హైలైట్స్:
- ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వేరియంట్ పై పని చేస్తున్న ఒప్పో
- ఒప్పో నుంచి త్వరలో రానున్న ఫైండ్ ఎన్2 ఫోల్డబుల్ ఫోన్
- ఒప్పో వాచ్ 3, బ్యాండ్ 2 లాంచ్ అయ్యే అవకాశం

కొన్ని రోజుల క్రితమే ఒప్పో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో ని లాంచ్ చేసింది. అయితే ఇతర అన్ని బ్రాండ్స్ కూడా తమ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ ని స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో తీసుకొస్తున్నాయి. దీంతో ఒప్పో కూడా పైండ్ ఎక్స్5 ప్రో యొక్క స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి ఏడాది ఒప్పో నుంచి ఒక ఫ్లాగ్ షిప్ రావడం తెలిసిన విషయమే. కానీ ఈసారి కొత్త ఫ్లాగ్ షిప్ కి బదులుగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ ని లాంచ్ చేయనుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ తో పాటు ఒప్పో నుంచి ఫైండ్ ఎన్2 ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఒప్పో నుంచి రానున్న ఫైండ్ ఎక్స్5 ప్రో న్యూ ఎడిషన్ మరియు ఎన్ 2 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కోసం ఒప్పో లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. మరి ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఫీచర్లు ఏ విధంగా ఉండనున్నాయో రానున్న రోజుల్లో తెలిసే అవకాశముంది.
త్వరలో లాంచ్ కానున్న OPPO Find X5 Pro, OPPO Find N2, నెక్ట్స్-జెన్ వేరబుల్స్

ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కథనం ప్రకారం, ఒప్పో త్వరలో ఫైండ్ ఎక్స్5 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ డివైజ్ 2022 ఆగస్టులో లాంచ్ కానున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. అలాగే నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ఫైండ్ ఎన్2 (కోడ్ నేమ్: డ్రాగన్ ఫ్లై), సరికొత్త కలర్ఓఎస్ 13.. 2022 ద్వితీయార్థంలో లాంచ్ అవ్వనున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.
పైన పేర్కొనబడిన ఉత్పత్తుల యొక్క లాంచ్ టైమ్ లైన్ కి సంబంధించిన లీక్డ్ ఇన్ఫోని బట్టి, ఒప్పో వాచ్ 3, ఒప్పో బ్యాండ్ 2 వేరబుల్స్ ని సదరు కంపెనీ అతి త్వరలో లాంచ్ చేయనుందట. అయితే కచ్చితమైన లాంచ్ సమయం, ఇతర వివరాలు ప్రస్తుతానికి తెలియదు.
OPPO Find X5 Pro స్పెసిఫికేషన్స్
6.7 అంగుళాల క్యూఎచ్డీ+ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి+50ఎంపి+13ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 32ఎంపి ప్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ ఎయిర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో ఫోన్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒప్పో నుంచి ఈ ఫోన్స్ లాంచ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.











