Tecno Camon 19 Pro Mondrian - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 15 Sep 2022 13:14:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన మల్టీ కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian https://www.91mobiles.com/telugu/tecno-camon-19-pro-mondrian-launched-india-price-specs-availability/ Thu, 15 Sep 2022 13:14:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2363 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన TECNO Camon 19 Pro Mondrian స్మార్ట్ ఫోన్ 64ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ధర రూ.17,999 భారతదేశపు తొలి మల్టీ-కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian నేడు లాంచ్ అయ్యింది. రూ.17,999 […]

The post భారత్ లో లాంచ్ అయిన మల్టీ కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన TECNO Camon 19 Pro Mondrian స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ధర రూ.17,999

భారతదేశపు తొలి మల్టీ-కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian నేడు లాంచ్ అయ్యింది. రూ.17,999 ధరతో టెక్నో కంపెనీ ఈ ఫోన్ ని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 64ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13జిబి ర్యామ్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

TECNO Camon 19 Pro Mondrian ధర

TECNO Camon 19 Pro Mondrian 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 22 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు పై ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్ కి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

TECNO Camon 19 Pro Mondrian స్పెసిఫికేషన్స్

TECNO Camon 19 Pro Mondrian పాలిక్రొమాటిక్ ఫోటోఐజోమర్ టెక్నాలజీ తో తయారైంది. అందువల్లన ఈ ఫోన్ యొక్క మోనోక్రోమిక్ బ్యాక్ ప్యానెల్ కాంతి పడినప్పుడల్లా రంగులు మారుస్తుంటుంది. ఈ ఫోన్ భారతదేశపు తొలి మల్టీ-కలర్ చేంజింగ్ ఫోన్ అని టెక్నో కంపెనీ చెబుతోంది. TECNO Camon 19 Pro Mondrian ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

TECNO Camon 19 Pro Mondrian ఆండ్రాయిడ్ 12 ఓఎస్, హైఓఎస్ 8.6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియ జీ96 చిప్సెట్ అమర్చారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.05 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగి ఉంటుంది. మాలి-జీ57 జీపీయూ, 5జీబీ వర్చువల్ ర్యామ్ ఇందులో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. TECNO Camon 19 Pro Mondrian లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 13ఎంపి కెమెరా ఉంది.

TECNO Camon 19 Pro Mondrian లో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ తో పాటు 512జిబి వరకు మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ ఉంది. ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరాలు, మల్టీ-కలర్ చేంజింగ్ ఫీచర్ కావాలనుకుంటే టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఫోన్ ని ఎంచుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

 

The post భారత్ లో లాంచ్ అయిన మల్టీ కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న రెండుకి మించి రంగులను మార్చే స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-camon-19-pro-mondrian-edition-india-launch-specs-design/ Wed, 07 Sep 2022 05:30:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2152 హైలైట్స్: త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Tecno Camon 19 Pro Mondrian Edition అమెజాన్ లో ఉన్న మైక్రోసైట్ ద్వారా రివీల్ అయిన డిజైన్, స్పెసిఫికేషన్స్ బ్యాక్ ప్యానెల్ పై వైట్ బ్లాక్స్ కలిగి, రంగులను మార్చే టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గత నెలలో టెక్నో కంపెనీ కేమాన్ 19 ప్రో 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ […]

The post త్వరలో లాంచ్ కానున్న రెండుకి మించి రంగులను మార్చే స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Tecno Camon 19 Pro Mondrian Edition
  • అమెజాన్ లో ఉన్న మైక్రోసైట్ ద్వారా రివీల్ అయిన డిజైన్, స్పెసిఫికేషన్స్
  • బ్యాక్ ప్యానెల్ పై వైట్ బ్లాక్స్ కలిగి, రంగులను మార్చే టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్

గత నెలలో టెక్నో కంపెనీ కేమాన్ 19 ప్రో 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క మాండ్రియన్ ఎడిషన్ వచ్చేస్తోంది. కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రస్తుతం అమెజాన్ లో ఉన్న కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్ యొక్క మైక్రోసైట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తోంది. టెక్నో కేమాన్ 19 ప్రో 5G మాదిరి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. కాకపోతే, ఇందులో కొన్ని కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి. ఇది భారత దేశం యొక్క మొట్టమొదటి మల్టీ-కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతుంది.

ఈ మోడల్ టెక్నో ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై వైట్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ పై సూర్యకాంతి పడినప్పుడు వివిధ రంగుల్లోకి మారుతాయి. ప్రతి బ్లాక్ కూడా వైట్ నుంచి పింక్ రంగులోకి లేదా నీలం రంగులోకి మారుతాయి. ఈ బ్లాక్స్ ఒకేసారి విభిన్న రంగుల్లోకి మారడం విశేషం. మరి ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Tecno Camon 19 Pro Mondrian Edition

అమెజాన్ లిస్టింగ్ ని బట్టి Tecno Camon 19 Pro Mondrian Edition 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ గరిష్టంగా 13జిబి వరకు ర్యామ్ ని కలిగి ఉంది. ఇంకా 128జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కొరకు ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు.

Tecno Camon 19 Pro Mondrian Edition లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 64ఎంపి మెయిన్ సెన్సర్, 50ఎంపి పోట్రెయిట్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా, ప్రాసెసర్ వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. 32ఎంపి ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 810 చిప్సెట్ ఈ ఫోన్లో ఉండే అవకాశముంది. త్వరలోనే వీటిపై స్పష్టత రానుంది.

ఇక అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడో తెలియలేదు. రాబోవు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే Tecno Camon 19 Pro Mondrian Edition ఈ సేల్ లో భాగమయ్యే చాన్స్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post త్వరలో లాంచ్ కానున్న రెండుకి మించి రంగులను మార్చే స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>