Vivo V40e vs Motorola Edge 50 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 15:09:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/#respond Mon, 07 Oct 2024 15:09:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13964 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo V40e మరియు Motorola Edge 50 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo V40e లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo V40e vs Motorola Edge 50: ధర

Vivo V40e Motorola Edge 50
పీసీమార్క్ స్కోర్: 15 గంటల 51 నిమిషాలు పీసీమార్క్ స్కోర్: 10 గంటల 59 నిమిషాలు

PCMark బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టడంతో పాటు, స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

పైన చూపిన ఇమేజ్ ని గమనిస్తే, వివో వీ40ఈ, మోటోరోలా ఎడ్జ్ 50 కంటే ఎక్కువ సేపు నడిచినట్లు తెలుస్తోంది. వివో వీ40ఈ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, మోటోరోలా ఎడ్జ్ 50 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో పెద్ద బ్యాటరీ గల వివో ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

విజేత: Vivo V40e

YouTube Streaming (యూట్యూబ్ స్ట్రీమింగ్)

మేం రెండు ఫోన్లలో యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ సమయంలో రెండు డివైజెస్ లో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్ పెట్టాం. 30 నిమిషాలు వీడియోలు చూశాక, వివో వీ40ఈ లో బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 5 శాతం డ్రాప్ అయ్యింది.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
బ్యాటరీ ఖర్చు: 165 ఎంఏహెచ్ బ్యాటరీ ఖర్చు: 250 ఎంఏహెచ్

 

కచ్చితమైన బ్యాటరీ డ్రాప్ ఫలితాలను చూస్తే, వివో వీ40ఈ 165 ఎంఏహెచ్ పవర్ వాడుకోగా, మోటోరోలా ఎడ్జ్ 50 250 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది. అంటే వివో వీ40ఈ బ్యాటరీ మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

విజేత: Vivo V40e

Gaming test (గేమింగ్ టెస్ట్)

ఈ టెస్టు కోసం, మేం వివో వీ40ఈ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది. ఫలితాలను గమనిస్తే, 1.5 గంటల తర్వాత వివో వీ40ఈ బ్యాటరీ 17 శాతం ఖర్చు కాగా, మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
బ్యాటరీ ఖర్చు: 935 ఎంఏహెచ్ బ్యాటరీ ఖర్చు: 1300 ఎంఏహెచ్

 

కచ్చితమైన ఫలితాలను చూస్తే, వివో వీ40ఈ 935 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది. మోటోరోలా ఎడ్జ్ 50 1300 ఎంఏహెచ్ పవర్ వాడుకుంది.

విజేత: Vivo V40e

Charging speed (చార్జింగ్ వేగం)

వివో వీ40ఈ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాగా, మోటోరోలా ఎడ్జ్ 50 డివైజ్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా బాక్స్ లో చార్జర్ తో వస్తాయి. మేం జరిపిన టెస్టులో, 20 శాతం నుంచి 100 శాతం అయ్యేందుకు వివో వీ40ఈ కి 42 నిమిషాలు సమయం పట్టింది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 40 నిమిషాల సమయం తీసుకుంది. రెండు ఫోన్ల మధ్య తేడా దాదాపు ఒకే విధంగా ఉంది. వివో వీ40ఈ లో పెద్ద బ్యాటరీ ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, చార్జింగ్ స్పీడ్ బెటర్ గా ఉందని తెలుస్తోంది. ఈ రౌండ్ లో రెండు ఫోన్లు సమానంగా నిలిచాయి.

వివో వీ40ఈ మోటోరోలా ఎడ్జ్ 50
40 నిమిషాలు 42 నిమిషాలు

 

విజేత: Tie (సమానం)

ఏది బెటర్?

ఫలితాల ప్రకారం, Vivo V40e పైచేయి సాధించినట్లు స్పష్టమవుతోంది. మేం జరిపిన.. బెంచ్‌మార్క్, స్ట్రీమింగ్, గేమింగ్ ఇలా ప్రతీ టెస్టులో వివో వీ40ఈ తన ఆధిపత్యాన్ని చూపింది. మీరు గనుక మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కొరకు చూస్తుంటే, ఎడ్జ్ 50 కంటే వివో వీ40ఈ బెటర్ ఆప్షన్ అవుతుంది.

The post Vivo V40e vs Motorola Edge 50: ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-vs-motorola-edge-50-battery-comparison-which-is-better/feed/ 0