Vivo S17e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 May 2023 06:40:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7200 చిప్‌తో చైనాలో లాంచైన Vivo S17e https://www.91mobiles.com/telugu/vivo-s17e-launched-china-price-specs-availability/ Mon, 15 May 2023 06:11:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=6298 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఎస్17 సిరీస్ లో Vivo S17e అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. Vivo S17e మే 20 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి. అయితే ఎప్పుడు కూడా వివో సంస్థ తన ఎస్-సిరీస్ డివైజెస్ ని ఒకేసారి లాంచ్ చేస్తుంది. కానీ, ఈసారి అందిరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుగా Vivo S17e ఫోన్ ని మాత్రమే లాంచ్ చేసింది. మరి […]

The post 120హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7200 చిప్‌తో చైనాలో లాంచైన Vivo S17e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo S17e డివైజ్ 
  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే కలిగి ఉన్న ఫోన్
  • 3 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఎస్17 సిరీస్ లో Vivo S17e అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. Vivo S17e మే 20 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి. అయితే ఎప్పుడు కూడా వివో సంస్థ తన ఎస్-సిరీస్ డివైజెస్ ని ఒకేసారి లాంచ్ చేస్తుంది. కానీ, ఈసారి అందిరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుగా Vivo S17e ఫోన్ ని మాత్రమే లాంచ్ చేసింది. మరి ఈ కొత్త మిడ్-రేంజ్ ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo S17e స్పెసిఫికేషన్స్

Vivo S17e స్మార్ట్ ఫోన్ గత మోడల్ Vivo S16e కి సక్సెసర్ గా వస్తోంది. వివో వీ27 తో ఈ ఫోన్ కి ఎన్నో పోలికలు ఉన్నాయి.

డిస్ప్లే

  • ఫుల్ హెచ్డీ+
  • 120 హెర్ట్జ్

Vivo S17e స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి.

చిప్సెట్

  • డైమెన్సిటీ 7200

Vivo S17e స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వాడారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 4600 ఎంఏహెచ్
  • 66 వాట్

Vivo S17e స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి ప్రైమరీ
  • 16ఎంపి సెల్ఫీ

Vivo S17e డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక 2ఎంపి సెకండరీ సెన్సర్, రింగ్ షేప్ లో ఉన్న ఎల్ఈడీ లైట్ ఉంది. దీన్ని కంపెనీ ఆరా లైట్ అని పిలుస్తోంది. ఇకపోతే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ

  • 5జీ, 4జీ వొల్టీ

Vivo S17e స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎష్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి. ఈ ఫోన్ 164.20 మిల్లీ మీటర్ల పొడవు, 74.90 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.4 మిల్లీ మీటర్ల మందం, 178 గ్రాముల బరువు ఉంటుంది.

ధర, లభ్యత

Vivo S17e స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ప్రస్తుతం మొదలయ్యాయి. క్విక్ సాండ్ గోల్డ్, సన్నీ బ్లూ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ 8జిబి+128జిబి, 8జిబి+256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 2099 యువాన్లు (సుమారు రూ.24,800), 2299 యువాన్లు (సుమారు రూ.27,000) గా ఉన్నాయి. ఇక టాప్ వేరియంట్ అయిన 12జిబి+256జిబి మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.29,500) గా ఉంది.

The post 120హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7200 చిప్‌తో చైనాలో లాంచైన Vivo S17e first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo S17e https://www.91mobiles.com/telugu/vivo-s17e-spotted-google-play-supported-devices-list-database-expected-specs/ Mon, 01 May 2023 09:43:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=6099 Vivo సంస్థ త్వరలో Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Vivo S17, Vivo S17e, Vivo S17 Pro ఫోన్లను లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు వేరే పేరుతో భారత్ లో కూడా లాంచ్ అవుతాయని సమాచారం. ఇప్పటికైతే, Vivo S17e డివైజ్ చైనీస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇంకా గూగుల్ ప్లే సపోర్టెడ్ […]

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo S17e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S17 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo S17, Vivo S17e, Vivo S17 Pro
  • రీసెంట్ గా చైనీస్ 3సీ సర్టిఫికేషన్, గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన డివైజ్

Vivo సంస్థ త్వరలో Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Vivo S17, Vivo S17e, Vivo S17 Pro ఫోన్లను లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు వేరే పేరుతో భారత్ లో కూడా లాంచ్ అవుతాయని సమాచారం. ఇప్పటికైతే, Vivo S17e డివైజ్ చైనీస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇంకా గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కూడా ఈ ఫోన్ కనిపించింది. మోడల్ నంబర్ తో కూడిన డివైజ్ పేరు ఈ లిస్ట్ లో కనిపించింది.

వివిధ సర్టిఫికేషన్స్ ద్వారా ఖరారైన Vivo S17e చార్జింగ్ స్పీడ్, డివైజ్ పేరు

  • 3సీ సర్టిఫికేషన్ ప్రకారం, Vivo S17e డివైజ్ V2285A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సర్టిఫికేషన్ లిస్టింగ్ డివైజ్ పేరుని కన్ఫర్మ్ చేయలేదు కానీ మోడల్ నంబర్ కనిపిస్తోంది. ఇదే మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై Vivo S17e కనిపించింది.
  • గూగుల్ లిస్టింగ్ ప్రకారం, V2285A మోడల్ నంబర్ Vivo S17e కి చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో అన్ని అనుమానాలు తీరిపోయినట్లైంది.
  • ఇదే మోడల్ నంబర్ ఇదివరకు Vivo S17 Pro కి చెందినదని భావించారు. ఇది కూడా గీక్ బెంచ్ డేటాబేస్ వెబ్ సైట్ పై కనిపించింది.
  • గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Vivo S17e డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానున్నట్లు సమాచారం.

Vivo S17e స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

Vivo S17e లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది.

చిప్సెట్

Vivo S17e స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ

Vivo S17e లో కనీసం 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండే చాన్స్ ఉంది.

ఓఎస్

ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్
పై పని చేయనుంది.

బ్యాటరీ, చార్జింగ్

Vivo S17e లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా

Vivo S17e లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo S17e first appeared on 91Mobiles Telugu.

]]>