Teaser - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 22 Oct 2024 05:18:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/#respond Tue, 22 Oct 2024 05:18:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=14059 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Realme GT 7 […]

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్
  • వై-ఫై 7, 8కే వీడియో రికార్డింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Realme GT 7 Pro ఇండియా లాంచ్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా వెల్లడించింది. అలాగే నవంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని కూడా తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్‌తో వస్తోన్న భారతదేశపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. అయితే డివైజ్ యొక్క లాంచ్ తేదీని రియల్మీ ఇంకా వెల్లడించలేదు.

ఇక స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంది. అడ్రెనో జీపీయూ, హెక్సాగన్ ఎన్‌పీయూ కలిగిన ఈ చిప్సెట్ ప్రపంచంలోనే వేగవంతమైన చిప్సెట్ అని రియల్మీ చెబుతోంది. ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్. ఫోన్ పెర్ఫామెన్స్‌ను ఇది 45 శాతం మేర పెంచుతుంది. అలాగే ఈ చిప్ లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్ కూడా ఉన్నాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 320 మెగాపిక్సెల్స్ వరకు గల కెమెరాకు సపోర్ట్ చేస్తుంది. ఇది 8కే వీడియో రికార్డింగ్ చేయగలదు. ఈ చిప్సెట్ 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, వై-ఫై 7, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300 వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 7 Pro లో శాంసంగ్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఎల్టీపీవో డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

మెమొరీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

సాఫ్ట్‌వేర్: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/feed/ 0
Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/#respond Wed, 25 Sep 2024 13:29:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=13748 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ నెలలోనే Blaze 3 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు Lava Agni 3 పేరుతో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతోంది. ఇది లావా అగ్ని 2 కి సక్సెసర్ గా రానుంది. తాజాగా Lava Agni 3 యొక్క టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. టీజర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. Lava […]

The post Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Agni 3 టీజర్ లాంచ్
  • పవర్ఫుల్ స్పెక్స్ తో వస్తోన్న డివైజ్
  • త్వరలోనే వెల్లడి కానున్న లాంచ్ తేదీ

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఈ నెలలోనే Blaze 3 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు Lava Agni 3 పేరుతో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు లావా సిద్ధమవుతోంది. ఇది లావా అగ్ని 2 కి సక్సెసర్ గా రానుంది. తాజాగా Lava Agni 3 యొక్క టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. టీజర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lava Agni 3 టీజర్

Lava Agni 3 టీజర్‌ను లావా బ్రాండ్ హెడ్ సునీల్ రైనా తన X ఖాతాలో షేర్ చేశారు. పోస్ట్ గమనిస్తే, అందులో ఫైర్ ఎమోజీలు, పవర్ సింబల్ ఉన్నాయి.

Lava Agni 3 స్మార్ట్‌ఫోన్ గత మోడల్ అగ్ని 2 కి సక్సెసర్ గా లాంచ్ కానుంది. అగ్ని 2 కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది.

Lava Agni 3 కి సంబంధించిన మరొక పోస్ట్ లావా అఫీషియల్ హ్యాండిల్ పై కూడా కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Lava Agni 3 డివైజ్ యొక్క లాంచ్ తేదీ, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రానున్న రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో మాదిరే, Lava Agni 3 కూడా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడొకసారి, ఇటీవలె లాంచైన లావా బ్లేజ్ 3 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం.

Lava Blaze 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Blaze 3 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. అంటుటు స్కోర్ 4,10,000.

ర్యామ్, స్టోరేజీ: Lava Blaze 3 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Blaze 3 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఏఐ లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Blaze 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Blaze 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Lava Blaze 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Agni 3 టీజర్ విడుదల, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-teaser-released-india-launch-soon/feed/ 0
Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/#respond Thu, 12 Sep 2024 15:45:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=13467 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ […]

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Hot 50i లాంచ్
  • టీజర్ పోస్టర్ విడుదల
  • రివీలైన స్పెసిఫికేషన్స్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 50i డిజైన్

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ వివరాలు తొలుత MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది. డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు చూస్తే, ఫ్లాట్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Infinix Hot 50i డివైజ్ స్లీక్ బ్లాక్, టైటానియమ్ గ్రే మరియు సేజ్ గ్రీన్ కలర్స్ లో రానున్నట్లు లేటెస్ట్ లీక్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50i స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Infinix Hot 50i లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Infinix Hot 50i లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50i డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని సమాచారం.

కెమెరా: Infinix Hot 50i డివైజ్ 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50i డివైజ్ 300% అల్ట్రా వాల్యూమ్ తో వస్తోంది.

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/feed/ 0
Lava Blaze 3 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/lava-blaze-3-5g-india-launch-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/lava-blaze-3-5g-india-launch-confirmed-teaser-released/#respond Wed, 11 Sep 2024 10:45:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13438 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో బ్లేజ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Blaze 3 5G పేరుతో ఈ ఫోన్ రానుంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ బ్లేజ్ 2 కి సక్సెసర్‌గా Lava Blaze 3 5G విడుదల కానుంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క టీజర్ వివరాలు తెలుసుకుందాం. Lava Blaze 3 5G ఇండియా లాంచ్ […]

The post Lava Blaze 3 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Lava Blaze 3 5G విడుదల
  • తాజాగా టీజర్ ద్వారా ఖరారు
  • వైబ్ లైట్ ఎల్ఈడీ ఫ్లాష్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో బ్లేజ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Blaze 3 5G పేరుతో ఈ ఫోన్ రానుంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ బ్లేజ్ 2 కి సక్సెసర్‌గా Lava Blaze 3 5G విడుదల కానుంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క టీజర్ వివరాలు తెలుసుకుందాం.

Lava Blaze 3 5G ఇండియా లాంచ్ ఖరారు

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను సోషల్ మీడియా సైట్ X పై లావా సంస్థ షేర్ చేసింది.

ప్రస్తుతం Lava Blaze 3 5G ఫోన్‌ని కమింగ్ సూన్ అని కంపెనీ లిస్ట్ చేసింది. ఇదే నెలలో లావా బ్లేస్ 3 5జీ లాంచ్ అవుతుందని సమాచారం.

టీజర్ వీడియోను గమనిస్తే, ఈ ఫోన్ అప్‌గ్రేడెడ్ కెమెరా మాడ్యూల్ తో వస్తుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ లో కొత్తగా వైబ్ లైట్ ఎల్ఈడీ ఫ్లాష్ ను బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ పక్కన అందించనున్నారు. దీని వల్లన నైట్ ఫోటోగ్రఫీ మెరుగవుతుంది.

Lava Blaze 3 5G యొక్క లాంచ్ తేదీ మరియు ఇతర వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఇప్పుడు గత మోడల్ Lava Blaze 2 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 మెమొరీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

సాఫ్ట్‌వేర్: Lava Blaze 2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ కాబట్టి అవసరంలేని యాప్స్, బ్లోట్‌వేర్ ఫోన్ లో ఉండవు.

కెమెరా: Lava Blaze 2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Lava Blaze 2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భద్రత: Lava Blaze 2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 203 గ్రాముల బరువు, 8.9 మి.మీ మందం ఉంటుంది.

The post Lava Blaze 3 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-blaze-3-5g-india-launch-confirmed-teaser-released/feed/ 0
Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/#respond Tue, 20 Aug 2024 11:03:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13064 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో టీ3 ప్రో 5జీ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం. […]

The post Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo T3 Pro 5G లాంచ్ ఖరారు
  • ఆగస్టు 27న భారత్ లో విడుదల
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో టీ3 ప్రో 5జీ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 27వ తేదీన లాంచ్ అవుతోంది.

ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ద్వారా దర్శనమిస్తోంది.

కొత్త టీజర్ లో Vivo T3 Pro 5G ఆరెంజ్ కలర్ మరియు 3డీ కర్వ్ అమోలెడ్ డిస్ప్లేతో కనిపిస్తోంది.

బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతోన్న iQOO Z9s Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వివో టీ3 ప్రో 5జీ వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి మరియు అంచనా)

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 3డీ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ఉంటుందని అంచనా.

కెమెరా: Vivo T3 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 సెన్సర్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది. ఇంకా 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-india-launch-date-confirmed/feed/ 0