Twitter - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 31 Oct 2022 15:16:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 వెరిఫైడ్ యూజర్ల నుంచి నెలకి రూ.1650 వసూలు చేయనున్న Twitter https://www.91mobiles.com/telugu/twitter-to-charge-for-paid-verification-latest-decision-by-elon-musk/ Mon, 31 Oct 2022 14:31:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3153 హైలైట్స్ పెయిడ్ వెరిఫికేషన్ ని తీసుకురానున్న ట్విట్టర్ యూజర్లు నెలకు కట్టాల్సిన రుసుము రూ.1650 (20 డాలర్లు) బ్లూ టిక్ కలిగిన వెరిఫైడ్ యూజర్లు నెలకు 20 డాలర్లు కట్టాల్సిందేనా? ఇటీవలె ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మస్క్ వచ్చీ రావడంతోనే సీఈవో పరాగ్ తో సహా ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉద్వాసన పలికాడు. ఇప్పుడు మస్క్ రాకతో ట్విట్టర్ భారీ […]

The post వెరిఫైడ్ యూజర్ల నుంచి నెలకి రూ.1650 వసూలు చేయనున్న Twitter first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పెయిడ్ వెరిఫికేషన్ ని తీసుకురానున్న ట్విట్టర్
  • యూజర్లు నెలకు కట్టాల్సిన రుసుము రూ.1650 (20 డాలర్లు)
  • బ్లూ టిక్ కలిగిన వెరిఫైడ్ యూజర్లు నెలకు 20 డాలర్లు కట్టాల్సిందేనా?

ఇటీవలె ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మస్క్ వచ్చీ రావడంతోనే సీఈవో పరాగ్ తో సహా ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉద్వాసన పలికాడు. ఇప్పుడు మస్క్ రాకతో ట్విట్టర్ భారీ మార్పులకు లోనవ్వబోతోంది. ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్లకు ఉండే బ్లూ టిక్ చిహ్నం, ఇతర ట్విట్టర్ యూజర్ల నుంచి తమ ప్రొఫైల్ కి విభిన్నతను తెచ్చిపెడుతోంది. ఎలన్ మస్క్, బ్లూ టిక్ యూజర్లను మానిటైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తను తొలుత Platformer మరియు The Verge వెల్లడించాయి.

20 డాలర్లు కట్టు లేదా ట్విట్టర్ వెరిఫికేషన్ వదులుకో

రిపోర్ట్స్ ప్రకారం, ట్విట్టర్ త్వరలోనే తన వెరిఫైడ్ యూజర్లను నెలకు 20 డాలర్లు (సుమారు రూ.1646) కట్టమని అడగనుంది. వెరిఫైడ్ యూజర్ గా బ్లూ టిక్ తో కొనసాగాలంటే ఈ రుసుం కట్టాల్సిందేనని ట్విట్టర్ చెప్పనుంది. ఇక ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు 4.99 డాలర్లు (సుమారు రూ.410) గా ఉంది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం 19.99 డాలర్లు (సుమారు రూ.1650) 90 రోజుల్లోపు చెల్లించాలని లేకపోతే బ్లూ టిక్ కోల్పోతారని ట్విట్టర్ తన యూజర్లకు తెలపనుంది. నవంబర్ 7 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లేకపోతే ఉద్యోగాలు కోల్పోతారని ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఆమేరకు మస్క్ ఓ ట్వీట్ కూడా చేశాడు.

ఈ ఏడాది జూన్ ఆరంభంలో ట్విట్టర్ భారత్ లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు యాడ్-ఫ్రీ ఆర్టికల్స్ చూడటం, ట్వీట్స్ ని ఎడిట్ చేయడం, అన్‌డూ యాక్షన్స్, యాప్ కలర్ మార్చడం వంటివి చేసుకునే వీలుంది. అయితే దీనికి నెలకు రూ.269 చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్ గా బ్లూ ప్లాన్ యూజర్లకు ఎడిట్ ట్వీట్ ఆప్షన్ ని ట్విట్టర్ రోలౌట్ చేసింది.

Elon Musk, గత వారం అధికారికంగా Twitter ని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ రూపురేఖలను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం ట్విట్టర్ కి యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతోంది. దాన్ని సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ప్లాన్స్ కి మార్చాలని మస్క్ యోచిస్తున్నాడు. ట్విట్టర్ ని కైవసం చేసుకున్న వెంటనే మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ విజయా గద్దె లను తొలగించాడు. 75 శాతం ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని మస్క్ నిర్ణయించినట్లు పలు వార్తల ద్వారా తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post వెరిఫైడ్ యూజర్ల నుంచి నెలకి రూ.1650 వసూలు చేయనున్న Twitter first appeared on 91Mobiles Telugu.

]]>
సీఈవో పరాగ్ అగర్వాల్ తో సహా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ని Twitter నుంచి బయటకు పంపిన Elon Musk https://www.91mobiles.com/telugu/elon-musk-takes-over-twitter-fires-ceo-parag-and-others/ Fri, 28 Oct 2022 09:22:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=3121 హైలైట్స్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొన్న ఎలన్ మస్క్ ట్విట్టర్ కి కొత్త ఓనర్ గా మారిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ హెడ్ విజయ గద్దె లను విధుల నుంచి తొలగించిన ఎలన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డీల్ ని ఎట్టకేలకు ఎలన్ మస్క్ క్లోజ్ చేసుకున్నారు. 44 డాలర్లకు ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ […]

The post సీఈవో పరాగ్ అగర్వాల్ తో సహా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ని Twitter నుంచి బయటకు పంపిన Elon Musk first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొన్న ఎలన్ మస్క్
  • ట్విట్టర్ కి కొత్త ఓనర్ గా మారిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్
  • ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ హెడ్ విజయ గద్దె లను విధుల నుంచి తొలగించిన ఎలన్ మస్క్

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డీల్ ని ఎట్టకేలకు ఎలన్ మస్క్ క్లోజ్ చేసుకున్నారు. 44 డాలర్లకు ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేశారు. ట్విట్టర్ కి ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్త ఓనర్ గా అవతరించారు. అయితే వచ్చి రావడంతోనే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ హెడ్ విజయ గద్దె లకు ఉద్వాసన పలికారు మస్క్.

ట్విట్టర్ ని కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ఏప్రిల్ నెలలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తర్వాత ఫేక్ అకౌంట్, స్పామ్ వంటి కారణాల వల్లన మస్క్ ఈ డీల్ ని మధ్యలోనే రద్దు చేసుకున్నారు. దీంతో ట్విట్టర్ కోర్టుకి వెళ్ళింది. అక్టోబర్ 28 లోపు డీల్ ని పూర్తి చేయాలని ఎలన్ మస్క్ కి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే గడువు కంటే ఒకరోజు ముందే డీల్ ని క్లోజ్ చేసిన మస్క్, అందరినీ ఆశ్చర్యపరిచారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ని మస్క్ తన సొంతం చేసుకున్నారు.

సింక్ (వాష్ బేసిన్) తో Twitter హెడ్ క్వార్టర్స్ లో అడుగు పెట్టిన Elon Musk

ట్విట్టర్ డీల్ పూర్తయ్యాక, ఎలన్ మస్క్ చేతిలో ఒక సింక్ తో ట్విట్టర్ కార్యాలయం లోకి అడుగు పెట్టారు. ట్విట్టర్ లో ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగుల్లో 75 శాతం మందిని తొలగించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Insider రిపోర్ట్ ప్రకారం, పరాగ్ అగర్వాల్ కి కంపెన్సేషన్ క్రింద 38.7 మిలియన్ డాలర్లు, నెడ్ సెగల్ కి 25.4 మిలియన్ డాలర్లు, విజయ గద్దె కి 12.5 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ లో తన Bio ని అప్డేట్ చేసిన మస్క్

ట్విట్టర్ డీల్ పూర్తి చేశాక, ఎలన్ మస్క్ తన ట్విట్టర్ బయో ని మార్చేశారు. ‘Chief Twit’ అని తన బయో లో రాసుకొచ్చారు. దీంతో పాటు ట్విట్టర్ లో అడ్వర్టైజ్ చేసే వారికి ఒక లేఖను రాశారు. ట్విట్టర్ ని తాను కొనడం వెనక ఉన్న తన ఉద్దేశాన్ని వెల్లడించారు. బయట వినిపిస్తోన్న రూమర్లను నమ్మవద్దని మస్క్ అన్నారు. రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిట్ వేదిక ఉండటం చాలా అవసరమని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నో అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలని ఆయన చెప్పారు. విద్వేషాలకు అవకాశం లేని వేదికను అందించేందుకే ట్విట్టర్ ని కొన్నట్లు మస్క్ చెప్పారు. తాను ప్రేమించే మానవాళికి సాయం చేయడానికే ట్విట్టర్ ని కొన్నానని మస్క్ వెల్లడించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post సీఈవో పరాగ్ అగర్వాల్ తో సహా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ని Twitter నుంచి బయటకు పంపిన Elon Musk first appeared on 91Mobiles Telugu.

]]>