#Snapdragon8PlusGen1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 07 Jul 2022 12:20:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న Realme GT 2 Master Explorer Edition https://www.91mobiles.com/telugu/lpddr5x-ram/ Thu, 07 Jul 2022 12:03:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=818 ప్రత్యేకతలు: * ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ (LPDDR5X RAM) * స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 100W/150W ఫాస్ట్ ఛార్జింగ్ * జులై 12 న చైనాలో ఎంట్రీ రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ జులై 12 న చైనాలో లాంచ్ కానుంది. ఇటీవలె కంపెనీ ఫోన్ కి సంబంధించిన కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ […]

The post ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న Realme GT 2 Master Explorer Edition first appeared on 91Mobiles Telugu.

]]>
ప్రత్యేకతలు:

* ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ (LPDDR5X RAM)

* స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 100W/150W ఫాస్ట్ ఛార్జింగ్

* జులై 12 న చైనాలో ఎంట్రీ

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ జులై 12 న చైనాలో లాంచ్ కానుంది. ఇటీవలె కంపెనీ ఫోన్ కి సంబంధించిన కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ యొక్క డిజైన్ ను కూడా కంపెనీ రివీల్ చేసింది. దీన్ని బట్టి హ్యండ్సెట్ ఎలా ఉండనుందోనన్న దానిపై ఓ అవగాహన ఏర్పడింది. రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ స్లిమ్మెస్ట్ బెజెల్స్ ని కలిగి ఉంటుందని రియల్ మీ కంపెనీ చెబుతోంది.

తాజాగా రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ కు సంబంధించిన ర్యామ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్నిబట్టి, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ LPDDR5X ర్యామ్ తో వస్తుందని తెలుస్తోంది. దీంతో ఫోన్ యొక్క పెర్ఫామెన్స్ పెరగడమే గాక, శక్తి వినియోగం కూడా తగ్గనుంది.

LPDDR5X RAM సపోర్ట్ తో వస్తున్న Realme GT 2 Master Explorer Edition

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న తొలి ఫోన్ రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్. దీంతో ఫోన్ యొక్క శక్తి వినియోగం 20 శాతానికి తగ్గనుంది. అలాగే గేమింగ్ పెర్ఫామెన్స్ 30 శాతం మేర పెరగనుంది.

Realme GT 2 Master Explorer Edition స్పెసిఫికేషన్స్

ముందు అనుకున్నట్లుగా, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనున్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ నిక్షిప్తం చేయబడింది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 100w/150w ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రియల్ మీ జీటీ 2 మాస్టర్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది.

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అలాగే ఇందులో వెనుకవైపు 50ఎంపి ప్రైమరీ, 50ఎంపి అల్ట్రా వైడ్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 స్కిన్ పై రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఫోన్ పని చేయనుంది.

The post ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న Realme GT 2 Master Explorer Edition first appeared on 91Mobiles Telugu.

]]>