భారత్ లో లాంచ్ అయిన Tata Tiago EV: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే

హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Tata Tiago ఎలక్ట్రిక్ కారు
  • దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం
  • సింగిల్ చార్జ్ పై 315 కిలోమీటర్లు పరుగు పెట్టే టియాగో ఎలక్ట్రిక్ కారు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Tata Tiago ఎలక్ట్రిక్ కారు నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ హ్యాచ్‌బ్యాక్ దేశంలోని చీపెస్ట్ బ్యాటరీ కారు గా పిలవబడుతోంది. Tata Tiago ప్రారంభ ధర రూ.8.5 లక్షలు. టాటా యొక్క జిప్ట్రాన్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీపై ఈ కారు తయారైంది. Tata Tiago ఎలక్ట్రిక్ కారు సేల్ తేదీ, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tata Tiago ధర, లభ్యత

Tata Tiago EV రూ.8.5 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర అని గమనించాలి. బేస్ వేరియంట్ అయిన ఎక్స్ఈ లో 19.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ లో 24 కిలోవాట్ భారీ బ్యాటరీ ఉంది. టాప్ ఎండ్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11.79 లక్షలుగా ఉంది.

ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో లభించనుంది. అక్టోబర్ 10 నుంచి భారత్ లో Tata Tiago EV అమ్మకాలు మొదలవుతాయి. అలాగే ఈ కారు డెలివరీ 2023 జనవరి నుంచి మొదలవుతుంది.

మొదటి 10,000 మంది కస్టమర్లకు టాటా మోటార్స్ రూ.10,000 డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. కానీ ఈ ఆఫర్ స్టాక్స్ ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుంది. ఇక Tata Tiago EV యొక్క కలర్ ఆప్షన్స్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఇంటెన్సిటీ టీల్, సిల్వర్, బ్లూ రెడ్ తదితర కలర్ ఆప్షన్స్ లో ఈ కారు లభించనుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ మరియు మోటర్ పై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వ్యారంటీని టాటా మోటార్స్ అందిస్తోంది.

Tata Tiago EV డిజైన్

Tata Tiago EV డిజైన్ గురించి తెలుసుకుందాం. పెట్రోల్ వర్షన్ టియాగో ఏ విధంగా ఉందో అదే మాదిరి Tata Tiago EV కనిపిస్తోంది. కానీ, సిగ్నేచర్ ట్రై-ఆరో పాటెర్న్ డిజైన్, బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్, బ్లాక్డ్ ఔట్ ఓఆర్‌వీఎమ్స్, డోర్ హ్యాండిల్స్, రియర్ స్పాయిలర్ ఎలిమెంట్స్ కారుకి స్పోర్టివ్ లుక్ ఇస్తున్నాయి.

Tata Tiago EV స్పెసిఫికేషన్స్

Tata Tiago EV టాటా యొక్క జిప్ట్రాన్ టెక్నాలజీ పై తయారైంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తోంది. అవి: 19.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. 19.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు సింగిల్ చార్జ్ పై 250 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇక 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు సింగిల్ చార్జ్ పై 315 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Tata Tiago EV యొక్క బ్యాటరీ, మోటర్ ఐపీ67 రేటింగ్ ని కలిగి ఉన్నాయి.

టాటా కంపెనీ చెబుతున్న దాన్ని బట్టి, Tata Tiago EV 5.7 సెకన్లలో 60 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకుంటుంది. Tata Tiago EV 15ఏ హోమ్ సాకెట్, 3.3 కిలోవాట్ ఏసీ హోమ్ చార్జర్, 7.2 కిలోవాట్ ఏసీ హోమ్ చార్జర్, డీసీ ఫాస్ట్ చార్జర్ ని కలిగి ఉంది. 7.2 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్ తో Tata Tiago EV 3 గంటల 36 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవ్వడానికి డీసీ చార్జర్ కేవలం 57 నిమిషాల సమయం తీసుకుంటుంది.

Tata Tiago EV ఫీచర్లు

Tata Tiago EV లో మల్టీ-లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రూజ్ కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. మరోవైపు, లెదరెట్ సీట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, పవర్ విండోస్, కూల్డ్ గ్లవ్ బాక్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, రియర్ వాష్ వైప్స్, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్, హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleFlipkart లో ల్యాప్ టాప్ ఆర్డర్ పెడితే బట్టలు ఉతికే సబ్బులు వచ్చాయి..!!
Next articleఅక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.