హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన TECNO Camon 19 Pro Mondrian స్మార్ట్ ఫోన్
- 64ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ధర రూ.17,999
భారతదేశపు తొలి మల్టీ-కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO Camon 19 Pro Mondrian నేడు లాంచ్ అయ్యింది. రూ.17,999 ధరతో టెక్నో కంపెనీ ఈ ఫోన్ ని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 64ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13జిబి ర్యామ్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
TECNO Camon 19 Pro Mondrian ధర
TECNO Camon 19 Pro Mondrian 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 22 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు పై ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్ కి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
TECNO Camon 19 Pro Mondrian స్పెసిఫికేషన్స్
TECNO Camon 19 Pro Mondrian పాలిక్రొమాటిక్ ఫోటోఐజోమర్ టెక్నాలజీ తో తయారైంది. అందువల్లన ఈ ఫోన్ యొక్క మోనోక్రోమిక్ బ్యాక్ ప్యానెల్ కాంతి పడినప్పుడల్లా రంగులు మారుస్తుంటుంది. ఈ ఫోన్ భారతదేశపు తొలి మల్టీ-కలర్ చేంజింగ్ ఫోన్ అని టెక్నో కంపెనీ చెబుతోంది. TECNO Camon 19 Pro Mondrian ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
TECNO Camon 19 Pro Mondrian ఆండ్రాయిడ్ 12 ఓఎస్, హైఓఎస్ 8.6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియ జీ96 చిప్సెట్ అమర్చారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.05 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగి ఉంటుంది. మాలి-జీ57 జీపీయూ, 5జీబీ వర్చువల్ ర్యామ్ ఇందులో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. TECNO Camon 19 Pro Mondrian లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 13ఎంపి కెమెరా ఉంది.
TECNO Camon 19 Pro Mondrian లో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ తో పాటు 512జిబి వరకు మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ ఉంది. ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరాలు, మల్టీ-కలర్ చేంజింగ్ ఫీచర్ కావాలనుకుంటే టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఫోన్ ని ఎంచుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.













