SDPPI - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 May 2024 09:45:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-global-variant-received-indonesia-telecom-and-eurofins-certifications/ Fri, 17 May 2024 09:37:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11586 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO A3 Pro 5G గ్లోబల్ […]

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro 5G గ్లోబల్ లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • ఐపీ69 రేటింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ, చార్జింగ్ వివరాలు

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై CPH2639 అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. యూరోఫిన్స్ డేటాబేస్ పై OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ 4,970 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అని ప్రజెంట్ చేయవచ్చు.

యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇప్పటికే OPPO A3 Pro 5G డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. గ్లోబల్ వేరియంట్ కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని చెప్పలేం. ఓసారి OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-pro-listed-on-bis-soon-launch-india/ Wed, 08 May 2024 15:15:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=11417 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు ఎస్డీపీపీఐ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం […]

The post OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12 Pro లాంచ్
  • డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్
  • SDPPI లిస్టింగ్ మోడల్ నంబర్ CPH2629

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు ఎస్డీపీపీఐ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 Pro సర్టిఫికేషన్ వివరాలు

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ ఎస్టీపీపీఐ సర్టిఫికేషన్ పై CPH2629 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro యొక్క పేరు కూడా ఈ లిస్టింగ్ పై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఫోన్ బీఐఎస్, ఐఎండీఏ, ఈఈసీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో OPPO Reno 12 Pro త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది.

టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై ఒప్పో రెనో 12 ప్రో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ Camera FV-5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, OPPO Reno 12 Pro ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: OPPO Reno 12 Pro లో 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ https://www.91mobiles.com/telugu/redmi-13-4g-received-nbtc-sdppi-certifications/ Thu, 02 May 2024 08:28:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11316 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా […]

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా కనిపించింది. ఓసారి Redmi 13 4G సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.

Redmi 13 4G SDPPI, NBTC లిస్టింగ్స్

Redmi 13 4G ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై 24040RN64Y అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Redmi 13 4G ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై 2404ARN45A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ పై Redmi 13 4G డివైజ్ ని MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది.

ఎన్బీటీసీ మరియు ఎస్డీపీపీఐ లిస్టింగ్స్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Redmi 13 4G డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

Redmi 13 4G డివైజ్ పోకో ఎమ్6 4జీ కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.

ఓఎస్: Redmi 13 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>