Vivo T3x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 Apr 2024 14:14:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3x 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-t3x-5g-launched-in-india-with-50mp-camera-6000mah-battery/ Wed, 17 Apr 2024 14:14:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=11143 ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో T3x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3x 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి వివో టీ3ఎక్స్ 5జీ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo T3x 5G ధర, లభ్యత Vivo T3x 5G […]

The post Vivo T3x 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo T3x 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో T3x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3x 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి వివో టీ3ఎక్స్ 5జీ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G ధర, లభ్యత

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo T3x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.16,499 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్లను పరిశీలిస్తే, రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ని బ్రాండ్ ఆఫర్ చేస్తోంది.

ఏప్రిల్ 24 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్ మొదలవుతుంది.

Vivo T3x 5G డివైజ్ సెలెస్టియల్ గ్రీన్ మరియు క్రిమ్సన్ బ్లిస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3x 5G లో 6.72-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo T3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo T3x 5G డివైజ్ 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంది.

The post Vivo T3x 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3x 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3ఎక్స్ 5జీ https://www.91mobiles.com/telugu/vivo-t3x-5g-listed-on-geekbench/ Sun, 14 Apr 2024 18:13:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11081 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన భారత్ లో వివో టీ3ఎక్స్ 5జీ లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo T3x 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం […]

The post Vivo T3x 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 17న Vivo T3x 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • మోడల్ నంబర్ V2338

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన భారత్ లో వివో టీ3ఎక్స్ 5జీ లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo T3x 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

త్వరలో లాంచ్ కాబోయే Vivo T3x 5G గీక్‌బెంచ్ పై V2338 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3x 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 946 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2839 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ వివో ఫోన్ ఆక్టా-కోర్ట్ చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీని హై క్లాక్ స్పీడ్ 2.21GHz. అడ్రెనో 710 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో వాడినట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ప్రాసెసర్ వివరాలను బట్టి, Vivo T3x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

గీక్‌బెంచ్ డేటాబేస్ పై వివో టీ3ఎక్స్ 5జీ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3x 5G వివరాలు (ఖరారైనవి)

Vivo T3x 5G యొక్క మైక్రో-సైట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై దర్శనమిస్తోంది. ఆ మైక్రో-సైట్ ద్వారా డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 5,60,000 అంటుటు బెంచ్‌మార్క్ పాయింట్స్ మైక్రోసైట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యాయి.

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ సెలెస్టియల్ గ్రీన్ మరియు క్రిమ్సన్ బ్లిస్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది.

డిజైన్ విషయానికి వస్తే, బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo T3x 5G ధర రూ.15,000 లోపు ఉంటుందని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెలుస్తోంది.

Vivo T3x 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo T3x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3x 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: Vivo T3x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo T3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3x 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.

The post Vivo T3x 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-april-2024/ Fri, 12 Apr 2024 14:14:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11062 గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి. Moto G64 5G iQOO Z9 Turbo Vivo T3x 5G Realme […]

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి.

  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme C65

Moto G64 5G

మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16న లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

iQOO Z9 Turbo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo T3x 5G

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

Realme P1 5G

రియల్మీ నుంచి కొత్తగా పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి: Realme P1 5G మరియు Realme P1 Pro 5G. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ కానున్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం ఈ పీ-సిరీస్ ని తీసుకొస్తున్నట్లు రియల్మీ తెలిపింది. Realme P1 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. Realme P1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది.

Realme C65

Realme C65 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. రియల్మీ సీ65 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-t3x-5g-india-launch-confirmed/ Tue, 09 Apr 2024 08:56:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10997 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ వివో టీ3ఎక్స్ 5జీ ఇండియా లాంచ్ ఖరారైంది. టీజర్ ద్వారా లాంచ్‌ని వివో కన్ఫర్మ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Vivo T3x 5G ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo T3x 5G లాంచ్ […]

The post Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3x 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ వివో టీ3ఎక్స్ 5జీ ఇండియా లాంచ్ ఖరారైంది. టీజర్ ద్వారా లాంచ్‌ని వివో కన్ఫర్మ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Vivo T3x 5G ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G లాంచ్ వివరాలు

వివో కంపెనీ తాజాగా Vivo T3x 5G యొక్క టీజర్ ని విడుదల చేసింది. దీన్ని గమనిస్తే ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివో టీ3ఎక్స్ 5జీ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ పై దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. అయితే లాంచ్ తేదీకి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

అంటుటు స్కోర్ ని బట్టి, Vivo T3x 5G లో కాస్త శక్తివంతమైన ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు గత వారం ఓ వార్త కథనం వెలువడింది. అలాగే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు సమాచారం.

Vivo T3x 5G డివైజ్ గత మోడల్ Vivo T2x 5G కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. Vivo T2x 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Vivo T2x 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo T2x 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>