Vivo V29 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Oct 2023 09:53:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-5g-launched-india-price-specs-availability/ Wed, 04 Oct 2023 09:53:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8266 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V29, V29 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. మెరుగైన కెమెరా, స్టైలిష్ లుక్స్ తో వచ్చిన ఈ ఫోన్లు యూజర్లను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Vivo V29 Pro గురించి తెలుసుకుందాం. Vivo V29 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ […]

The post 80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo V29 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo V29, V29 Pro
  • Vivo V29 Pro ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V29, V29 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. మెరుగైన కెమెరా, స్టైలిష్ లుక్స్ తో వచ్చిన ఈ ఫోన్లు యూజర్లను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Vivo V29 Pro గురించి తెలుసుకుందాం. Vivo V29 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి ఈ ఫోన్ ధర ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29 Pro ధర, ఆఫర్లు

Vivo V29 Pro డివైజ్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.42,999 గా నిర్ణయించారు. నేటి నుంచే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్, వివో పార్ట్‌నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. కంపెనీ హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై రూ.3,500 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఫోన్ రూ.36,499 కే లభించనుంది.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Vivo V29 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Vivo V29 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
  • కెమెరా: Vivo V29 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo V29 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V29 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo V29 Pro డివైజ్ హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • చుట్టుకొలత, బరువు: Vivo V29 Pro డివైజ్ 164 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.4 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

The post 80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-v29-v29-pro-price-range-camera-specs-leaked/ Mon, 18 Sep 2023 18:26:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8059 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ ద్వారా రీసెంట్ గా డిజైన్ మరియు హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, తాజాగా లీకైన Vivo V29 సిరీస్ ధర శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. భారత్‌లో Vivo V29 సిరీస్ ధర (అంచనా) MySmartPrice రిపోర్ట్ ప్రకారం, Vivo V29 సిరీస్ ధర […]

The post లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పొట్రెయిట్-సెంట్రిక్ కెమెరాలతో వస్తోన్న Vivo V29 సిరీస్
  • 50ఎంఎం ఫోకలర్ లెంగ్త్ ఆఫర్ చేయనున్న Vivo V29 Pro
  • స్మార్ట్ ఆరా లైట్ తో వస్తోన్న Vivo V29 సిరీస్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ ద్వారా రీసెంట్ గా డిజైన్ మరియు హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, తాజాగా లీకైన Vivo V29 సిరీస్ ధర శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్‌లో Vivo V29 సిరీస్ ధర (అంచనా)

MySmartPrice రిపోర్ట్ ప్రకారం, Vivo V29 సిరీస్ ధర భారత్ లో రూ.40,000 లోపే ఉంటుందని సమాచారం. ఇది టాప్ వేరియంట్ Vivo V29 Pro కి కూడా వర్తిస్తుంది.

Vivo V29 సిరీస్ కెమెరా వివరాలు

  • రిపోర్ట్ ప్రకారం, Vivo V29 5G, Vivo V29 Pro 5G పొట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం మేజర్ అప్‌గ్రేడ్స్ పొందనున్నాయని సమాచారం.
  • రెండు ఫోన్లు కూడా పొట్రెయిట్-ఫోకస్డ్ కెమెరాలతో వస్తున్నాయి. ఈ కెమెరాలు ప్రొఫెషనల్-లెవెల్ పొట్రెయిట్ ఫోటోలను అందిస్తాయి.
  • Vivo V29 Pro 5G 50MP సోని ఐఎంఎక్స్663 ప్రైమరీ కెమెరా, 50ఎంఎం ఫోకల్ లెంగ్త్ తో వస్తోంది.
  • స్మార్ట్ ఆరా లైట్ అనే ఫీచర్ తో రెండు ఫోన్లు రానున్నాయని తెలుస్తోంది. ఈ ఫీచర్ 1800 కే (వార్మ్) నుంచి 4500కే (కూల్) వరకు అడ్జస్టబుల్ లైటింగ్ ని అందిస్తుంది.
  • ఇంకా Vivo V29, Vivo V29 Pro డివైజెస్ వివో ఇండియా యొక్క ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్-స్టైల్ పొట్రెయిట్ ఫీచర్ తో వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్ 3 కలర్ ఆప్షన్స్, టాప్ మోడల్ 2 కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.

Vivo V29 సిరీస్ స్పెసిఫికేషన్స్

  • Vivo V29, Vivo V29 Pro స్మార్ట్‌ఫోన్లు 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు సమాచారం.
  • రెండు మోడల్స్ కూడా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్నాయి.
  • Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • Vivo V29, Vivo V29 Pro డివైజెస్ 5జీ కనెక్టివిటీ తో వస్తున్నాయి. ఈ ఫోన్లలో డ్యూయల్ సిమ్, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-v29-pro-5g-launch-timeline-september-last-week/ Thu, 14 Sep 2023 05:48:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8013 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో V29 5G డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Vivo V29 Pro 5G అతి త్వరలో లాంచ్ కానుందని రూమర్లు కూడా వచ్చాయి. Vivo V29 5G, Vivo V29 Pro 5G డివైజెస్ ఈ నెలాఖరులో లాంచ్ అవుతున్నాయని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా సమాచారం అందింది. […]

The post సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29, V29 Pro
  • ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ తో వస్తోన్న డివైజెస్
  • భారత మార్కెట్‌కే పరిమితం కానున్న V29 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో V29 5G డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Vivo V29 Pro 5G అతి త్వరలో లాంచ్ కానుందని రూమర్లు కూడా వచ్చాయి. Vivo V29 5G, Vivo V29 Pro 5G డివైజెస్ ఈ నెలాఖరులో లాంచ్ అవుతున్నాయని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా సమాచారం అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V29 5G, Vivo V29 Pro 5G లాంచ్

సెప్టెంబర్ నెలాఖరులో Vivo V29 5G, Vivo V29 Pro 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలని వివో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇండియా-స్పెసిఫిక్ ఫీచర్స్ తో వస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లేంటో ఇంకా తెలియదు. కానీ, భారతదేశ స్పూర్తితో మెజెస్టిక్ రెడ్ కలర్ లో Vivo V29 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

Vivo V29 5G, Vivo V29 Pro 5G ఫోన్లు ప్రీమియమ్ డిజైన్, కొత్త కలర్స్ తో లాంచ్ కానున్నాయి. Vivo V29 Pro 5G డివైజ్ ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ అని తెలుస్తోంది. అంటే భారత మార్కెట్ కాకుండా మరే ఇతర మార్కెట్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కాదు. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, సెప్టెంబర్ చివర్లో లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V29 5G డివైజ్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Vivo V29 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V29 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V29 సిరీస్ గ్లోబల్ టీజర్ విడుదల; బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించిన V29 Pro! https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-global-launch-teaser-bis-certification-listing/ Tue, 25 Jul 2023 07:58:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=7311 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Vivo V29 Pro, Vivo V29 5G, Vivo V29e. ఇటీవలె Vivo V29 Pro డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించడంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు, వివో కంపెనీ Vivo V29 సిరీస్ గ్లోబల్ […]

The post Vivo V29 సిరీస్ గ్లోబల్ టీజర్ విడుదల; బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించిన V29 Pro! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న Vivo V29 Pro
  • బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయిన డివైజ్
  • తాజాగా గ్లోబల్ టీజర్ ని విడుదల చేసిన కంపెనీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Vivo V29 Pro, Vivo V29 5G, Vivo V29e. ఇటీవలె Vivo V29 Pro డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించడంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు, వివో కంపెనీ Vivo V29 సిరీస్ గ్లోబల్ లాంచ్ టీజర్ ని బయటకు వదిలింది. దీంతో లాంచ్ తేదీ సమీపంలోనే ఉందని స్పష్టమవుతోంది.

Vivo V29 Pro BIS లిస్టింగ్

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ V2251 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ వెబ్ సైట్ పై కనిపించింది. మోడల్ నంబర్ కాకుడా, ఇతర వివరాలేవీ లిస్టింగ్ ద్వారా బయటకు రాలేదు. Vivo V29 Pro డివైజ్ ప్రీమియమ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫోన్ లో సూపర్బ్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై కూడా కనిపించింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Vivo V29 గ్లోబల్ టీజర్

వివో కంపెనీ Vivo V29 సిరీస్ గ్లోబల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో Vivo V29 మోడల్ భారీ కెమెరా మాడ్యూల్ తో కనిపించింది. ఇందులో 2 సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ కెమెరా సెటప్ ని చూస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు, వివో బ్రాండింగ్ ఫోన్ కి బాటమ్ లో కనిపిస్తోంది. ఇకపోతే ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండవచ్చు.
  • కెమెరా: Vivo V29 Pro డివైజ్ లో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50 ఎంపి కెమెరా అందించనున్నారు.
  • బ్యాటరీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V29 Pro డివైజ్ లో కలర్ చేంజింగ్ ప్యానెల్, డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.
  • ఓఎస్: Vivo V29 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V29 సిరీస్ గ్లోబల్ టీజర్ విడుదల; బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించిన V29 Pro! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-price-india-launch-timeline-key-details/ Mon, 17 Jul 2023 16:07:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7217 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. Vivo […]

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29
  • లైనప్ లో రానున్న 3 మోడల్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29, Vivo V29 Pro, Vivo V29e

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

Vivo V29 సిరీస్ లో రానున్న 3 మోడల్స్

Vivo V29 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. మీడియా కథనాలను బట్టి, ఈసారి Vivo V29 5G, Vivo V29 Pro 5G, Vivo V29 Lite 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే Vivo V29 Lite డివైజ్ Vivo V29e 5G పేరుతో భారత్ కి రానుంది.

Vivo V29 సిరీస్ ధర (అంచనా)

  • Vivo V29 Pro 5G = రూ.39,999
  • Vivo V29e 5G = రూ.35,999
  • Vivo V29 5G = రూ.31,999

లైనప్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro దాదాపు రూ.40,000 తో లాంచ్ కానుంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ.35,000 ఉంటుందని అంచనా. Vivo V29e ధర రూ.31,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే మార్కెట్ ని బట్టి, ధరలు మారుతుంటాయని గమనించాలి.

Vivo V29 సిరీస్ లాంచ్ వివరాలు (లీక్)

అయితే వీ-సిరీస్ లాంచ్ కి సంబంధించి ఇప్పటివరకు ఏ వివరాలు బయటకు రాలేదు. కొన్ని వారాల క్రితం వివో ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ లో Vivo V29 Pro టీజర్ ఇమేజ్ కనిపించింది. దానిపై త్వరలో రాబోతోంది అని రాసి ఉంది. ఆగస్టులో భారత్ తో సహా గ్లోబల్ గా Vivo V29 సిరీస్ ని వివో లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V29 Pro లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాటరీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Vivo V29 Pro డివైజ్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • మెమొరీ వేరియంట్: Vivo V29 Pro డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది.

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
కర్వ్డ్ డిస్ప్లే, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్న Vivo V29 Pro; రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-5g-key-specs-revealed-via-vivo-philippines-website/ Mon, 29 May 2023 13:37:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=6527 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వీ-సిరీస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో ఈ సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. నేడు వివో సంస్థ యొక్క ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ లో Vivo V29 Pro మోడల్ లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ కి ముందు డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. వివో […]

The post కర్వ్డ్ డిస్ప్లే, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్న Vivo V29 Pro; రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • తాజాగా రివీలైన Vivo V29 Pro స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో రానున్న Vivo V29 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వీ-సిరీస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో ఈ సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. నేడు వివో సంస్థ యొక్క ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ లో Vivo V29 Pro మోడల్ లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ కి ముందు డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

వివో వీ-సిరీస్ కి భారత మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. జనాలు వివో వీ-సిరీస్ ఫోన్లను కొనేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇక వారి అంచనాలకు తగ్గట్లే తమ వీ-సిరీస్ ఫోన్లను వివో అన్ని రకాల ఫీచర్లతో తీసుకొస్తోంది. ఈసారి రాబోవు వివో వీ29 సిరీస్ ద్వారా సదరు సంస్థ జనాలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ గురించి తెలిసిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయని వెబ్ సైట్ లో పేర్కొనబడి ఉంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి కెమెరా

Vivo V29 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని ప్రొడక్ట్ పేజీలో తెలపబడింది. 64ఎంపి ప్రైమరీ సెన్సర్ తో ఈ డివైజ్ వస్తోంది. మిగతా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 66 వాట్

Vivo V29 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

మెమొరీ వేరియంట్

  • 12జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

Vivo V29 Pro సింగిల్ మెమొరీ వేరియంట్ వివో ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

The post కర్వ్డ్ డిస్ప్లే, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్న Vivo V29 Pro; రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
12జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo V29 Pro https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-5g-specs-revealed-via-leaks/ Sat, 20 May 2023 16:13:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=6405 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో గ్లోబల్ గా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం. తర్వాత భారత్ లోకి ఈ సిరీస్ ప్రవేశించనుంది. వివో వీ29 సిరీస్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro గురించి తాజాగా ఓ సమాచారం తెలిసింది. టిప్‌స్టర్ సుదాన్శు Vivo V29 Pro కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ […]

The post 12జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • ఇంకా వెల్లడి కాని సిరీస్ లాంచ్ తేదీ
  • 66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో గ్లోబల్ గా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం. తర్వాత భారత్ లోకి ఈ సిరీస్ ప్రవేశించనుంది. వివో వీ29 సిరీస్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro గురించి తాజాగా ఓ సమాచారం తెలిసింది. టిప్‌స్టర్ సుదాన్శు Vivo V29 Pro కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

వివో వీ-సిరీస్ కి భారత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో వివో వీ-సిరీస్ ఫ్యాన్స్ ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ వారిని మరింత ఉత్సాహపరచడం ఖాయమని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఓఎల్ఈడీ ప్యానెల్
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo V29 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఇంకా 1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ

  • 12జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఇవ్వనున్నారు. అయితే, ఈ డివైజ్ ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుందని సమాచారం.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. దీంతో పాటు ఉండే మిగతా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. ఇకపోతే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇంతే. రానున్న రోజుల్లో ఈ డివైజ్ గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

The post 12జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo V29 Pro https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-5g-specs-revealed-india-launch-very-soon/ Thu, 13 Apr 2023 14:12:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=5874 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కి భారత్ లో మంచి డిమాండ్ ఉంది. జనాలు వివో ఫోన్లను కొనేందుకు బాగా ఆసక్తి చూపిస్తారు. కొన్ని నెలల క్రితం వివో సంస్థ భారత్ లో వీ27 సిరీస్ ని లాంచ్ చేసింది. నేడు 91మొబైల్స్ కి వివో వీ29 కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ సమాచారం తెలిసింది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని నుంచి ఈ సమాచారం మాకు లభించింది. అతడి ప్రకారం, వివో కంపెనీ అతి […]

The post 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అతి త్వరలో లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 64ఎంపి ప్రైమరీ, 50ఎంపి ఫ్రంట్ కెమెరా సిరీస్ ప్రత్యేకతలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కి భారత్ లో మంచి డిమాండ్ ఉంది. జనాలు వివో ఫోన్లను కొనేందుకు బాగా ఆసక్తి చూపిస్తారు. కొన్ని నెలల క్రితం వివో సంస్థ భారత్ లో వీ27 సిరీస్ ని లాంచ్ చేసింది. నేడు 91మొబైల్స్ కి వివో వీ29 కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ సమాచారం తెలిసింది. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని నుంచి ఈ సమాచారం మాకు లభించింది. అతడి ప్రకారం, వివో కంపెనీ అతి త్వరలో Vivo V29 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుందట. అతను ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా షేర్ చేశాడు. మీడియాటెక్ 800 సిరీస్ చిప్ తో ఈ ఫోన్ రానుందని అంచనా. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోంది. 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

Vivo V29 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే మరియు డిజైన్

  • 6.7-ఇంచ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Vivo V29 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో ఈ ఫోన్ వస్తోంది. రెండు వైపులా డిస్ప్లే కర్వ్డ్ గా ఉంటుంది. ఈ ఫోన్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెసర్, ర్యామ్-స్టోరేజీ, ఓఎస్

  • డైమెన్సిటీ 8000 సిరీజ్ 5జీ చిప్
  • 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ

ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ చిప్సెట్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ 5జీ ప్రాసెసర్ ఉండనుందని అంచనా. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా

  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా

ఫోటోగ్రఫీ కోసం Vivo V29 Pro 5G డివైజ్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ తో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ మరియు చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo V29 Pro 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం ఇంతే ఉంది.

Vivo V29 Pro 5G ఎప్పుడు లాంచ్ కానుంది?

వివో నుంచి వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ భారత్ మరియు గ్లోబల్ మార్కెట్ లో V2251 అనే మోడల్ నంబర్ తో ఎంట్రీ కానుంది. ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి ఇంకా అధికార సమాచారం లేదు. కంపెనీ గత లాంచ్ విధానాన్ని గమనిస్తే, భారత్ లో Vivo V29 సిరీస్ ఆగస్టు లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo V29 Pro first appeared on 91Mobiles Telugu.

]]>