Tata Tiago EV - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 12 Oct 2022 08:47:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tiago EV ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ ని మరికొన్ని యూనిట్లకు పెంచిన Tata https://www.91mobiles.com/telugu/tata-extends-introductory-price-for-tiago-ev/ Wed, 12 Oct 2022 08:12:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=2872 హైలైట్స్ మరిన్ని Tiago EV యూనిట్లకు ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ ని వర్తింపజేసిన TATA మొత్తంగా 20,000 యూనిట్లకు వర్తించనున్న ఇంట్రడక్టరీ ప్రైస్ Tiago EV హ్యాచ్‌బ్యాక్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ నిర్ణయం తీసుకున్న కంపెనీ టాటా మోటార్స్ Tiago EV ఇంట్రడక్టరీ ధర ఆఫర్ ని మరో 10,000 మంది కస్టమర్లకు అందించనుంది. రీసెంట్ గా టాటా కంపెనీ Tiago EV హ్యాచ్ బ్యాక్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. […]

The post Tiago EV ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ ని మరికొన్ని యూనిట్లకు పెంచిన Tata first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మరిన్ని Tiago EV యూనిట్లకు ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ ని వర్తింపజేసిన TATA
  • మొత్తంగా 20,000 యూనిట్లకు వర్తించనున్న ఇంట్రడక్టరీ ప్రైస్
  • Tiago EV హ్యాచ్‌బ్యాక్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ నిర్ణయం తీసుకున్న కంపెనీ

టాటా మోటార్స్ Tiago EV ఇంట్రడక్టరీ ధర ఆఫర్ ని మరో 10,000 మంది కస్టమర్లకు అందించనుంది. రీసెంట్ గా టాటా కంపెనీ Tiago EV హ్యాచ్ బ్యాక్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. రూ.8.5 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు మార్కెట్ లోకి వచ్చింది. వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ అయిన ఈ కారు భారత మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సెకన్ల వ్యవధిలో ఈ కారు 10 వేల యూనిట్లు బుక్ అయ్యాయి. అంతే కాదు, కొంత సమయం వరకు బుకింగ్ పోర్టల్ క్రాష్ అయ్యింది.

భారత్ లో Tiago EV ధర

ఇంట్రడక్టరీ ధరకే 20,000 బుకింగ్స్ ని తీసుకోనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఆకర్షణీయమైన ధరతో Tiago EV ని మార్కెట్ లో లాంచ్ చేయడంతో జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతే కాదు, Tiago EV కొత్త ఫీచర్లు, ఫంకీ స్టైలింగ్ తో వస్తోంది. దీంతో కారు చూడటానికి ఎంతో మంచి లుక్ తో కనిపిస్తుండటంతో జనాలు అట్రాక్ట్ అవుతున్నారు.

టాప్ వేరియంట్ XZ+ Tech Lux కి అత్యధిక బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. ఎక్కువ శాతం టీల్ బ్లూ, ప్రిస్టిన్ వైట్ కలర్స్ ని కస్టమర్లు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2023 జనవరి నుంచి టాప్ ఎండ్ వేరియంట్స్ వాహనాల డెలివరీ ప్రారంభమవుతుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇక ఇతర వేరియంట్స్ ని 2023 ఫిబ్రవరి – మార్చి నెలల్లో డెలివరీ చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది.

Tiago EV ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ రూ.8.49 లక్షలు. ఈ కారు వివిధ వేరియంట్లలో లభించనుంది. ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతోన్న XZ+ Tech Lux మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.79 లక్షలు గా ఉంది. ఇక టాప్ స్పెసిఫికేషన్స్ గల హయ్యర్ మోడల్ ధర రూ.1.85 లక్షల నుంచి రూ.5.51 లక్షలు ఎక్కువగా ఉండనుంది.

Tiago EV రెండు బ్యాటరీ ప్యాక్స్ తో వస్తోంది. అవి: 19.2 కిలో వాట్ మరియు 24 కిలో వాట్. 19.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ 250 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 315 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్స్ 50 కిలోవాట్ చార్జర్ తో 10 నుంచి 80 శాతం చార్జ్ అవ్వడానికి 57 నిమిషాల సమయం పడుతుంది. ఇక Tiago EV లో లెదర్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్, క్రూజ్ కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటో-హెడ్ ల్యాంప్స్, టీపీఎంఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Tiago EV ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ ని మరికొన్ని యూనిట్లకు పెంచిన Tata first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Tata Tiago EV: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే https://www.91mobiles.com/telugu/tata-tiago-ev-launched-india-price-specs-availability/ Wed, 28 Sep 2022 13:29:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=2627 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Tata Tiago ఎలక్ట్రిక్ కారు దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం సింగిల్ చార్జ్ పై 315 కిలోమీటర్లు పరుగు పెట్టే టియాగో ఎలక్ట్రిక్ కారు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Tata Tiago ఎలక్ట్రిక్ కారు నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ హ్యాచ్‌బ్యాక్ దేశంలోని చీపెస్ట్ బ్యాటరీ కారు గా పిలవబడుతోంది. Tata Tiago ప్రారంభ ధర రూ.8.5 లక్షలు. టాటా యొక్క […]

The post భారత్ లో లాంచ్ అయిన Tata Tiago EV: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Tata Tiago ఎలక్ట్రిక్ కారు
  • దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం
  • సింగిల్ చార్జ్ పై 315 కిలోమీటర్లు పరుగు పెట్టే టియాగో ఎలక్ట్రిక్ కారు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Tata Tiago ఎలక్ట్రిక్ కారు నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ హ్యాచ్‌బ్యాక్ దేశంలోని చీపెస్ట్ బ్యాటరీ కారు గా పిలవబడుతోంది. Tata Tiago ప్రారంభ ధర రూ.8.5 లక్షలు. టాటా యొక్క జిప్ట్రాన్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీపై ఈ కారు తయారైంది. Tata Tiago ఎలక్ట్రిక్ కారు సేల్ తేదీ, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tata Tiago ధర, లభ్యత

Tata Tiago EV రూ.8.5 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర అని గమనించాలి. బేస్ వేరియంట్ అయిన ఎక్స్ఈ లో 19.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ లో 24 కిలోవాట్ భారీ బ్యాటరీ ఉంది. టాప్ ఎండ్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11.79 లక్షలుగా ఉంది.

ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో లభించనుంది. అక్టోబర్ 10 నుంచి భారత్ లో Tata Tiago EV అమ్మకాలు మొదలవుతాయి. అలాగే ఈ కారు డెలివరీ 2023 జనవరి నుంచి మొదలవుతుంది.

మొదటి 10,000 మంది కస్టమర్లకు టాటా మోటార్స్ రూ.10,000 డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. కానీ ఈ ఆఫర్ స్టాక్స్ ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుంది. ఇక Tata Tiago EV యొక్క కలర్ ఆప్షన్స్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఇంటెన్సిటీ టీల్, సిల్వర్, బ్లూ రెడ్ తదితర కలర్ ఆప్షన్స్ లో ఈ కారు లభించనుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ మరియు మోటర్ పై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వ్యారంటీని టాటా మోటార్స్ అందిస్తోంది.

Tata Tiago EV డిజైన్

Tata Tiago EV డిజైన్ గురించి తెలుసుకుందాం. పెట్రోల్ వర్షన్ టియాగో ఏ విధంగా ఉందో అదే మాదిరి Tata Tiago EV కనిపిస్తోంది. కానీ, సిగ్నేచర్ ట్రై-ఆరో పాటెర్న్ డిజైన్, బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్, బ్లాక్డ్ ఔట్ ఓఆర్‌వీఎమ్స్, డోర్ హ్యాండిల్స్, రియర్ స్పాయిలర్ ఎలిమెంట్స్ కారుకి స్పోర్టివ్ లుక్ ఇస్తున్నాయి.

Tata Tiago EV స్పెసిఫికేషన్స్

Tata Tiago EV టాటా యొక్క జిప్ట్రాన్ టెక్నాలజీ పై తయారైంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తోంది. అవి: 19.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. 19.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు సింగిల్ చార్జ్ పై 250 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇక 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు సింగిల్ చార్జ్ పై 315 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Tata Tiago EV యొక్క బ్యాటరీ, మోటర్ ఐపీ67 రేటింగ్ ని కలిగి ఉన్నాయి.

టాటా కంపెనీ చెబుతున్న దాన్ని బట్టి, Tata Tiago EV 5.7 సెకన్లలో 60 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకుంటుంది. Tata Tiago EV 15ఏ హోమ్ సాకెట్, 3.3 కిలోవాట్ ఏసీ హోమ్ చార్జర్, 7.2 కిలోవాట్ ఏసీ హోమ్ చార్జర్, డీసీ ఫాస్ట్ చార్జర్ ని కలిగి ఉంది. 7.2 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్ తో Tata Tiago EV 3 గంటల 36 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవ్వడానికి డీసీ చార్జర్ కేవలం 57 నిమిషాల సమయం తీసుకుంటుంది.

Tata Tiago EV ఫీచర్లు

Tata Tiago EV లో మల్టీ-లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రూజ్ కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. మరోవైపు, లెదరెట్ సీట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, పవర్ విండోస్, కూల్డ్ గ్లవ్ బాక్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, రియర్ వాష్ వైప్స్, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్, హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో లాంచ్ అయిన Tata Tiago EV: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV https://www.91mobiles.com/telugu/tata-tiago-ev-launch-date-revealed/ Sun, 18 Sep 2022 07:35:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2405 హైలైట్స్ సెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV భారతదేశంలో చౌకైన ఈవీ గా నిలవనున్న Tata Tiago EV టిగోర్ ఈవీ ప్లాట్ఫామ్ పైనే తయారైన Tata Tiago EV దేశీయ కార్ల తయారీదారు అయిన టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటి వరకు టాటా నుంచి టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ భారత్ లో లాంచ్ అయి విజయం సాధించాయి. దీంతో కంపెనీ Tata Tiago EV […]

The post సెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • సెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV
  • భారతదేశంలో చౌకైన ఈవీ గా నిలవనున్న Tata Tiago EV
  • టిగోర్ ఈవీ ప్లాట్ఫామ్ పైనే తయారైన Tata Tiago EV

దేశీయ కార్ల తయారీదారు అయిన టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటి వరకు టాటా నుంచి టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ భారత్ లో లాంచ్ అయి విజయం సాధించాయి. దీంతో కంపెనీ Tata Tiago EV ని లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా Tata Tiago EV లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. సెప్టెంబర్ 28 న Tata Tiago EV భారత్ లో లాంచ్ అవుతోంది. దేశంలో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లతో పోల్చితే Tata Tiago EV ధర తక్కువగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Tata Tiago EV ధర, స్పెసిఫికేషన్స్

టాటా కంపెనీ ఇంకా Tata Tiago EV స్పెసిఫికేషన్స్ ని ప్రకటించలేదు. అయితే టిగోర్ ఈవీ మాదిరి పవర్‌ట్రెయిన్ ని Tata Tiago EV కలిగి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం టిగోర్ ఈవీ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో లభిస్తోంది. వీటిలో ఒకటి ప్రైవేట్ బయ్యర్స్ కోసం కాగా, రెండోది ఫ్లీట్ ఆపరేటర్స్ కోసం.

రాబోవు Tata Tiago EV, టిగోర్ ఈవీకి చెందిన రెండు పవర్ ట్రెయిన్స్ లో ఏదో ఒక దాన్ని పోలి ఉండనుంది. టిగోర్ ఈవీ ఫ్లీట్ వేరియంట్ ఎక్స్‌ప్రెస్-టీ పవర్ ట్రెయిన్ 41బీహెచ్పీ, 105ఎన్ఎం టార్క్, 21.5 కిలోవాట్ బ్యాటరీ యూనిట్, 213 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. 15 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ తో గంట 50 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది.

త్వరలో లాంచ్ కానున్న Tata Tiago EV, టిగోర్ ఈవీ యొక్క శక్తివంతమైన పవర్ ట్రెయిన్ వర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉండనుంది. టిగోర్ ఈవీ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటాయి. 75బీహెచ్పీ హార్స్ పవర్, 170ఎన్ఎం టార్క్, 26 కిలోవాట్ బ్యాటరీ, 306 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. ఎంతో శక్తివంతమైన 25 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో బ్యాటరీ గంటా 5 నిమిషాల్లో పూర్తి చార్జ్ అవుతుంది.

ఇప్పుడు డిజైన్, అప్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. Tata Tiago EV ఐసీఈ మోడల్స్ మాదిరి డిజైన్ ని కలిగి ఉంటుందని సమాచారం. అయితే Tata Tiago EV కొన్ని మైనర్ కాస్మెటిక్స్ చేంజెస్ ని కలిగి ఉండనుంది. బండి ఈవీ మాదిరి కనిపించాలంటే, ఆ మార్పులు అవసరమే మరి. టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ ల్లో చూసినట్లుగా బ్లూ హైలైట్స్, ఆక్సెంట్స్ Tata Tiago EV లో కనిపించనున్నాయి.

అయితే టిగోర్ ఈవీ లో ఉన్నట్లుగా స్ప్లిట్ బ్యాటరీ Tata Tiago EV లో ఉంటుందో లేదో ఇంకా తెలియదు. టిగోర్ ఈవీలో బ్యాటరీ లోని ఒక భాగాన్ని బూట్ (డిక్కీ) లో పెట్టారు. మరి Tata Tiago EV లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఎందుకంటే Tata Tiago EV ఒక హ్యాచ్ బ్యాక్ అని గమనించాలి. టాటా తన ఐడియాను ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో చూడాలి.

Tata Tiago EV భారత్ లో సరసమైన ధరలో లభించనుందని టాక్ వినిపిస్తోంది. Tata Tiago EV ఎక్స్‌షోరూమ్ ధర రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. లాంచ్ రోజున ఈ కారుకి సంబంధించిన ధర, ఫీచర్స్ పై పూర్తి స్పష్టత రానుంది.

The post సెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV first appeared on 91Mobiles Telugu.

]]>