Tecno Pova Neo 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Sep 2022 11:10:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno Pova Neo 5G https://www.91mobiles.com/telugu/tecno-pova-neo-5g-launched-india-price-specs/ Fri, 23 Sep 2022 11:10:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2538 హైలైట్స్: భారత మార్కెట్ లో తన 5జీ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటోన్న TECNO బ్రాండ్ 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అయిన టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో Tecno Pova Neo 5G ధర రూ.15,499 నేడు భారత మార్కెట్ లో టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ Tecno Pova Neo 5G ని లాంచ్ చేసింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 120హెర్ట్జ్ […]

The post నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno Pova Neo 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత మార్కెట్ లో తన 5జీ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటోన్న TECNO బ్రాండ్
  • 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అయిన టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్
  • భారత్ లో Tecno Pova Neo 5G ధర రూ.15,499

నేడు భారత మార్కెట్ లో టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ Tecno Pova Neo 5G ని లాంచ్ చేసింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ వంటి సూపర్బ్ స్పెసిఫికేషన్స్ ని Tecno Pova Neo 5G కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ధర భారత మార్కెట్ లో రూ.15,499 గా నిర్ణయించారు.

Tecno Pova Neo 5G స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Tecno Pova Neo 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్నో ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ స్క్రీన్ 393 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ, 500 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో Tecno Pova Neo 5G లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ HiOS 8.6 కస్టమ్ స్కిన్ ని కలిగి ఉంది. Tecno Pova Neo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. 3జిబి వర్చువల్ ర్యామ్ సాయంతో ఈ ఫోన్ మొత్తంగా 7జిబి ర్యామ్ శక్తిని అందిపుచ్చుకుంటుంది.

Tecno Pova Neo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఏఐ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.

Tecno Pova Neo 5G లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. అలాగే ఇది 4జీ, 5జీ కనెక్టివిటీలను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. Tecno Pova Neo 5G లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Pova Neo 5G ధర

Tecno Pova Neo 5G సింగిల్ వేరియంట్ మాత్రమే భారత్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,499 గా నిర్ణయించారు. టెక్నో కంపెనీ ఇతర వేరియంట్లను విడుదల చేస్తుందేమో చూడాలి. స్ప్రింట్ బ్లూ, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో Tecno Pova Neo 5G ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno Pova Neo 5G first appeared on 91Mobiles Telugu.

]]>
6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తున్న Tecno Pova Neo 5G https://www.91mobiles.com/telugu/tecno-pova-neo-5g-design-specs-leaked/ Thu, 22 Sep 2022 05:39:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=2497 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన Tecno Pova Neo 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న Tecno Pova Neo 5G ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుందని సమాచారం భారత మార్కెట్ లో Tecno Pova Neo 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు టెక్నో కంపెనీ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 23 న Tecno Pova Neo 5G ఎంట్రీ ఇస్తుందని […]

The post 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తున్న Tecno Pova Neo 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన Tecno Pova Neo 5G డిజైన్, స్పెసిఫికేషన్స్
  • 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న Tecno Pova Neo 5G
  • ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుందని సమాచారం

భారత మార్కెట్ లో Tecno Pova Neo 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు టెక్నో కంపెనీ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 23 న Tecno Pova Neo 5G ఎంట్రీ ఇస్తుందని సదరు సంస్థ ప్రకటించింది. Tecno Pova Neo 5G 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని లాంచ్ కి ముందు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో ప్రైస్‌బాబా Tecno Pova Neo 5G యొక్క డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలను లీక్ చేసింది. రిపోర్ట్ ప్రకారం Tecno Pova Neo 5G ధర భారత్ లో రూ.20,000 గా ఉండనుంది. మరి Tecno Pova Neo 5G స్మార్ట్ ఫోన్ డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Tecno Pova Neo 5G: డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్

నివేదికను బట్టి, Tecno Pova Neo 5G 6.9-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండనుందని సమాచారం. ఈ ఫోన్లో టెక్నో హయ్యర్ రిఫ్రెష్ రేట్ ప్లాన్ చేస్తుందా లేదా స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ నే అందిస్తుందా అనేది ఇంకా తెలియదు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత HiOS కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Tecno Pova Neo 5G 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని కలిగి ఉండనుంది. Tecno Pova Neo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా ఉంటుందని అంచనా. Tecno Pova Neo 5G సఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Pova Neo 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని టెక్నో సంస్థ స్పష్టం చేసింది.

Tecno Pova Neo 5G ధర (అంచనా)

రిపోర్ట్ ప్రకారం చూస్తే, Tecno Pova Neo 5G ధర భారత్ లో రూ.17,000 నుంచి రూ.19,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత ఫోన్ లాంచ్ అయ్యాకే తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత 6.9-ఇంచ్ భారీ సైజు కలిగిన అమోలెడ్ ప్యానెల్ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తున్న Tecno Pova Neo 5G first appeared on 91Mobiles Telugu.

]]>