
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నేడు తన స్వదేశంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. మొట్టమొదటిసారి రాజధాని సియోల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Samsung Galaxy Z Flip 5 భారత్ తో పాటు గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చాయి. కొత్తతరం ఫీచర్లు, హార్డ్‌వేర్ మార్పులు చేర్పులతో పవర్ ప్యాక్డ్ గా ఈ డివైజ్ లు యూజర్ల ముందుకు వచ్చాయి.
Samsung Galaxy Z Fold 5 విషయానికి వస్తే, ఈ డివైజ్ 7.6-ఇంచ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే తో వచ్చింది. డైనమిక్ అమోలెడ్ 2x ప్యానెల్ ని ఈ స్క్రీన్ కొరకు వినియోగించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే, 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x కవర్ డిస్ప్లేని కూడా ఈ ఫోన్ లో అందించారు. ఇది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్‌లో Samsung Galaxy Z Fold 5 ధర
- Samsung Galaxy Z Fold బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ ధర రూ.1,54,999
- 12GB ర్యామ్, 512GB స్టోరేజీ మోడల్ ధర రూ.1,64,999
- టాప్ వేరియంట్ 1TB స్టోరేజీ, 12GB ర్యామ్ ధర రూ.1,84,999
Samsung Galaxy Z Fold 5 స్పెసిఫికేషన్స్
- ప్రైమరీ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ డైనమిక్ అమోలెడ్ 2x ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 374 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Fold 5 లో 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- కవర్ కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
- అండర్ డిస్ప్లే కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 4 మెగా పిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా ఉంది.
- రియర్ కెమెరా: Samsung Galaxy Z Fold 5 లో 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ ఓఐఎస్ మెయిన్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
- చిప్సెట్: Samsung Galaxy Z Fold 5 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ, ర్యామ్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy Z Fold 5 లో పవర్ బ్యాకప్ కోసం 4400 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- వాటర్ రెసిస్టన్స్: ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో Samsung Galaxy Z Fold 5 వచ్చింది.
- ఓఎస్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy Z Fold 5 లో 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy Z Fold 5 డివైజ్ ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్.కామ్ పై ఫోన్ కొంటే గ్రే, బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.











