హైలైట్స్:
- త్వరలో భారత గడ్డపై అడుగు పెట్టనున్న వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
- ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో
- లాంచ్ కి ముందు లీకైన వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు
భారత్ లో వివో వీ25 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ప్లాన్ చేస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ వివో వీ25, వివో వీ25 ప్రో అనే రెండు మోడల్స్ ఈ లైనప్ లో ఉంటాయి. ఆగస్టు నెలలో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఒకేసారి లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ గా భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివో వీ25 ప్రో ఫోన్ ని టీజ్ చేశాడు. దీంతో వివో వీ25 ప్రో యొక్క ప్రధాన ఫీచర్లు, ధర బయటకు వచ్చాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
భారత్ లో Vivo V25 Pro ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)
ఇండియా టుడే కథనం ప్రకారం, త్వరలో విడుదలవుతోన్న వివో వీ25 ప్రో ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది. అలాగే ఈ కెమెరాలో సూపర్ నైట్ మోడ్ ఫీచర్ ఉంది. ఇక రెండో కెమెరా అయినా అల్ట్రావైడ్ లెన్స్ ఈఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లో ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించారు. ఈ కెమెరాలో ఐ ఆటోఫోకస్ అనే ఫీచర్ ఉంది. ఇక ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, వివో వీ25 ప్రో 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు డిజైన్ గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో కలర్ చేంజింగ్ టెక్నాలజీ, ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ తో వస్తున్నట్లు సమాచారం. సూర్యకాంతికి లేదా అతినీలలోహిత (యూవీ) రేడియేషన్ కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఫోన్ తన రంగుని మారుస్తుంది. ఇదివరకు వివో నుంచి కలర్ చేంజింగ్ టెక్నాలజీతో పలు ఫోన్లు వచ్చాయి.
ఇప్పుడు డిస్ప్లే గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్లో ఫుల్ హెచ్డీ+ 3డీ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ని ఈ ఫోన్లో అమర్చారు. 8జిబి+128జిబి, 12జిబి+256 వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. ఇక ఈ ఫోన్లో వెనకాల మూడు కెమెరాలను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడిన 64ఎంపి ప్రధాన కెమెరా, ఎలక్ట్రానికి ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన సెకండరీ కెమెరా, థర్డ్ కెమెరా డెప్త్ లేదా మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశముంది.
ఇక ధర విషయానికి వస్తే, వివో వీ25 ప్రో ధర భారత్ లో రూ.40,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. ఇది బేస్ వేరియంట్ అంచనా ధర. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.












