Vivo T3x 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన వివో కొత్త ఫోన్

Highlights

  • నేడు భారత్‌లో Vivo T3x 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో T3x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3x 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి వివో టీ3ఎక్స్ 5జీ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G ధర, లభ్యత

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo T3x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.16,499 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్లను పరిశీలిస్తే, రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ని బ్రాండ్ ఆఫర్ చేస్తోంది.

ఏప్రిల్ 24 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్ మొదలవుతుంది.

Vivo T3x 5G డివైజ్ సెలెస్టియల్ గ్రీన్ మరియు క్రిమ్సన్ బ్లిస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3x 5G లో 6.72-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo T3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo T3x 5G డివైజ్ 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంది.