
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.
Infinix Hot 50i డిజైన్
Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ వివరాలు తొలుత MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది. డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు చూస్తే, ఫ్లాట్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
Infinix Hot 50i డివైజ్ స్లీక్ బ్లాక్, టైటానియమ్ గ్రే మరియు సేజ్ గ్రీన్ కలర్స్ లో రానున్నట్లు లేటెస్ట్ లీక్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50i స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Infinix Hot 50i లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
చిప్సెట్: Infinix Hot 50i లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50i డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని సమాచారం.
కెమెరా: Infinix Hot 50i డివైజ్ 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
సాఫ్ట్‌వేర్: Infinix Hot 50i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
ఇతర ఫీచర్లు: Infinix Hot 50i డివైజ్ 300% అల్ట్రా వాల్యూమ్ తో వస్తోంది.











