Tecno Phantom V Fold 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 18 Jan 2024 17:52:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచైన Tecno Phantom V Fold, నేటి నుంచి సేల్! https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-fold-5g-launched-india-price-specs-sale-date/ Wed, 12 Apr 2023 06:16:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=5839 Tecno సంస్థ తన తొలి ఫోల్డబుల్ Tecno Phantom V Fold ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని తొలుత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో టెక్నో సంస్థ జనాలకు పరిచయం చేసింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తన ఫోల్డబుల్ ఫోన్ ని భారత్ లోనే తయారు చేనున్నట్లు టెక్నో ప్రకటించింది. ఇప్పటికే ఫోన్ ధరను కంపెనీ ప్రకటించగా, పరిమిత కాలం పాటు డిస్కౌంట్ పై లభించనుంది. నేటి నుంచి […]

The post భారత్ లో లాంచైన Tecno Phantom V Fold, నేటి నుంచి సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచైన Tecno Phantom V Fold
  • గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మాదిరి డిజైన్ తో కనిపిస్తోన్న డివైజ్
  • భారత్ లో నేటి నుంచి (ఏప్రిల్ 12) నుంచి మొదలుకానున్న సేల్

Tecno సంస్థ తన తొలి ఫోల్డబుల్ Tecno Phantom V Fold ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని తొలుత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో టెక్నో సంస్థ జనాలకు పరిచయం చేసింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తన ఫోల్డబుల్ ఫోన్ ని భారత్ లోనే తయారు చేనున్నట్లు టెక్నో ప్రకటించింది. ఇప్పటికే ఫోన్ ధరను కంపెనీ ప్రకటించగా, పరిమిత కాలం పాటు డిస్కౌంట్ పై లభించనుంది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్ మొదలుకానుంది. సరే, ఓసారి ఈ ఫోన్ ధర, డిజైన్ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Phantom V Fold ధర, సేల్ తేదీ

Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. టాప్ మోడల్ ధర రూ.99,999 గా ఉంది. ఏప్రిల్ 12 అనగా నేటి నుంచి ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి వస్తోంది. సేల్ సందర్భంగా ఈ ఫోన్ ని ఆఫర్ ధరలో రూ.77,777 కే కొనుగోలు చేయవచ్చు.

టెక్నో నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ చూడటానికి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మాదిరి ఉంది. అయితే ధర మాత్రం అన్నిటి కంటే భిన్నంగా టెక్నో ఫోన్ ని నిలపనుంది. Tecno Phantom V Fold డివైజ్ Galaxy Z Flip 4, Oppo Find N2 Flip ఫోన్లకు పోటీ ఇవ్వనుంది.

Tecno Phantom V Fold డిజైన్

Tecno Phantom V Fold డిజైన్ చూసేందుకు Samsung Galaxy Z Fold సిరీస్ లాగా కనిపిస్తోంది. Tecno Phantom V Fold డివైజ్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఏరోస్పేస్ మెటీరియల్ తో ఈ స్మార్ట్ ఫఓన్ తయారైంది. 2,00,000 ఫోల్డ్స్ కి పైగా టెస్టింగ్ ని ఈ ఫోన్ ఎదురుకున్నట్లు కంపెనీ చెబుతోంది.

Tecno Phantom V Fold స్పెసిఫికేషన్స్

  • 6.42-ఇంచ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే
  • 7.65-ఇంచ్ 2కే ఇన్నర్ డిస్ప్లే
  • డ్యూయల్ రిఫ్రెష్ రేట్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • 50ఎంపి పొట్రెయిట్ లెన్స్
  • 32ఎంపి/16ఎంపి సెల్ఫీ కెమెరాలు
  • డైమెన్సిటీ 9000+ చిప్సెట్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

డిస్ప్లే

Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ లో 6.42-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే, 10హెర్ట్జ్-120 హెర్ట్జ్ డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఫోన్ ని ఓపెన్ చేస్తే 7.65-ఇంచ్ 2కే అమోలెడ్ భారీ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

కెమెరా

Tecno Phantom V Fold లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఇచ్చారు. ఇది ఔటర్ డిస్ప్లే పై ఉంటుంది. మెయిన్ డిస్ప్లే పైన 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్ మరియు ఓఎస్

Tecno Phantom V Fold లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ 5జీ చిప్సెట్ వాడారు. ఇది 12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది. Tecno Phantom V Fold డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఫోల్డబుల్ డిజైన్ కి సరిపోయే విధంగా ఓఎస్ ని కస్టమైజ్ చేయడం జరిగింది.

The post భారత్ లో లాంచైన Tecno Phantom V Fold, నేటి నుంచి సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Tecno Phantom V Fold https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-fold-5g-india-launch-very-soon/ Fri, 17 Mar 2023 06:09:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5555 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో Tecno Phantom V Fold 5G ఇండియా ధర, స్పెసిఫికేషన్స్ ని ప్రకటించిన తర్వాత, తాజాగా ఇప్పుడు ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో సేల్ కి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా టెక్నో సంస్థ Tecno Phantom V Fold 5G లాంచ్ త్వరలోనే ఉంటుందని వెల్లడించింది. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. కానీ, త్వరలో రానుంది అని మాత్రం ట్వీట్ లో పేర్కొనబడింది. సరే, […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Tecno Phantom V Fold first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత మార్కెట్ లో తన ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న Tecno Phantom V Fold
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • భారత్ కి వస్తోన్న తొలి టెక్నో ఫోల్డబుల్ ఫోన్ ఇదే

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో Tecno Phantom V Fold 5G ఇండియా ధర, స్పెసిఫికేషన్స్ ని ప్రకటించిన తర్వాత, తాజాగా ఇప్పుడు ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో సేల్ కి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా టెక్నో సంస్థ Tecno Phantom V Fold 5G లాంచ్ త్వరలోనే ఉంటుందని వెల్లడించింది. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. కానీ, త్వరలో రానుంది అని మాత్రం ట్వీట్ లో పేర్కొనబడింది. సరే, ఓసారి Tecno Phantom V Fold 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Phantom V Fold 5G ధర

Tecno Phantom V Fold 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా కంపెనీ ప్రకటించింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి వేరియంట్ ధర రూ.99,999 గా నిర్ణయించారు.

Tecno Phantom V Fold 5G స్పెసిఫికేషన్స్

Tecno Phantom V Fold 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ డిస్ప్లేలు ఉంటాయి. వీటిలో 7.65-ఇంచ్ 2కే+ మెయిన్ స్క్రీన్ ఉంటుంది. ఇది 2296*2000 పిక్సెట్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. మరొక స్క్రీన్ 6.42-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్. ఇది 1080*2550 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. Tecno Phantom V Fold 5G యొక్క రెండు డిస్ప్లేలు కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పని చేస్తాయి.

Tecno Phantom V Fold 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడబడింది. ఇది 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

Tecno Phantom V Fold 5G లో 50ఎంపి మెయిన్ లెన్స్, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 13 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో లోపల స్క్రీన్ పై 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ కి బయట స్క్రీన్ పై 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Tecno Phantom V Fold first appeared on 91Mobiles Telugu.

]]>