
బుధవారం నాడు జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 ఫోన్లు లాచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Plus మరియు Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus ఫోన్ల ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus స్పెసిఫికేషన్స్
Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్టజ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్, పంచ్-హోల్ కటౌట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వచ్చింది. మరోవైపు, Samsung Galaxy S23 Plus డివైజ్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, విజన్ బూస్టర్ ఉన్నాయి.
రెండు ఫోన్లు కూడా అత్యధిక క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజెస్ లో అడ్రెనో జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఓఐఎస్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి 3ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీస్ కోసం 12ఎంపి కెమెరా ఉంది.
Samsung Galaxy S23 డివైజ్ లో 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy S23 Plus లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ, వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్లలో ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











