Tecno Spark 30C 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 11:11:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/#respond Tue, 08 Oct 2024 11:11:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=13983 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్‌లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Spark 30C 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్‌లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 30C 5G ధర, సేల్ వివరాలు

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. టెక్నో వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా ఫోన్ కొనవచ్చు.

Tecno Spark 30C 5G డిజైన్, కలర్స్

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ ఫ్లాట్ గా, కనిపించేంత బెజెల్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అజూర్ స్కై, మిడ్నైట్ షాడో మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని వేరియంట్స్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో ఉంటాయి.

Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 30C 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 30C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మెమొరీని గరిష్టంగా 8జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Tecno Spark 30C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Spark 30C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Tecno Spark 30C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, 10 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Spark 30C 5G లో డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Tecno Spark 30C 5G: 48MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-launched-india-48mp-camera-5000mah-battery/feed/ 0
Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/#respond Tue, 01 Oct 2024 12:11:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13865 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన ఈ ఫోన్ భారత్ లో విడులవ్వనుంది. టెక్నో షేర్ చేసిన టీజర్ ద్వారా స్పెసిఫికేషన్స్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం. Tecno […]

The post Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 8న Tecno Spark 30C 5G విడుదల
  • 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన ఈ ఫోన్ భారత్ లో విడులవ్వనుంది. టెక్నో షేర్ చేసిన టీజర్ ద్వారా స్పెసిఫికేషన్స్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.

Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో అక్టోబర్ 8వ తేదీన లాంచ్ అవుతోంది. క్రేజీలీ రిలైబుల్ అనే ట్యాగ్‌లైన్ తో ఈ ఫోన్ వస్తోంది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్ లో ఫోన్ గ్లిమ్స్ చూడవచ్చు.

Tecno Spark 30C 5G ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tecno Spark 30C 5G డిజైన్

Tecno Spark 30C 5G డివైజ్ పంచ్ హోల్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. స్క్రీన్ ఫ్లాట్ గా ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక రింగ్ ఎల్ఈడీ లైట్ కూడా ఉంది. కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్లాక్ మరియు మరొక డ్యూయల్ టోన్ ఆప్షన్ లో కనిపిస్తోంది. మొత్తం మీద, తక్కువ బడ్జెట్ అయినా.. ఫోన్ చూసేందుకు మంచి లుక్‌తో ఉంది.

Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్

కంపెనీ విడుదల చేసిన టీజర్ గమనిస్తే, Tecno Spark 30C 5G డివైజ్ 48ఎంపి సోని సెన్సర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు ఒక ఏఐ లెన్స్ కూడా ఉంటుంది.

డిస్ప్లే విషయానికి వస్తే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్‌ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ విషయంపై స్పష్టత లేదు.

Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Tecno Spark 30C 5G లో 8ఎంపి డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Tecno Spark 30C 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది.

The post Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/feed/ 0