Tecno Phantom X2 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 06:16:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/#respond Mon, 30 Sep 2024 06:16:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13834 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ […]

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్‌లో టెక్నో ఫోన్లపై డిస్కౌంట్స్
  • Phantom V Flip ధర రూ.28,649
  • Phantom X2 Pro ధర రూ.28,749

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ డీల్స్

Tecno Phantom V Flip – అసలే తక్కువ ధరకి లాంచైన ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మరింత చవకగా మారింది. సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.54,899 కి లభిస్తోంది. రూ.25,000 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.28,649 కే సొంతం చేసుకోవచ్చు.

Tecno Phantom X2 Pro – టెక్నో యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఫాంటమ్ ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ రూ.28,749 ధరకి లభిస్తోంది. కూపన్ డిస్కౌంట్ రూ.5,000 మరియు రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ రేటుకి లభిస్తోంది.

Tecno POVA 6 Neo – టెక్నో నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోవా 6 నియో. ఈ ఫోన్‌ని రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు.

Tecno Pop 9 5G – రూ.8,499 ధరతో టెక్నో పాప్ 9 5జీ మార్కెట్ లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తోంది.

సేల్‌లో లభిస్తోన్న టెక్నో స్మార్ట్‌ఫోన్ల జాబితా

స్మార్ట్‌ఫోన్ అసలు ధర సేల్ ధర
Tecno Pop 9 5G 4GB/64GB రూ.9499 రూ.8499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Pop 9 5G 4GB/128GB రూ.9,999 రూ.8,999 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno POVA 6 Neo 8GB/256GB రూ.13,999 రూ.12,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark Go 1 రూ.7,299 రూ.7,299
Tecno Camon 30 8GB/256GB రూ.22,999 19,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 12GB/512GB రూ.26,999 రూ.23,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 Premier రూ.39,999 రూ.36,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/128GB రూ.15,999 రూ.14,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/256GB రూ.16,999 రూ.15,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 Pro రూ.34,999 రూ.28,749 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom V Flip రూ.54,899 రూ.28,649 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 రూ.24,999 రూ.23,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 20 Premier రూ.15,999 రూ.14,499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/feed/ 0
డైమెన్సిటీ 9000 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Phantom X2 Pro https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-pro-launched-india-price-specs-availability/ Tue, 17 Jan 2023 13:53:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4505 Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన కొన్ని రోజులకే Tecno Phantom X2 Pro కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలైతే ఈ ఫోన్లు గత నెలలో గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. Tecno Phantom X2 Pro రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్ కెమెరా తో వచ్చింది. స్లిమ్ డిజైన్, లైట్ వినియోగం, పొట్రెయిట్ షాట్స్ కోసం ప్యూర్ ఆప్టికల్ బొకే.. వంటి వాటిలో ఈ లెన్స్ ఉపయోగపడుతుంది. Tecno Phantom […]

The post డైమెన్సిటీ 9000 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Phantom X2 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్
  • రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్ Tecno Phantom X2 Pro యొక్క ప్రత్యేకత
  • భారత్ లో Tecno Phantom X2 Pro ధర రూ.49,999

Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన కొన్ని రోజులకే Tecno Phantom X2 Pro కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలైతే ఈ ఫోన్లు గత నెలలో గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. Tecno Phantom X2 Pro రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్ కెమెరా తో వచ్చింది. స్లిమ్ డిజైన్, లైట్ వినియోగం, పొట్రెయిట్ షాట్స్ కోసం ప్యూర్ ఆప్టికల్ బొకే.. వంటి వాటిలో ఈ లెన్స్ ఉపయోగపడుతుంది.

Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఇందులో కర్వ్డ్ ఎడ్జెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. Tecno Phantom X2 Pro ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చింది.

భారత్ లో Tecno Phantom X2 Pro ధర, లభ్యత

భారత్ లో Tecno Phantom X2 Pro ధరను రూ.49,999 గా నిర్ణయించారు. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. నేటి నుంచి ఫోన్ ప్రీ-బుకింగ్ అమెజాన్ మరియు రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా జరుగుతుంది. జనవరి 24 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా అమెజాన్ రూ.5,000 అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్, 12 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్, 6 నెలలు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ అందిస్తోంది. రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచితంగా టెక్నో గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. ఇది తొలి 600 కస్టమర్లకు మాత్రమే.

Tecno Phantom X2 Pro స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 93.5 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఇంకా హైపర్ ఇంజిన్ 5.0 టెక్నాలజీని ఈ ఫోన్ లో ఉపయోగించారు.

Tecno Phantom X2 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 5జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Tecno Phantom X2 Pro లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 7పీ లెన్స్, సెవెంత్ జనరేషన్ ఇమేజిక్ 790 ఐఎస్‌పీ, 5th జెన్ ఏఐ ప్రాసెసర్ ఏపీయూ 590, క్వాడ్ ఫ్లాష్ లైట్, 50ఎంపి రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్, 13ఎంపి లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డైమెన్సిటీ 9000 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Phantom X2 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-series-globally-launched-with-17gb-ram-45w-charging/ Wed, 07 Dec 2022 13:00:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=3860 హైలైట్స్ నేడు గ్లోబల్ గా లాంచైన Tecno Phantom X2, Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్స్ 6.8-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్ స్మార్ట్ ఫోన్ల తయారీదారు టెక్నో మెల్లగా తన ప్రభావాన్ని చూపుతోంది. వరుస లాంచ్ […]

The post 17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు గ్లోబల్ గా లాంచైన Tecno Phantom X2, Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్స్
  • 6.8-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్

స్మార్ట్ ఫోన్ల తయారీదారు టెక్నో మెల్లగా తన ప్రభావాన్ని చూపుతోంది. వరుస లాంచ్ లతో మార్కెట్ లో తన పట్టుని నిలుపుకుంటోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను దించుతూ జనాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ కంపెనీ నేడు దుబాయ్ లో Tecno Phantom X2 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ అయ్యాయి.

Tecno Phantom X2 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ని వినియోగించారు. ఇంకా ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 64ఎంపి ఓఐఎస్ కెమెరా, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5 ర్యామ్, మెమొరీ ఫ్యూజన్, 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్ వంటి మరెన్నో స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్స్ లో ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది F/2.45 అపర్చర్, 80.6 వ్యూయింగ్ యాంగిల్, అడ్జస్టబుల్ ఫ్లాష్ లైట్, 1/2.8″ ఇమేజ్ సెన్సర్ ని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ చూస్తే, ఏఐ పొట్రెయిట్, సూపర్ నైట్ మోడ్, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫిల్టర్స్, కస్టమ్ మేకప్, వైడ్ సెల్ఫీ, హెచ్డీఆర్, బర్‌స్ట్ షాట్, పర్సనలైజ్డ్ వాటర్‌మార్క్, ఏఐ సీన్ డిటెక్షన్, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, వీడియో బొకే, వీడియో బ్యూటీ, టైమ్ ల్యాప్స్, ఏఆర్ షాట్, ఫిల్మ్ మోడ్, క్వాడ్ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.

Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు.

సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ ఫిల్టర్స్, ట్రైపాడ్ మోడ్, డాక్యుమెంట్స్, హెచ్డీఆర్, స్కైషాప్, ఏఐ సీన్ డిటెక్షన్, ఫిల్టర్స్, వైడ్ యాంగిల్, 10X జూమ్, పర్సనలైజ్డ్ వాటర్ మార్క్స్, పనొరమా, గూగుల్ లెన్స్, బర్‌స్ట్ షాట్, 4కే వీడియో, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, డ్యూయల్ వీడియో, వీడియో బొకే, వీడియో బ్యూటీ, 4కే టైమ్-ల్యాప్స్, 960ఎఫ్‌పీఎస్ స్లో మోషన్, ఏఆర్ షాట్, నైట్ వీడియో, కస్టమ్ మేకప్, ఫిల్మ్ మోడల్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Tecno Phantom X2 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. Tecno Phantom X2 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, ఎన్ఎఫ్‌సీ, ఏఐ సబ్‌టైటిల్స్, ఎంఓఎల్ 1.5, ఐడీఏ ఇంజిన్ 3.0, లైట్నింగ్ మల్టీ విండో 3.0, ఎల్లా 2.0, వీలైఫ్, మై హెల్త్, అరోరా ఇంజిన్, మాగెలన్ ఇంజిన్, రికార్డ్ ట్రాన్స్‌లేటర్, పీసీ కనెక్షన్, స్మార్ట్ 5జీ తదితర ఫీచర్లు Tecno Phantom X2 లో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.

Tecno Phantom X2 Pro స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 Pro మరియు Tecno Phantom X2 మోడల్స్ మధ్య పెద్దగా తేడాలు ఏమీ లేవు. ఒక్క కెమెరా విభాగంలో మాత్రమే ఈ తేడాను గమనించవచ్చు. ఇది కాకుండా మిగతా ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఓసారి Tecno Phantom X2 Pro కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం.

Tecno Phantom X2 Pro లో 50MP+50MP+13MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో ప్రపంచపు మొట్టమొదటి రిట్రాక్టబుల్ 50ఎంపి పొట్రెయిట్ లెన్స్ వాడారు. 7th జనరేషన్ IMAGIQ 790 ISP, 5th Gen AI Processor APU 590 ఈ కెమెరా సిస్టమ్ లో వాడారు. ఇంకా ఇందులో Quad Flashlight ని అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Phantom X2, Tecno Phantom X2 Pro ధరలు

Tecno Phantom X2 8జిబి+256జిబి మోడల్ ధర SAR 2699 (సుమారు రూ.59,200), Tecno Phantom X2 Pro 12జిబి+256జిబి యూనిట్ ధర SAR 3,499 (సుమారు రూ.76,700) గా నిర్ణయించారు. ఈ ధరలు సౌదీ అరేబియాకి సంబంధించినవి. భారత్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాక ధరలు వేరుగా ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>