
Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన కొన్ని రోజులకే Tecno Phantom X2 Pro కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలైతే ఈ ఫోన్లు గత నెలలో గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. Tecno Phantom X2 Pro రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్ కెమెరా తో వచ్చింది. స్లిమ్ డిజైన్, లైట్ వినియోగం, పొట్రెయిట్ షాట్స్ కోసం ప్యూర్ ఆప్టికల్ బొకే.. వంటి వాటిలో ఈ లెన్స్ ఉపయోగపడుతుంది.
Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఇందులో కర్వ్డ్ ఎడ్జెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. Tecno Phantom X2 Pro ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చింది.
భారత్ లో Tecno Phantom X2 Pro ధర, లభ్యత
భారత్ లో Tecno Phantom X2 Pro ధరను రూ.49,999 గా నిర్ణయించారు. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. నేటి నుంచి ఫోన్ ప్రీ-బుకింగ్ అమెజాన్ మరియు రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా జరుగుతుంది. జనవరి 24 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా అమెజాన్ రూ.5,000 అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్, 12 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్, 6 నెలలు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ అందిస్తోంది. రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచితంగా టెక్నో గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. ఇది తొలి 600 కస్టమర్లకు మాత్రమే.
Tecno Phantom X2 Pro స్పెసిఫికేషన్స్
Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 93.5 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఇంకా హైపర్ ఇంజిన్ 5.0 టెక్నాలజీని ఈ ఫోన్ లో ఉపయోగించారు.
Tecno Phantom X2 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 5జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Tecno Phantom X2 Pro లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 7పీ లెన్స్, సెవెంత్ జనరేషన్ ఇమేజిక్ 790 ఐఎస్‌పీ, 5th జెన్ ఏఐ ప్రాసెసర్ ఏపీయూ 590, క్వాడ్ ఫ్లాష్ లైట్, 50ఎంపి రీట్రాక్టబుల్ పొట్రెయిట్ లెన్స్, 13ఎంపి లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











