Samsung Galaxy Z Fold 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jul 2023 10:14:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లలో ఉన్న టాప్-5 ఫీచర్లు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-5-flip-5-top-5-features/ Wed, 26 Jul 2023 16:00:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7340 దక్షిణ కొరియా దిగ్గజ టెక్ కంపెనీ Samsung తన అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 డివైజెస్ ని లాంచ్ చేసింది. అసలైతే ఆగస్టులో ఈ ఈవెంట్ జరుగుతుంటుంది. కానీ, జులై నెలకు ఈవెంట్ ని ప్రీపోన్ చేసారు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు గత డివైజెస్ తో పోల్చితే ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. Galaxy Flip 5 డివైజ్ 3.4-ఇంచ్ కవర్ స్క్రీన్ తో వచ్చింది. గత […]

The post Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లలో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడే లాంచైన Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వచ్చిన డివైజెస్
  • Samsung Galaxy Z Flip 5 ధర 999 డాలర్లు (సుమారు రూ.82,000)

దక్షిణ కొరియా దిగ్గజ టెక్ కంపెనీ Samsung తన అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 డివైజెస్ ని లాంచ్ చేసింది. అసలైతే ఆగస్టులో ఈ ఈవెంట్ జరుగుతుంటుంది. కానీ, జులై నెలకు ఈవెంట్ ని ప్రీపోన్ చేసారు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు గత డివైజెస్ తో పోల్చితే ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. Galaxy Flip 5 డివైజ్ 3.4-ఇంచ్ కవర్ స్క్రీన్ తో వచ్చింది. గత మోడల్ ఫ్లిప్ 4 1.9-ఇంచ్ కవర్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోన్లలో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

Samsung Galaxy Z Fold 5 టాప్ 5 ఫీచర్లు

1. డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో ఉన్న 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ డైనమిక్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే టాప్ 5 ఫీచర్లలో మొదటి స్థానంలో ఉంది.

2. కవర్ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో ఉన్న 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ డిస్ప్లే టాప్ 5 ఫీచర్లలో రెండో స్థానంలో ఉంది.

3. ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ టాప్ 3 ఫీచర్ గా నిలుస్తోంది.

4. కెమెరా: 50ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా నిలుస్తోంది.

5. ఫ్రంట్ కెమెరా: అండర్ డిస్ప్లే 4ఎంపి కెమెరా ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. ఇది టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు.

Samsung Galaxy Z Flip 5 టాప్ 5 ఫీచర్లు

1. డిస్ప్లే: Samsung Galaxy Z Flip 5 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

2. చిప్సెట్: Samsung Galaxy Z Flip 5 లో ఇవ్వబడిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా నిలుస్తోంది.

3. రియర్ కెమెరా: 12ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాలు టాప్ 5 ఫీచర్లలో స్థానం సంపాదించాయి. ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఈ కెమెరాలు అద్భుతమైన పెర్ఫామెన్స్ ని అందించనున్నాయని కంపెనీ చెబుతోంది.

4. స్టోరేజీ: 512జిబి హయ్యస్ట్ స్టోరేజీ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా స్థానం సంపాదించింది.

5. ఐపీ రేటింగ్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. టాప్ 5 ఫీచర్లలో దీనికి కూడా స్థానం కల్పించవచ్చు.

The post Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లలో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
7.6-ఇంచ్ Infinity Flex Display తో భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Fold 5 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-5-launched-india-price-specs-availability/ Wed, 26 Jul 2023 11:03:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=7333 దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నేడు తన స్వదేశంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. మొట్టమొదటిసారి రాజధాని సియోల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Samsung Galaxy Z Flip 5 భారత్ తో పాటు గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చాయి. కొత్తతరం ఫీచర్లు, హార్డ్‌వేర్ మార్పులు చేర్పులతో పవర్ ప్యాక్డ్ గా ఈ డివైజ్ లు యూజర్ల ముందుకు […]

The post 7.6-ఇంచ్ Infinity Flex Display తో భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Fold 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Fold 5, Z Flip 5
  • 4ఎంపి అండర్ డిస్ప్లే కెమెరాతో వచ్చిన Z Fold 5
  • డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌ని వాడిన శాంసంగ్

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నేడు తన స్వదేశంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. మొట్టమొదటిసారి రాజధాని సియోల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Samsung Galaxy Z Flip 5 భారత్ తో పాటు గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చాయి. కొత్తతరం ఫీచర్లు, హార్డ్‌వేర్ మార్పులు చేర్పులతో పవర్ ప్యాక్డ్ గా ఈ డివైజ్ లు యూజర్ల ముందుకు వచ్చాయి.

Samsung Galaxy Z Fold 5 విషయానికి వస్తే, ఈ డివైజ్ 7.6-ఇంచ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే తో వచ్చింది. డైనమిక్ అమోలెడ్ 2x ప్యానెల్ ని ఈ స్క్రీన్ కొరకు వినియోగించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే, 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x కవర్ డిస్ప్లేని కూడా ఈ ఫోన్ లో అందించారు. ఇది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్‌లో Samsung Galaxy Z Fold 5 ధర

  • Samsung Galaxy Z Fold బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ ధర రూ.1,54,999
  • 12GB ర్యామ్, 512GB స్టోరేజీ మోడల్ ధర రూ.1,64,999
  • టాప్ వేరియంట్ 1TB స్టోరేజీ, 12GB ర్యామ్ ధర రూ.1,84,999

Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్స్

  • ప్రైమరీ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ డైనమిక్ అమోలెడ్ 2x ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 374 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Fold 5 లో 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కవర్ కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
  • అండర్ డిస్ప్లే కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 4 మెగా పిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా ఉంది.
  • రియర్ కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ ఓఐఎస్ మెయిన్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
  • చిప్సెట్: Samsung Galaxy Z Fold 5 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy Z Fold 5 లో పవర్ బ్యాకప్ కోసం 4400 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • వాటర్ రెసిస్టన్స్: ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో Samsung Galaxy Z Fold 5 వచ్చింది.
  • ఓఎస్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy Z Fold 5 లో 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్.కామ్ పై ఫోన్ కొంటే గ్రే, బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

The post 7.6-ఇంచ్ Infinity Flex Display తో భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Fold 5 first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-launch-date-july-26th-fold-5-flip-5-might-launch/ Thu, 06 Jul 2023 16:09:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=7103 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తన తదుపరి Galaxy Unpacked ఈవెంట్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ సంస్థ Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. సరే, ఓసారి శాంసంగ్ నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy Unpacked ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ జులై […]

The post జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తొలిసారిగా సియోల్ లో జరుగుతోన్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • ఈవెంట్ లో Galaxy Z Fold 5, Flip 5 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • భారత్ లో అందుబాటులోకి వచ్చిన ప్రీ-రిజర్వ్ పోర్టల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తన తదుపరి Galaxy Unpacked ఈవెంట్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ సంస్థ Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. సరే, ఓసారి శాంసంగ్ నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Unpacked ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్

జులై 26 వ తేదీన రాత్రి 7 గంటలకు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరగనుంది. శాంసంగ్ వెబ్ సైట్ మరియు యూట్యూబ్ చానల్ ద్వారా ఈ ఈవెంట్ ని చూడవచ్చు. ప్రత్యక్షప్రసారం కానున్న ఈవెంట్ లో శాంసంగ్ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పటికే భారత్ లో ప్రీ-రిజర్వ్ సెషన్ ని ప్రారంభించింది.

జులైలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుందని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది శాంసంగ్ నుంచి ఇది రెండవ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. ఫిబ్రవరిలో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన మొదటి ఈవెంట్ లో Galaxy S23, Book 3 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. కానీ, ఈసారి కంపెనీ స్వదేశంలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది.

Samsung India వెబ్‌సైట్ లో మొదలైన ప్రీ-రిజర్వ్ సెషన్

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, Galaxy Tab S9, Tab S9 Plus, Tab S9 Ultra ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ సంస్థ భారత్ లో ప్రీ-రిజర్వేషన్స్ ప్రారంభించింది. రూ.1,999 విలువగల రిఫండబుల్ ప్రీ-రిజర్వ్ పాస్ ని కొనుగోలు చేయవచ్చు. దీని వల్లన మొదటగా కొత్త గెలాక్సీ డివైజెస్ ని దక్కించుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాదు, రూ.5,000 ఈ-వోచర్ ని శాంసంగ్ ఆన్‌లైన్ షాప్ లో ఉపయోగించుకోవచ్చు.

The post జులై 26 న జరగనున్న Samsung Galaxy Unpacked ఈవెంట్; లాంచ్ కానున్న Galaxy Z Fold 5, Flip 5 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy Z Fold 5 పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-fold-5-full-specifications-leaked-before-launch/ Fri, 16 Jun 2023 09:50:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=6805 Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫోల్డబుల్ ఫోన్ వచ్చే నెలలో సియోల్‌లో లాంచ్ చేయబడుతుందని కన్ఫర్మ్ అయ్యింది. Galaxy Fold 5 అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ఆగస్ట్‌లో US మరియు కెనడా మార్కెట్‌ లకు వేర్వేరుగా హోస్ట్ చేయబడుతుంది. అయితే శామ్సంగ్ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు, రూమర్స్ ద్వారా రాబోయే గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవేనంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో హడావుడి […]

The post లీకైన Samsung Galaxy Z Fold 5 పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పలు మార్పులతో రానున్న Samsung Galaxy Z Fold 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ లో వాటర్‌డ్రాప్ హింజ్, IPX8 రేటింగ్ ఉంటాయని అంచనా

Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫోల్డబుల్ ఫోన్ వచ్చే నెలలో సియోల్‌లో లాంచ్ చేయబడుతుందని కన్ఫర్మ్ అయ్యింది. Galaxy Fold 5 అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ఆగస్ట్‌లో US మరియు కెనడా మార్కెట్‌ లకు వేర్వేరుగా హోస్ట్ చేయబడుతుంది. అయితే శామ్సంగ్ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు, రూమర్స్ ద్వారా రాబోయే గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవేనంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో హడావుడి చేస్తున్నాయి. ఒక కొత్త లీక్ ఇప్పుడు Galaxy Z Fold 5 యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లను జాబితా చేసింది.

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు. ఇది Galaxy Z Fold 5 హార్డ్‌వేర్ విభాగంలో ఎక్కువ అప్‌గ్రేడ్‌లను పొందకపోవచ్చని తెలుస్తోంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కన్నా ముందు బయటకు వచ్చిన Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లను చూద్దాం.

ఇప్పటి వరకు లీకైన Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Z Fold 5 పలు అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది. ఇది జూలైలో సియోల్‌లో ప్రారంభించబడుతుంది. లాంచ్‌కు ముందు, టిప్‌స్టర్ బ్రార్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు, ఇది ఫోల్డబుల్ ఫోన్, ఎక్కువ లేదా తక్కువ అవుట్‌గోయింగ్ మోడల్‌ను పోలి ఉండవచ్చు. అయితే అప్‌డేట్ చేయబడిన ప్రాసెసర్ మరియు కొన్ని ఇతర మార్పులు ఈ ఫోన్ లో ఉంటాయని భావిస్తున్నారు.

Galaxy Z Fold 5 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో రానుందని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ తెలిపారు. గతంలో ఈ డివైజ్ 12GB RAMతో Geekbenchలో కనిపించింది. శామ్‌సంగ్ Z ఫోల్డ్ 5ని 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ చేసే అవకాశం ఉందని బ్రార్ తెలిపారు. ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసే ప్రాంతాల ఆధారంగా స్టోరేజ్ ఆప్షన్‌లు మారుతూ ఉంటాయి.

మిగిలిన స్పెసిఫికేషన్‌లు గత మోడల్‌ను పోలి ఉంటాయి. 7.6-అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6.2-అంగుళాల కవర్ డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్ మొదలైనవి ఉంటాయి.  ఈ డివైజ్ IPX8 రేటింగ్‌ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

  • ఫోల్డబుల్ డిస్‌ప్లే: Samsung Galaxy Z Fold 5 లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగిన 7.6-అంగుళాల QXGA+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది.
  • ఔటర్ డిస్‌ప్లే: ఈ ఫోన్ లో 6.2-అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: ఈ ఫోన్ లో Snapdragon 8 Gen 2 చిప్సెట్ వాడానున్నట్లు సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ డివైజ్ 12GB RAM, 256GB/ 512GB/ 1TB స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తుందని సమాచారం.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • వెనుక కెమెరా: ఈ ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరా ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: ఈ డివైజ్ లో 4MP అండర్-స్క్రీన్ కెమెరా, 10MP ఔటర్ స్క్రీన్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Android 13-ఆధారిత One UI 5.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IPX8 రేటింగ్ మొదలైనవి ఉంటాయి.

The post లీకైన Samsung Galaxy Z Fold 5 పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy Unpacked 2023: జులైలో లాంచ్ కానున్న శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-event-july-south-korea-galaxy-z-fold-5-galaxy-z-flip-5-might-launch/ Wed, 07 Jun 2023 10:02:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=6653 వచ్చే నెల అంటే జూలైలో ‘అన్‌ప్యాక్డ్ ఈవెంట్’ను నిర్వహించబోతున్నట్లు Samsung అధికారిక ప్రకటన చేసింది. ఈ ఈవెంట్ లో కంపెనీ యొక్క కొత్త ఫోల్డబుల్ డివైజెస్ టెక్ మార్కెట్లో లాంచ్ అవుతాయి. ఇందులో Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 ఉండవచ్చు. మీరు ఈవెంట్ వివరాలను మరియు ఫోన్‌ల అంచనా స్పెసిఫికేషన్‌లను ఇక్కడ తెలుసుకోండి. Samsung Galaxy Z Fold 5 మరియు Z Flip 5 విడుదల సమయం (గ్లోబల్) […]

The post Galaxy Unpacked 2023: జులైలో లాంచ్ కానున్న శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

వచ్చే నెల అంటే జూలైలో ‘అన్‌ప్యాక్డ్ ఈవెంట్’ను నిర్వహించబోతున్నట్లు Samsung అధికారిక ప్రకటన చేసింది. ఈ ఈవెంట్ లో కంపెనీ యొక్క కొత్త ఫోల్డబుల్ డివైజెస్ టెక్ మార్కెట్లో లాంచ్ అవుతాయి. ఇందులో Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 ఉండవచ్చు. మీరు ఈవెంట్ వివరాలను మరియు ఫోన్‌ల అంచనా స్పెసిఫికేషన్‌లను ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy Z Fold 5 మరియు Z Flip 5 విడుదల సమయం (గ్లోబల్)

శామ్సంగ్ ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రారంభ తేదీని ఇవ్వలేదు కానీ కంపెనీ తదుపరి ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్ జూలై చివరిలో నిర్వహించబడుతుందని స్పష్టం చేసింది. ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరగనున్న సామ్‌సంగ్ యొక్క 27వ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. విశేషమేమిటంటే, Samsung తన స్వదేశమైన దక్షిణ కొరియాలో ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.

Samsung Galaxy Z Fold 5 మరియు Z Flip 5 మోడల్స్

జూలైలో జరగనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త ఫోల్డబుల్ డివైజ్‌ను ప్రదర్శించనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ఫోన్‌ల పేరు గురించి కంపెనీ సమాచారం ఇవ్వనప్పటికీ, ఇవి Samsung Galaxy Z Fold 5 మరియు Samsung Galaxy Z Flip 5 అని భావిస్తున్నారు.

Samsung Galaxy Z Fold 5 మరియు Z Flip 5 ఇండియా విడుదల తేదీ

27వ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ అనేది సియోల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడే గ్లోబల్ ఈవెంట్. కొంతకాలంగా, సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ జెడ్ మరియు గెలాక్సీ ఎస్ స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్ లాంచ్‌తో పాటు భారతీయ మార్కెట్లో విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. జూలైలో గ్లోబల్ లాంచ్‌తో పాటు, Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 కూడా భారతదేశంలో అధికారికంగా మారవచ్చు.

Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్‌లో 6.2-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే ఇవ్వవచ్చు. ఫోల్డ్ ఫోన్‌లో బయటి నుండి కనిపించే కవర్ స్క్రీన్ ఇది. అదే సమయంలో, ఫోన్‌లో 7.6 అంగుళాల ఇంటర్నల్ స్టోరేజీని చూడవచ్చు, ఇది ఫోన్‌ను డైరీ లాగా తెరిచిన తర్వాత తెలుస్తుంది. రెండింటినీ డైనమిక్ AMOLED ప్యానెల్‌లలో ఉపయోగించవచ్చు.
  • ప్రాసెసర్: Galaxy Z Fold 5ని Qualcomm Snapdragon 8 Gen 2 Octacore ప్రాసెసర్‌లో 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై నిర్మించవచ్చు, ఇది 3.2GHz క్లాక్ స్పీడ్‌తో పని చేస్తుంది. అదే సమయంలో, గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్‌లో Adreno 740 GPU చూడవచ్చు.
  • కెమెరా: ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఇవ్వవచ్చు. వెనుక ప్యానెల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ చూడవచ్చు. అదేవిధంగా, ముందు ప్యానెల్‌లో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇవ్వవచ్చు.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం, గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లో 4,700 mAh పెద్ద బ్యాటరీని అందించవచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

Samsung Galaxy Z Flip 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: గెలాక్సీ Z ఫ్లిప్ 5 స్మార్ట్‌ఫోన్ గురించి ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.2-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే కూడా కనిపిస్తుంది, ఇది ఫోన్ లోపల ఇవ్వబడుతుంది. ఫోన్ మడతపెట్టిన తర్వాత, బయట కనిపించే స్క్రీన్ పరిమాణం 3.4 అంగుళాలు ఉంటుంది. దీనిని కవర్ డిస్ప్లే అని కూడా పిలుస్తారు.
  • ప్రాసెసర్: ప్రాసెసింగ్ కోసం, ఈ Samsung ఫోన్‌కు 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌లతో తయారు చేయబడిన Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ఇవ్వబడుతుంది, ఇది 3.2GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్‌లో Adreno 730 GPU ఇవ్వడం గురించి చర్చ జరిగింది.
  • కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక ప్యానెల్‌లో F / 1.8 ఎపర్చరుతో 12-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ మరియు F / 2.2 ఎపర్చర్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అందించవచ్చు. అదేవిధంగా, సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్‌లో F / 2.4 ఎపర్చర్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చవచ్చు.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy Z Flip 5లో 3,700 mAh బ్యాటరీని అందించవచ్చు. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్‌లో 27W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

The post Galaxy Unpacked 2023: జులైలో లాంచ్ కానున్న శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>