Vivo V27e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 10:09:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e https://www.91mobiles.com/telugu/vivo-v27e-launched-malaysia-specs-price-availability/ Wed, 01 Mar 2023 14:53:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=5172 Vivo సంస్థ నేడు భారత్ లో Vivo V27, Vivo V27 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. అయితే మలేషియాలో Vivo V27e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. ఈ ఫోన్ భారత మార్కెట్ కి రాలేదు. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. Vivo V27e డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 […]

The post MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో లాంచైన Vivo V27e స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, ఆరా లైట్ తో వచ్చిన Vivo V27e డివైజ్
  • ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Vivo V27e

Vivo సంస్థ నేడు భారత్ లో Vivo V27, Vivo V27 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. అయితే మలేషియాలో Vivo V27e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. ఈ ఫోన్ భారత మార్కెట్ కి రాలేదు. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Vivo V27e డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆరా లైట్, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Vivo V27e పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V27e ధర, లభ్యత

Vivo V27e స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర మలేషియాలో RM 1,299 (సుమారు రూ.24,000) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియాలో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

Vivo V27e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo V27e స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్) రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.62-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ నాచ్ ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Vivo V27e డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V27e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంది. దీనికి తోడు 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఆరా లైట్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo V27e లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Vivo V27e లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.టైప్ సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ54 రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo V27e రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్. Vivo V27e గ్లోరీ బ్లాక్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.70 ఎంఎం మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ల్యావెండర్ పర్పుల్ కలర్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.80 ఎంఎం మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V27e లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 1 న Vivo V27e లాంచ్ అయ్యే అవకాశం; లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v27e-launching-march-1st-specs-tipped/ Tue, 21 Feb 2023 07:24:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=5021 Vivo V27 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు వివో సంస్థ సిద్ధమవుతోంది. మార్చి 1 న ఈ ఫోన్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కి ముందు Vivo V27e వివో మలేషియా వెబ్‌సైట్ లో Vivo V27e ల్యాండింగ్ పేజీ దర్శనమిస్తోంది. త్వరలో లాంచ్ కాబోయే Vivo V27e స్మార్ట్ ఫోన్ మైక్రో-సైట్ ద్వారా ఓవరాల్ డిజైన్, ప్రధాన అంశాలు బయటకు వచ్చాయి. […]

The post మార్చి 1 న Vivo V27e లాంచ్ అయ్యే అవకాశం; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గతంలో గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించిన Vivo V27e స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోన్న Vivo V27e డివైజ్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Vivo V27 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు వివో సంస్థ సిద్ధమవుతోంది. మార్చి 1 న ఈ ఫోన్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కి ముందు Vivo V27e వివో మలేషియా వెబ్‌సైట్ లో Vivo V27e ల్యాండింగ్ పేజీ దర్శనమిస్తోంది. త్వరలో లాంచ్ కాబోయే Vivo V27e స్మార్ట్ ఫోన్ మైక్రో-సైట్ ద్వారా ఓవరాల్ డిజైన్, ప్రధాన అంశాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo V27e స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశాడు. Vivo V27e 4జీ కనెక్టివిటీ తో మార్కెట్ లోకి వస్తోందని పారస్ తెలిపాడు. మార్చి 3 నుంచి Vivo V27e డివైజ్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి రానుందని సమాచారం. సరే, ఓసారి Vivo V27e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం. పదండి.

Vivo V27e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (లీక్డ్)

Vivo V27e స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో రానుందని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా స్పష్టమైంది. ఇప్పుడు పారస్ కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాడు. Vivo V27e స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ నాచ్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోందని అంచనా.

Vivo V27e అఫీషియల్ ఇమేజెస్ ప్రకారం, ఈ డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆరా లైట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో వస్తోందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. మిగతా రెండు షూటర్స్ 2ఎంపి రెజుల్యూషన్ తో రానున్నాయని పారస్ చెబుతున్నాడు. ఇకపోతే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉండనుంది.

Vivo V27e లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ డివైజ్ 8జిబి + 256జిబి వేరియంట్ లో లభించనుంది. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ లో ఉండనుంది. Vivo V27e ఫోన్ గ్లోరీ బ్లాక్, లావెండర్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలర్ చేంజింగ్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ తో రానుంది.

Vivo V27e ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో రానున్నట్లు వివో తెలిపింది. డివైజ్ 7.8 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై Vivo V27e పని చేయనుంది. మార్చి 3 నుంచి కొన్ని మార్కెట్స్ లో Vivo V27e డివైజ్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post మార్చి 1 న Vivo V27e లాంచ్ అయ్యే అవకాశం; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) https://www.91mobiles.com/telugu/vivo-v27e-bis-sirim-certifications-india-launch-imminent/ Thu, 16 Feb 2023 05:29:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4951 Vivo సంస్థ ఇప్పటికే Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. Vivo V27 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, మరియు Vivo V27e. అయితే వీటిలో Vivo V27e మాత్రం తర్వత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V27e ఫోన్ పలు […]

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • లైనప్ లో భాగంగా వస్తోన్న Vivo V27, Vivo V27 Pro, Vivo V27e
  • నేడు బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ మరియు మలేషియన్ ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V27e

Vivo సంస్థ ఇప్పటికే Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. Vivo V27 సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, మరియు Vivo V27e. అయితే వీటిలో Vivo V27e మాత్రం తర్వత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V27e ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ ని విజిట్ చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

BIS మరియు SIRIM సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V27e స్మార్ట్ ఫోన్ బీఐఎస్ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్స్ ని పొందినట్లు వెల్లడించాడు. అయితే ఈ రెండింట్లో ఏ సర్టిఫికేషన్ కూడా Vivo V27e యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని బయటపెట్టలేదు. మలేషియన్ సర్టిఫికేషన్ ఎస్ఐఆర్ఐఎమ్ ఫోన్ యొక్క మోడల్ పేరుని కన్ఫర్మ్ చేయగా, బీఐఎస్ సర్టిఫికేషన్ Vivo V27e ఫోన్ భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టతనిచ్చింది.

Vivo V27 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన Vivo V27e (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>