హైలైట్స్:
- రష్యా లో లాంచ్ అయిన Tecno Pova Neo 2 స్మార్ట్ ఫోన్
- 7000mAh బ్యాటరీ, Helio G85 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Tecno Pova Neo 2
ఇటీవలె Tecno Pova Neo 5G ఫోన్ ని లాంచ్ చేసిన Tecno కంపెనీ తాజాగా Tecno Pova Neo 2 ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. 7000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రష్యాలో Tecno Pova Neo 2 లాంచ్ అయ్యింది. ఈ సరికొత్త పోవా సిరీస్ ఫోన్ 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
Tecno Pova Neo 2 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో-ఎస్డీ కార్డ్ ఆప్షన్, 6జిబి ర్యామ్ ఉన్నాయి. మరి ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Tecno Pova Neo 2 ధర, స్పెసిఫికేషన్స్
Tecno Pova Neo 2 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 11,990 రూబుల్స్ (దాదాపు రూ.17,000) గా ఉంది. ఇక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 13,990 రూబుల్స్ (దాదాపు రూ.20,000) గా ఉంది. అక్టోబర్ 3 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ రష్యాలో సేల్ కి రానుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో త్వరలోనే తెలియనుంది.
Tecno Pova Neo 2 లో 6.82-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 393 పీపీఐ, 480 నిట్స్ బ్రైట్నెస్, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, మాలి జీ52 జీపీయూ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
Tecno Pova Neo 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16ఎంపి ప్రైమరీ షూటర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8ఎంపి కెమెరా అమర్చారు. Tecno Pova Neo 2 ఫోన్ 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno Pova Neo 2 యురనోలైట్ గ్రే, వర్చువల్ బ్లూ, ఆరెంజ్ మాగ్మా కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత, హైఓఎస్ 8.6 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. Tecno Pova Neo 2 స్మార్ట్ ఫోన్ 170.86 మిల్లీ మీటర్ల పొడవు, 77.79 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.63 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












