
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన ఈ ఫోన్ భారత్ లో విడులవ్వనుంది. టెక్నో షేర్ చేసిన టీజర్ ద్వారా స్పెసిఫికేషన్స్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.
Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో అక్టోబర్ 8వ తేదీన లాంచ్ అవుతోంది. క్రేజీలీ రిలైబుల్ అనే ట్యాగ్‌లైన్ తో ఈ ఫోన్ వస్తోంది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్ లో ఫోన్ గ్లిమ్స్ చూడవచ్చు.
Tecno Spark 30C 5G ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Tecno Spark 30C 5G డిజైన్
Tecno Spark 30C 5G డివైజ్ పంచ్ హోల్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. స్క్రీన్ ఫ్లాట్ గా ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక రింగ్ ఎల్ఈడీ లైట్ కూడా ఉంది. కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్లాక్ మరియు మరొక డ్యూయల్ టోన్ ఆప్షన్ లో కనిపిస్తోంది. మొత్తం మీద, తక్కువ బడ్జెట్ అయినా.. ఫోన్ చూసేందుకు మంచి లుక్‌తో ఉంది.
Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్
కంపెనీ విడుదల చేసిన టీజర్ గమనిస్తే, Tecno Spark 30C 5G డివైజ్ 48ఎంపి సోని సెన్సర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు ఒక ఏఐ లెన్స్ కూడా ఉంటుంది.
డిస్ప్లే విషయానికి వస్తే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్‌ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ విషయంపై స్పష్టత లేదు.
Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
Tecno Spark 30C 5G లో 8ఎంపి డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
Tecno Spark 30C 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది.












