SIRIM - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 May 2024 15:18:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-sirim-certification-details/ Mon, 27 May 2024 15:16:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11748 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ మలేషియాకు చెందిన ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ వివరాలు OnePlus Nord CE […]

The post OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక లైట్ వర్షన్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ మలేషియాకు చెందిన ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ వివరాలు

OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ మలేషియాకు చెందిన SIRIM సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై CPH2621 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus Nord CE 4 Lite 5G సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ ఎప్పుడు?

OnePlus Nord CE 4 Lite 5G కొన్ని రోజుల క్రితం భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలో భారత్ లో కూడా లాంచ్ కానుందని అర్థమవుతోంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6GHz.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) https://www.91mobiles.com/telugu/vivo-v27e-bis-sirim-certifications-india-launch-imminent/ Thu, 16 Feb 2023 05:29:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4951 Vivo సంస్థ ఇప్పటికే Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. Vivo V27 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, మరియు Vivo V27e. అయితే వీటిలో Vivo V27e మాత్రం తర్వత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V27e ఫోన్ పలు […]

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • లైనప్ లో భాగంగా వస్తోన్న Vivo V27, Vivo V27 Pro, Vivo V27e
  • నేడు బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ మరియు మలేషియన్ ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V27e

Vivo సంస్థ ఇప్పటికే Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. Vivo V27 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, మరియు Vivo V27e. అయితే వీటిలో Vivo V27e మాత్రం తర్వత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V27e ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ ని విజిట్ చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

BIS మరియు SIRIM సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V27e స్మార్ట్ ఫోన్ బీఐఎస్ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్స్ ని పొందినట్లు వెల్లడించాడు. అయితే ఈ రెండింట్లో ఏ సర్టిఫికేషన్ కూడా Vivo V27e యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని బయటపెట్టలేదు. మలేషియన్ సర్టిఫికేషన్ ఎస్ఐఆర్ఐఎమ్ ఫోన్ యొక్క మోడల్ పేరుని కన్ఫర్మ్ చేయగా, బీఐఎస్ సర్టిఫికేషన్ Vivo V27e ఫోన్ భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టతనిచ్చింది.

Vivo V27 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>