Tecno Pova Neo 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Sep 2022 12:59:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 2 https://www.91mobiles.com/telugu/tecno-pova-neo-2-launched-russia-specs-price/ Tue, 27 Sep 2022 12:59:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=2602 హైలైట్స్: రష్యా లో లాంచ్ అయిన Tecno Pova Neo 2 స్మార్ట్ ఫోన్ 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Tecno Pova Neo 2 ఇటీవలె Tecno Pova Neo 5G ఫోన్ ని లాంచ్ చేసిన Tecno కంపెనీ తాజాగా Tecno Pova Neo 2 ఫోన్ […]

The post 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రష్యా లో లాంచ్ అయిన Tecno Pova Neo 2 స్మార్ట్ ఫోన్
  • 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Tecno Pova Neo 2

ఇటీవలె Tecno Pova Neo 5G ఫోన్ ని లాంచ్ చేసిన Tecno కంపెనీ తాజాగా Tecno Pova Neo 2 ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. 7000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రష్యాలో Tecno Pova Neo 2 లాంచ్ అయ్యింది. ఈ సరికొత్త పోవా సిరీస్ ఫోన్ 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Tecno Pova Neo 2 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో-ఎస్డీ కార్డ్ ఆప్షన్, 6జిబి ర్యామ్ ఉన్నాయి. మరి ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Tecno Pova Neo 2 ధర, స్పెసిఫికేషన్స్

Tecno Pova Neo 2 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 11,990 రూబుల్స్ (దాదాపు రూ.17,000) గా ఉంది. ఇక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 13,990 రూబుల్స్ (దాదాపు రూ.20,000) గా ఉంది. అక్టోబర్ 3 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ రష్యాలో సేల్ కి రానుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో త్వరలోనే తెలియనుంది.

Tecno Pova Neo 2 లో 6.82-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 393 పీపీఐ, 480 నిట్స్ బ్రైట్నెస్, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, మాలి జీ52 జీపీయూ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.

Tecno Pova Neo 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16ఎంపి ప్రైమరీ షూటర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8ఎంపి కెమెరా అమర్చారు. Tecno Pova Neo 2 ఫోన్ 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Pova Neo 2 యురనోలైట్ గ్రే, వర్చువల్ బ్లూ, ఆరెంజ్ మాగ్మా కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత, హైఓఎస్ 8.6 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. Tecno Pova Neo 2 స్మార్ట్ ఫోన్ 170.86 మిల్లీ మీటర్ల పొడవు, 77.79 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.63 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 2 first appeared on 91Mobiles Telugu.

]]>