ్.కామ్ ద్వారా మాత్రమే లభించనుంది.

Samsung Galaxy S23 Ultra ప్రీ-బుకింగ్ ద్వారా పలు ఆఫర్లు లభించనున్నాయి. గెలాక్సీ వాచ్ 4 ఎల్టీఈ క్లాసిక్ మరియు గెలాక్సీ బడ్స్ 2 ప్రత్యేక ధర రూ.4,999 వద్ద లభిస్తాయి. Samsung Galaxy S23+ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లు Galaxy Watch 4 BT ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S23 ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లు రూ.5000 విలువజేసే స్టోరేజీ అప్‌గ్రేడ్ ఆఫర్ ని పొందనున్నారు. అదనంగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-galaxy-s23-plus-launched-india-specs-price/ Wed, 01 Feb 2023 18:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=4746 బుధవారం నాడు జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 ఫోన్లు లాచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Plus మరియు Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus డివైజెస్ స్నాప్ డ్రాగన్ […]

The post Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • 6.1-ఇంచ్ మరియు 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే తో లాంచైన Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన రెండు డివైజెస్

బుధవారం నాడు జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 ఫోన్లు లాచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Plus మరియు Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus ఫోన్ల ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్టజ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్, పంచ్-హోల్ కటౌట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వచ్చింది. మరోవైపు, Samsung Galaxy S23 Plus డివైజ్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, విజన్ బూస్టర్ ఉన్నాయి.

రెండు ఫోన్లు కూడా అత్యధిక క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజెస్ లో అడ్రెనో జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఓఐఎస్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి 3ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీస్ కోసం 12ఎంపి కెమెరా ఉంది.

Samsung Galaxy S23 డివైజ్ లో 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy S23 Plus లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ, వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్లలో ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus first appeared on 91Mobiles Telugu.

]]>