Tata Group - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 17 Nov 2022 09:02:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు https://www.91mobiles.com/telugu/apple-iphones-manufacturing-plant-hosur-bengaluru-tata-group/ Thu, 17 Nov 2022 09:02:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=3498 హైలైట్స్ కర్ణాటకలోని హోసూరుకి సమీపంలో రానున్న అతిపెద్ద Apple iPhones తయారీ కేంద్రం ఈ హబ్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించిన టెలీకామ్, ఐటీ మరియు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఐఫోన్స్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్న 6 వేల మంది గిరిజన మహిళలు బెంగళూరు హోసూరుకి సమీపంలో Apple iPhones యొక్క అతిపెద్ద తయారీ కేంద్రం రాబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని భారతీయ టెలీకామ్, ఐటీ […]

The post iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కర్ణాటకలోని హోసూరుకి సమీపంలో రానున్న అతిపెద్ద Apple iPhones తయారీ కేంద్రం
  • ఈ హబ్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించిన టెలీకామ్, ఐటీ మరియు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్
  • ఐఫోన్స్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్న 6 వేల మంది గిరిజన మహిళలు

బెంగళూరు హోసూరుకి సమీపంలో Apple iPhones యొక్క అతిపెద్ద తయారీ కేంద్రం రాబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని భారతీయ టెలీకామ్, ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ల తయారీపై ఇప్పటికే రాంచీ, హజారీభాగ్ లకు చెందిన 6,000 మందికి పైగా గిరిజన మహిళలు శిక్షణ పొందినట్లు మంత్రి తెలిపారు. వీరంతా త్వరలోనే విధుల్లో చేరతారని మంత్రి అన్నారు.

భారత్ కి కలిసొచ్చిన చైనా కొవిడ్ నిబంధనలు

భారత్ లో ఐఫోన్స్ తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఇటీవలె టాటా ఎలక్ట్రానిక్స్ పొందింది. దీంతో హోసూరులో ప్లాంట్ ని టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయబోతోంది. ఇదివరకు ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగట్రాన్ సంస్థలు భారత్ లో ఐఫోన్లను తయారు చేశాయి. ఫాక్స్‌కాన్ కి తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్ లో ఫెసిలీటీ సెంటర్ ఉండగా, పెగట్రాన్ కి చెన్నైకి సమీపంలో ప్లాంట్ ఉంది. ఇక విస్ట్రన్ కి బెంగళూరులో అసెంబ్లీ ప్లాంట్స్ ఉన్నాయి.

టాటా గ్రూప్, తైవానీస్ ఆపిల్ సప్లయ్యర్ తో కలిసి ఐఫోన్స్ ని భారత్ లో అసెంబ్లింగ్ చేసేందుకు ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయబోతోంది. ఇది విజయవంతమైతే, ఐఫోన్లను తయారు చేయనున్న తొలి భారతీయ కంపెనీగా టాటా నిలుస్తుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆదిపత్యం చెలాయిస్తోన్న చైనాకు భారత్ గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది.

18 నుంచి 24 నెలల కాల వ్యవధిలో 45,000 మంది మహిళలను విధుల్లోకి తీసుకోవాలని టాటా ప్లాన్ చేస్తోందని బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐఫోన్స్ యొక్క మెకానిక్స్ మరియు కేసింగ్స్ ని ఉత్పత్తి చేస్తోన్న ఫ్యాక్టరీలో 10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

చైనాలోని జెంగ్‌జౌ లో Foxconn కి ఐఫోన్స్ తయారీ కోసం అతిపెద్ద ప్లాంట్ ఉంది. అయితే ఆ ప్రాంతంలో కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి నెమ్మదించింది. దీంతో iPhone 14 Pro, Pro Max ఫోన్ల పంపిణీలో జాప్యం నెలకొంది. ఫోన్లను బుక్ చేసుకున్న కస్టమర్లు రోజుల తరబడి షిప్పింగ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ భారత్ మరియు ఇతర దేశాల్లో ఐఫోన్స్ తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది.

తాజా పరిణామాలతో తైవాన్ కి చెందిన Foxconn భారత్ లో తన వర్క్‌ఫోర్స్ ని 70,000 కి పెంచుకోవాలని నిర్ణయించింది. అంటే రానున్న రెండేళ్ళలో 53,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ప్రణాళిక వేసుకుంది. 2019 లో ఫాక్సాన్ ఆపరేషన్స్ ని మొదలుపెట్టింది. భారత్ లో తయారైన 85 శాతం ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అవుతుండగా, మిగతా 15 శాతం భారత్ లో అమ్ముడవుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు first appeared on 91Mobiles Telugu.

]]>
iPhones తయారు చేయనున్న Tata కంపెనీ? https://www.91mobiles.com/telugu/tata-group-to-produce-iphones-india/ Sun, 11 Sep 2022 04:30:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=2238 హైలైట్స్: భారత్ లో ఐఫోన్స్ ఉత్పత్తి చేసేందుకై జాయింట్ వెంచర్ ప్రారంభించనున్న టాటా గ్రూప్, తైవాన్ కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్, కొనసాగుతోన్న చర్చలు విస్ట్రన్ యొక్క ఇండియా ఆపరేషన్స్ లో షేర్స్ కొన్న టాటా, సదరు కంపెనీతో కలిసి కొత్త అసెంబ్లీ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని యోచన కొత్త వెంచర్ తో, ప్రస్తుతం విస్ట్రన్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్స్ కంటే 5 రెట్లు అధికమవ్వనున్న ఉత్పత్తి సామర్థ్యం ఇటీవలె ఆపిల్ సంస్థ ఐఫోన్ […]

The post iPhones తయారు చేయనున్న Tata కంపెనీ? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో ఐఫోన్స్ ఉత్పత్తి చేసేందుకై జాయింట్ వెంచర్ ప్రారంభించనున్న టాటా గ్రూప్, తైవాన్ కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్, కొనసాగుతోన్న చర్చలు
  • విస్ట్రన్ యొక్క ఇండియా ఆపరేషన్స్ లో షేర్స్ కొన్న టాటా, సదరు కంపెనీతో కలిసి కొత్త అసెంబ్లీ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని యోచన
  • కొత్త వెంచర్ తో, ప్రస్తుతం విస్ట్రన్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్స్ కంటే 5 రెట్లు అధికమవ్వనున్న ఉత్పత్తి సామర్థ్యం

ఇటీవలె ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను గ్లోబల్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాటా గ్రూప్, తైవానీస్ సప్లయ్యర్ విస్ట్రన్ కార్పొరేషన్ కలిసి భారత్ లో ఆపిల్ ఫోన్లను తయారు చేసేందుకై ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఆమేరకు బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఉప్పు, ఉక్కు, సాఫ్ట్‌వేర్ రంగాలలో తనదైన ముద్ర వేసిన టాటా, ఐఫోన్స్ ని తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించనుంది.

iPhones తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలవనున్న Tata?

అసలైతే ఆపిల్ ఫోన్లను విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ తయారు చేస్తాయి. భారత్ మరియు చైనాల్లో ఈ కంపెనీలు ఫోన్లను అసెంబుల్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్ల తయారీ, ఉత్పత్తి, అమ్మకాల విషయంలో చైనా ఆదిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగాల్లో చైనాది అగ్రస్థానమని చెప్పాలి. అయితే కొవిడ్ లాక్డౌన్స్, తదనంతర పరిణామాలతో గ్లోబల్ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ వరుసలో ఆపిల్ కూడా ఉంది. చైనాతో పాటు భారత్ తదితర దేశాల్లో కూడా ఆపిల్ ఉత్పత్తులను తయారు చేయాలని ఆపిల్ కంపెనీ భావిస్తోంది.

దీంతో ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టాలని టాటా గ్రూప్ డిసైడ్ అయ్యింది. అందుకే విస్ట్రన్ గ్రూప్ తో టాటా గ్రూప్ చర్చలు జరిపినట్లు సమాచారం. విస్ట్రన్ ఇండియాలో ఈక్విటీలు కొనుగోలు చేయడం, లేదా రెండు సంస్థలు కలిసి ఒక కొత్త అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడమో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు కంపెనీల మధ్య డీల్ కుదిరితే, ఇకపై భారత్ లో జరుగుతోన్న ఐఫోన్ ఉత్పత్తి శాతం 5 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం అదే ప్రథమ లక్ష్యంగా రెండు కంపెనీలు కూడా అడుగులు వేస్తున్నాయి.

ఇప్పటికే ఉప్పు, ఉక్కు, సాఫ్ట్‌వేర్ రంగాలలో తనదైన ముద్ర వేసిన టాటా, ఐఫోన్స్ ని తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించనుంది. అయితే టాటా గ్రూప్, విస్ట్రన్ కార్పొరేషన్ కి మధ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇప్పటికి అధికారికంగా బయటకు రాలేదు. అయితే త్వరలోనే ఇరు కంపెనీలు ప్రకటన చేసే అవకాశముంది. ఏదేమైనా భారత్ లో ఐఫోన్స్ ని టాటా కంపెనీ తయారు చేయనుండటం భారతీయులకు శుభవార్తేనని చెప్పాలి.

లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post iPhones తయారు చేయనున్న Tata కంపెనీ? first appeared on 91Mobiles Telugu.

]]>