హైలైట్స్
- పెయిడ్ వెరిఫికేషన్ ని తీసుకురానున్న ట్విట్టర్
- యూజర్లు నెలకు కట్టాల్సిన రుసుము రూ.1650 (20 డాలర్లు)
- బ్లూ టిక్ కలిగిన వెరిఫైడ్ యూజర్లు నెలకు 20 డాలర్లు కట్టాల్సిందేనా?
ఇటీవలె ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మస్క్ వచ్చీ రావడంతోనే సీఈవో పరాగ్ తో సహా ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉద్వాసన పలికాడు. ఇప్పుడు మస్క్ రాకతో ట్విట్టర్ భారీ మార్పులకు లోనవ్వబోతోంది. ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్లకు ఉండే బ్లూ టిక్ చిహ్నం, ఇతర ట్విట్టర్ యూజర్ల నుంచి తమ ప్రొఫైల్ కి విభిన్నతను తెచ్చిపెడుతోంది. ఎలన్ మస్క్, బ్లూ టిక్ యూజర్లను మానిటైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తను తొలుత Platformer మరియు The Verge వెల్లడించాయి.
20 డాలర్లు కట్టు లేదా ట్విట్టర్ వెరిఫికేషన్ వదులుకో
రిపోర్ట్స్ ప్రకారం, ట్విట్టర్ త్వరలోనే తన వెరిఫైడ్ యూజర్లను నెలకు 20 డాలర్లు (సుమారు రూ.1646) కట్టమని అడగనుంది. వెరిఫైడ్ యూజర్ గా బ్లూ టిక్ తో కొనసాగాలంటే ఈ రుసుం కట్టాల్సిందేనని ట్విట్టర్ చెప్పనుంది. ఇక ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు 4.99 డాలర్లు (సుమారు రూ.410) గా ఉంది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం 19.99 డాలర్లు (సుమారు రూ.1650) 90 రోజుల్లోపు చెల్లించాలని లేకపోతే బ్లూ టిక్ కోల్పోతారని ట్విట్టర్ తన యూజర్లకు తెలపనుంది. నవంబర్ 7 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లేకపోతే ఉద్యోగాలు కోల్పోతారని ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఆమేరకు మస్క్ ఓ ట్వీట్ కూడా చేశాడు.
The whole verification process is being revamped right now
— Elon Musk (@elonmusk) October 30, 2022
ఈ ఏడాది జూన్ ఆరంభంలో ట్విట్టర్ భారత్ లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు యాడ్-ఫ్రీ ఆర్టికల్స్ చూడటం, ట్వీట్స్ ని ఎడిట్ చేయడం, అన్‌డూ యాక్షన్స్, యాప్ కలర్ మార్చడం వంటివి చేసుకునే వీలుంది. అయితే దీనికి నెలకు రూ.269 చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్ గా బ్లూ ప్లాన్ యూజర్లకు ఎడిట్ ట్వీట్ ఆప్షన్ ని ట్విట్టర్ రోలౌట్ చేసింది.
Elon Musk, గత వారం అధికారికంగా Twitter ని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ రూపురేఖలను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం ట్విట్టర్ కి యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతోంది. దాన్ని సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ప్లాన్స్ కి మార్చాలని మస్క్ యోచిస్తున్నాడు. ట్విట్టర్ ని కైవసం చేసుకున్న వెంటనే మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ విజయా గద్దె లను తొలగించాడు. 75 శాతం ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని మస్క్ నిర్ణయించినట్లు పలు వార్తల ద్వారా తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












