Vivo V25 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Sep 2022 12:27:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo https://www.91mobiles.com/telugu/vivo-ganesh-chaturthi-offers-huge-discounts/ Thu, 01 Sep 2022 12:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2045 హైలైట్స్: పలు ఫోన్లపై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన వివో Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై ఆఫర్ వర్తింపు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్న వివో గణేశ్ చతుర్థి ఆఫర్ Vivo కంపెనీ వినాయక చవితి పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Vivo V25 Pro, […]

The post Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • పలు ఫోన్లపై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన వివో
  • Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై ఆఫర్ వర్తింపు
  • సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్న వివో గణేశ్ చతుర్థి ఆఫర్

Vivo కంపెనీ వినాయక చవితి పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Vivo V25 Pro, Vivo X80, Vivo Y75 పై గణేశ్ చతుర్థి పండుగ సందర్భంగా వివో కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్స్ లేటెస్ట్ టెక్నీలజీ, సూపర్ స్పెసిఫికేషన్స్, కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఉత్తమమైన ఫోటోగ్రఫీ నాణ్యత, ఐ-ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ వివో స్మార్ట్ ఫోన్స్ పై అందుబాటులో ఉన్న గణేశ్ చతుర్థి ఆఫర్స్ యొక్క వివరాలను ఇక్కడ అందజేస్తున్నాం.

Vivo గణేశ్ చతుర్థి ఆఫర్

వివో ప్రకటించిన గణేశ్ చతుర్థి ఆఫర్ లో భాగంగా కంపెనీ వివో వీ25 ప్రో, ఎక్స్80, వై75 ఫోన్లను ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా, ఎస్‌బీఐ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ తో కొంటే ప్రయోజనాలు లభించనున్నాయి.

Vivo X80 series, V25 Pro, Y75 పై డిస్కౌంట్

వివో ఎక్స్80 సిరీస్ పై రూ.4000 డిస్కౌంట్ లభించనుంది. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ పై రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక వివో వై75 ఫోన్ కొనుగోలు పై రూ.1500 డిస్కౌంట్ వస్తుంది.

Vivo V25 Pro

ఈ స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఓఐఎస్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ తో తయారైంది. 120 హెర్ట్జ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 32ఎంపి ఆటో ఫోకస్ కెమెరా ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ ఇందులో అమర్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4830ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Vivo Y75

వివో వై75 స్మార్ట్ ఫోన్లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, డ్యూయల్ సిమ్, టైప్-సీ పోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Vivo X80

వివో ఎక్స్80 ని కూడా ఈ గణేశ్ చతుర్థి ఆఫర్ లో తక్కువ రేటుకే కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్, ప్రీమియమ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్లో జైస్ గింబల్ సపోర్ట్ పోట్రెయిట్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ను ఈ ఫోన్లో అమర్చారు. 50ఎంపి అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్866 ప్రైమరీ కెమెరా ఈ ఫోన్లో ఉంది. అలాగే ఈ ఫోన్లో ఉత్తమ ఫోటోగ్రఫీ కొరకు ప్రో-ఇమేజింగ్ వీ1+ చిప్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Vivo X80, V25 Pro, Y75 ఫోన్స్ పై గణేశ్ చతుర్థి ఆఫర్ ప్రకటించిన Vivo first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మొదటిసారి విక్రయానికి వచ్చిన Vivo V25 Pro: ధర, బ్యాంక్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-pro-first-sale-india-price-availability-offers/ Thu, 25 Aug 2022 11:57:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1909 హైలైట్స్: నేడు తొలిసారి భారత్ లో అమ్మకానికి వచ్చిన వివో వీ25 ప్రో ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా జరగనున్న విక్రయాలు రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న వివో వీ25 ప్రో; ఫోన్ ధర రూ.35,999 నుంచి రూ.39,999 గత వారంలో వివో సంస్థ భారత్ లో వివో వీ25 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే వివో తన లైనప్ లో వీ24 ప్రో ని తీసుకు […]

The post భారత్ లో మొదటిసారి విక్రయానికి వచ్చిన Vivo V25 Pro: ధర, బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేడు తొలిసారి భారత్ లో అమ్మకానికి వచ్చిన వివో వీ25 ప్రో
  • ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా జరగనున్న విక్రయాలు
  • రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న వివో వీ25 ప్రో; ఫోన్ ధర రూ.35,999 నుంచి రూ.39,999

గత వారంలో వివో సంస్థ భారత్ లో వివో వీ25 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే వివో తన లైనప్ లో వీ24 ప్రో ని తీసుకు రావడం లేదు. వివో వీ23 ప్రో తర్వాత నేరుగా వివో వీ25 ప్రో లాంచ్ అయ్యింది. ఈఫోన్ ఏజీ ప్లోరైట్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. రంగులు మార్చడం ఈ హ్యాండ్సెట్ ప్రత్యేకత. నేడు, ఈ హ్యాండ్సెట్ భారత్ లో సేల్ కి వచ్చింది. వివో వీ25 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్లు, సేల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Vivo V25 Pro ధర, సేల్, ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా నేటి నుంచి వివో వీ25 ప్రో ని కొనుగోలు చేయవచ్చు. ఈ వివో ఫోన్ రెండు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ. 8జిబి + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. 12జిబి + 256జిబి టాప్ వేరియంట్ ధర రూ.39,999 గా నిర్ణయించారు.

హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్స్ ద్వారా వివో వీ25 ప్రో ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ కార్డ్ యూజర్లు వివో వీ25 ప్రో ఫోన్ కొనుగోలు పై రూ.750 డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా వివో వీ25 ప్రో ఫోన్ కొనేవారు గూగుల్ నెస్ట్ హబ్ ని రూ.4999 కి, గూగుల్ నెస్ట్ మినీ ని రూ.1999 కి సొంతం చేసుకోవచ్చు.

Vivo V25 Pro స్పెసిఫికేషన్స్

వివో వీ25 ప్రో లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్, 4830 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo V25 Pro Specs

  • 6.56-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్
  • 4830 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్స్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post భారత్ లో మొదటిసారి విక్రయానికి వచ్చిన Vivo V25 Pro: ధర, బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 1300 చిప్సెట్, 66వాట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అయిన Vivo V25 Pro: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-pro-launched-india-price-specs-availability/ Wed, 17 Aug 2022 09:00:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1724 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన వివో వీ25 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో వివో వీ25 ప్రో ధర రూ.35,999 నుంచి ప్రారంభం వివో వీ25 ప్రో భారత్ లో లాంచ్ అయ్యింది. గతేడాది విడుదలైన వివో వీ23 ప్రో ఫోన్ కి ఇది సక్సెసర్. వీ23 ప్రో […]

The post డైమెన్సిటీ 1300 చిప్సెట్, 66వాట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అయిన Vivo V25 Pro: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన వివో వీ25 ప్రో స్మార్ట్‌ఫోన్
  • 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో వివో వీ25 ప్రో ధర రూ.35,999 నుంచి ప్రారంభం

వివో వీ25 ప్రో భారత్ లో లాంచ్ అయ్యింది. గతేడాది విడుదలైన వివో వీ23 ప్రో ఫోన్ కి ఇది సక్సెసర్. వీ23 ప్రో మాదిరి ఈ ఫోన్ కూడా రంగులు మార్చే బ్యాక్ ఏజీ ప్లోరైట్ గ్లాస్ ని కలిగి ఉంది. సెల్ఫీ షూటర్ కోసం పంచ్ హోల్ కటౌట్ ఇందులో ఉంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఇందులో అందించారు. ఇక ఫోన్ వెనకాల రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వివో వీ25 ప్రో ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లేని అందించారు.

6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్, 12జిబి వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ ఓఎస్, 256జిబి వరకు స్టోరేజీ, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

భారత్ లో Vivo V25 Pro ధర, లభ్యత

వివో వీ25 ప్రో 8జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా నిర్ణయించారు. ఇక 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ ప్యూర్ బ్లాక్ మరియు సెయిలింగ్ బ్లూ కలర్స్ లో లభ్యమవుతుంది. ఫోన్ ని కొనదలిచిన వారు, ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఆగస్టు 25 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 17 నుంచి కస్టమర్లు ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకునే అవకాశముంది. అలాగే హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫోన్ కొంటే రూ.3,500 డిస్కౌంట్ లభించనుంది. ఇక ఎక్చేంజ్ బోనస్ కూడా రూ.3000 వరకు వస్తుంది.

Vivo V25 Pro స్పెసిఫికేషన్స్

వివో వీ25 ప్రో ఫోన్లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. పంచ్ హోల్ కటౌట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, 6,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, ఎస్‌జీఎస్ లో-బ్లూలైట్ సర్టిఫికేషన్, కర్వ్డ్ ఎడ్జెస్, హెచ్డీఆర్10+, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 8జిబి వర్చువల్ ర్యామ్, గేమ్ బూస్ట్ మోడ్, లీనియర్ మోటర్, బయోనిక్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్, 4,830ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, కలర్ చేంజింగ్ ప్లోరైట్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ కలిగిన 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి పోట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ మాట్లాడేందుకు ముందువైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. రియర్ కెమెరాలు నైట్ పోట్రెయిట్, బొకే ఫ్లేర్ పోట్రెయిట్, రియల్-టైమ్ ఎక్స్‌ట్రిమ్ నైట్ మోడ్, ఓఐఎస్ నైట్ వీడియో, బొకే నైట్ వీడియో తదితర ఫీచర్లను కలిగి ఉన్నాయి.

The post డైమెన్సిటీ 1300 చిప్సెట్, 66వాట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అయిన Vivo V25 Pro: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న Vivo V25 Pro https://www.91mobiles.com/telugu/vivo-v25-pro-launching-on-august-17-india-price-specs/ Thu, 11 Aug 2022 13:50:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=1653 హైలైట్స్: ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 ప్రో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్స్ ద్వారా అమ్ముడవ్వనున్న హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు ‘వి’ సిరీస్ ఫోన్ వివో వీ25 ప్రో లాంచ్ తేదీని వివో ప్రకటించింది. చాలా రోజుల పాటు కొనసాగిన ఊహాగానాల తర్వాత వివో వీ25 ప్రో భారత గడ్డపై అడుగు […]

The post ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న Vivo V25 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 ప్రో
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్స్ ద్వారా అమ్ముడవ్వనున్న హ్యాండ్సెట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1300, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు

‘వి’ సిరీస్ ఫోన్ వివో వీ25 ప్రో లాంచ్ తేదీని వివో ప్రకటించింది. చాలా రోజుల పాటు కొనసాగిన ఊహాగానాల తర్వాత వివో వీ25 ప్రో భారత గడ్డపై అడుగు పెడుతోంది. ఆగస్టు 17 న మధ్యాహ్నం 12 గంటలకు వివో వీ25 ప్రో లాంచ్ అవుతోంది. ఇదే నెలలో ఈ ఫోన్ ని సేల్ కి తీసుకొచ్చే అవకాశముంది. వివో వీ25 ప్రో కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో వివో పోస్ట్ చేసింది. రియర్ ప్యానెల్ యొక్క కలర్ చేంజింగ్ ఫీచర్ ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆన్‌లైన్ లభ్యతకు సంబంధించిన డెడికేటెడ్ వెబ్ పేజీ ఒకటి ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోంది.

భారత్ లో Vivo V25 Pro ధర (అంచనా)

వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ తో పాటు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా లభించనుంది. గతంలో కూడా వివో స్మార్ట్ ఫోన్స్ ఈ విధంగా సేల్ కి వచ్చాయి. ఈసారి వివో ఫ్లిప్ కార్ట్ ని తన ఆన్ లైన్ పార్ట్‌నర్ గా ఎంచుకుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, వీ23 ప్రో కంటే కాస్త మెరుగైన ఫీచర్లను వీ25 ప్రో కలిగి ఉందని తెలుస్తోంది. ఇక ఫోన్ రెండు మెమొరీ చాయిసెస్ ను కలిగి ఉంటుందని సమాచారం. ఫోన్ ధర భారత్ లో రూ.40,000 లోపు నుంచి ప్రారంభమవుతుందని అంచనా.

Vivo V25 Pro స్పెసిఫికేషన్స్ (రూమర్ల ప్రకారం)

రూమర్లను బట్టి వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించిన లిస్టింగ్ ప్రకారం, వివో వీ25 ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ను వినియోగించినట్లు సమాచారం. వీ23 ప్రో లో ఉపయోగించిన డైమెన్సిటీ 1200 తో పోలిస్తే కాస్త మెరుగైన చిప్సెట్ ను ఇందులో వాడారు. 8జిబి+128జిబి, 12జిబి+256జిబి వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుందని తెలుస్తోంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్, ఈఐఎస్), ఆగ్జిలరీ సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు వైపున 32ఎంపి కెమెరాను అమర్చారు.

వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. దాంతో పాటు ఏఐ సెల్ఫీలు, సూపర్ నైట్ మోడ్, కలర్-చేంజింగ్ ఏజీ గ్లాస్ బ్యాక్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్‌సైట్ ని విజిట్ చేయండి.

The post ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న Vivo V25 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Vivo V25 Pro ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-pro-specs-price-leaked-before-launch/ Tue, 02 Aug 2022 05:35:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=1419 హైలైట్స్: త్వరలో భారత గడ్డపై అడుగు పెట్టనున్న వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో లాంచ్ కి ముందు లీకైన వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు భారత్ లో వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ప్లాన్ చేస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో అనే […]

The post లాంచ్ కి ముందు లీకైన Vivo V25 Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత గడ్డపై అడుగు పెట్టనున్న వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో
  • లాంచ్ కి ముందు లీకైన వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు

భారత్ లో వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ప్లాన్ చేస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో అనే రెండు మోడల్స్ ఈ లైనప్ లో ఉంటాయి. ఆగస్టు నెలలో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఒకేసారి లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ గా భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివో వీ25 ప్రో ఫోన్ ని టీజ్ చేశాడు. దీంతో వివో వీ25 ప్రో యొక్క ప్రధాన ఫీచర్లు, ధర బయటకు వచ్చాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.

భారత్ లో Vivo V25 Pro ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇండియా టుడే కథనం ప్రకారం, త్వరలో విడుదలవుతోన్న వివో వీ25 ప్రో ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది. అలాగే ఈ కెమెరాలో సూపర్ నైట్ మోడ్ ఫీచర్ ఉంది. ఇక రెండో కెమెరా అయినా అల్ట్రావైడ్ లెన్స్ ఈఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లో ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించారు. ఈ కెమెరాలో ఐ ఆటోఫోకస్ అనే ఫీచర్ ఉంది. ఇక ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, వివో వీ25 ప్రో 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు డిజైన్ గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో కలర్ చేంజింగ్ టెక్నాలజీ, ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ తో వస్తున్నట్లు సమాచారం. సూర్యకాంతికి లేదా అతినీలలోహిత (యూవీ) రేడియేషన్ కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఫోన్ తన రంగుని మారుస్తుంది. ఇదివరకు వివో నుంచి కలర్ చేంజింగ్ టెక్నాలజీతో పలు ఫోన్లు వచ్చాయి.

ఇప్పుడు డిస్ప్లే గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లో ఫుల్ హెచ్డీ+ 3డీ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ని ఈ ఫోన్లో అమర్చారు. 8జిబి+128జిబి, 12జిబి+256 వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. ఇక ఈ ఫోన్లో వెనకాల మూడు కెమెరాలను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడిన 64ఎంపి ప్రధాన కెమెరా, ఎలక్ట్రానికి ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన సెకండరీ కెమెరా, థర్డ్ కెమెరా డెప్త్ లేదా మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశముంది.

ఇక ధర విషయానికి వస్తే, వివో వీ25 ప్రో ధర భారత్ లో రూ.40,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. ఇది బేస్ వేరియంట్ అంచనా ధర. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

The post లాంచ్ కి ముందు లీకైన Vivo V25 Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>