Snapdragon 8+ Gen 1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 15 Jul 2022 09:13:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలోనే లాంచ్ కానున్న OPPO Find X5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్, OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-to-launch-find-x-5-pro-snapdragon-8plus-gen1-edition-and-find-n2-foldable-phone/ Fri, 15 Jul 2022 09:13:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1002 హైలైట్స్: ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్ పై పని చేస్తున్న ఒప్పో ఒప్పో నుంచి త్వరలో రానున్న ఫైండ్ ఎన్2 ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో వాచ్ 3, బ్యాండ్ 2 లాంచ్ అయ్యే అవకాశం కొన్ని రోజుల క్రితమే ఒప్పో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో ని లాంచ్ చేసింది. అయితే ఇతర అన్ని బ్రాండ్స్ కూడా తమ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ […]

The post త్వరలోనే లాంచ్ కానున్న OPPO Find X5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్, OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్ పై పని చేస్తున్న ఒప్పో
  • ఒప్పో నుంచి త్వరలో రానున్న ఫైండ్ ఎన్2 ఫోల్డబుల్ ఫోన్
  • ఒప్పో వాచ్ 3, బ్యాండ్ 2 లాంచ్ అయ్యే అవకాశం

కొన్ని రోజుల క్రితమే ఒప్పో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో ని లాంచ్ చేసింది. అయితే ఇతర అన్ని బ్రాండ్స్ కూడా తమ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ ని స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో తీసుకొస్తున్నాయి. దీంతో ఒప్పో కూడా పైండ్ ఎక్స్5 ప్రో యొక్క స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి ఏడాది ఒప్పో నుంచి ఒక ఫ్లాగ్ షిప్ రావడం తెలిసిన విషయమే. కానీ ఈసారి కొత్త ఫ్లాగ్ షిప్ కి బదులుగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ ని లాంచ్ చేయనుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ తో పాటు ఒప్పో నుంచి ఫైండ్ ఎన్2 ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఒప్పో నుంచి రానున్న ఫైండ్ ఎక్స్5 ప్రో న్యూ ఎడిషన్ మరియు ఎన్ 2 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కోసం ఒప్పో లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. మరి ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఫీచర్లు ఏ విధంగా ఉండనున్నాయో రానున్న రోజుల్లో తెలిసే అవకాశముంది.

త్వరలో లాంచ్ కానున్న OPPO Find X5 Pro, OPPO Find N2, నెక్ట్స్-జెన్ వేరబుల్స్

ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కథనం ప్రకారం, ఒప్పో త్వరలో ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ డివైజ్ 2022 ఆగస్టులో లాంచ్ కానున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. అలాగే నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ఫైండ్ ఎన్2 (కోడ్ నేమ్: డ్రాగన్ ఫ్లై), సరికొత్త కలర్ఓఎస్ 13.. 2022 ద్వితీయార్థంలో లాంచ్ అవ్వనున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

పైన పేర్కొనబడిన ఉత్పత్తుల యొక్క లాంచ్ టైమ్ లైన్ కి సంబంధించిన లీక్డ్ ఇన్ఫోని బట్టి, ఒప్పో వాచ్ 3, ఒప్పో బ్యాండ్ 2 వేరబుల్స్ ని సదరు కంపెనీ అతి త్వరలో లాంచ్ చేయనుందట. అయితే కచ్చితమైన లాంచ్ సమయం, ఇతర వివరాలు ప్రస్తుతానికి తెలియదు.

OPPO Find X5 Pro స్పెసిఫికేషన్స్

6.7 అంగుళాల క్యూఎచ్డీ+ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి+50ఎంపి+13ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 32ఎంపి ప్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ ఎయిర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో ఫోన్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒప్పో నుంచి ఈ ఫోన్స్ లాంచ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post త్వరలోనే లాంచ్ కానున్న OPPO Find X5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్, OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ https://www.91mobiles.com/telugu/realme-gt2-master-explorer-edition-china-launch-100w-fast-charging-snapdragon-8plus-gen1-chipset/ Tue, 12 Jul 2022 11:57:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=917 హైలైట్స్: * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. * స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500) అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. […]

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది.

* స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500)

అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న తొలి రియల్ మీ ఫోన్ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్. గత రెండు జీటీ 2 మోడల్స్ ఉన్నట్లుగానే తాజాగా వచ్చిన జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఉంది. కానీ, గోల్డ్ కలర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఉన్న మూడు ఆప్షన్స్ లో ఈ గోల్డ్ కలర్ ఎలిగంట్ మరియు ప్రీమియమ్ గా కనిపిస్తోంది. వెనుక ప్యానెల్ చూస్తే, ఫ్రేమ్ చుట్టూ డార్క్ బ్రౌన్ కేసింగ్ తో ఆకట్టుకుంటోంది.

సెల్ఫీ షూటర్ కోసం పంచ్-హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వెనుకాల ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్లో కీలక ఫీచర్లు.

Realme GT 2 Master Explorer ఎడిషన్ ధర

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ 8జిబి+128జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3499 (రూ.41,500), 8జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3799 (రూ.45,000), 12జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3999 (రూ.47,300). ఇక ఈ ఫోన్ నలుపు, తెలుపు, బంగారు వర్ణాల్లో లభిస్తుంది.

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 100 శాతం P3 కలర్ గేముత్, 94.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, పంచ్ హోల్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0, పిక్సెల్ వర్క్స్ ఎక్స్7 గ్రాఫిక్స్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే, 5G, 4G LTE, Bluetooth, GPS, NFC, USB Type-C పోర్ట్ వంటి ఛార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ ఫర్ ఫీచర్లున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో సపోర్ట్, 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఫోన్ వెడల్పు 8.17 మి.మీ కాగా, బరువు 195 గ్రాములు.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 50MP సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>