
Vivo సంస్థ ఇప్పటికే Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. Vivo V27 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, మరియు Vivo V27e. అయితే వీటిలో Vivo V27e మాత్రం తర్వత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V27e ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ ని విజిట్ చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
BIS మరియు SIRIM సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్)
vivo V27e receives the SIRIM certification and the Indian BIS certification.#vivo #vivoV27e pic.twitter.com/PAyxUE2pi6
— Mukul Sharma (@stufflistings) February 16, 2023
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V27e స్మార్ట్ ఫోన్ బీఐఎస్ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్స్ ని పొందినట్లు వెల్లడించాడు. అయితే ఈ రెండింట్లో ఏ సర్టిఫికేషన్ కూడా Vivo V27e యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని బయటపెట్టలేదు. మలేషియన్ సర్టిఫికేషన్ ఎస్ఐఆర్ఐఎమ్ ఫోన్ యొక్క మోడల్ పేరుని కన్ఫర్మ్ చేయగా, బీఐఎస్ సర్టిఫికేషన్ Vivo V27e ఫోన్ భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టతనిచ్చింది.
Vivo V27 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











