Vivo Y02 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 05 Dec 2022 14:19:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000mAh బ్యాటరీ, MediaTek Helio P22 చిప్ తో లాంచైన Vivo Y02 https://www.91mobiles.com/telugu/vivo-y02-launched-india-specs-price-availability/ Mon, 05 Dec 2022 14:19:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3829 హైలైట్స్ భారత్ లో లాంచైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Vivo Y02 మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ భారత్ లో Vivo Y02 ధర రూ.8,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo Y02 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ ఎవెల్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,000 లోపు పెట్టారు. ఈ ఫోన్ లో […]

The post 5000mAh బ్యాటరీ, MediaTek Helio P22 చిప్ తో లాంచైన Vivo Y02 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Vivo Y02
  • మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Vivo Y02 ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo Y02 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ ఎవెల్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,000 లోపు పెట్టారు. ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉన్నాయి. ఓసారి Vivo Y02 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y02 ధర, లభ్యత

భారత్ లో Vivo Y02 ధరను రూ.8,999 గా నిర్ణయించారు. వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆర్కిడ్ బ్లూ మరియు కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y02 స్పెసిఫికేషన్స్

Vivo Y02 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే రెజుల్యూషన్ 720*1600 పిక్సెల్స్, యాస్పెక్ట్ రేషియో 20:9, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్, ఐ ప్రొటెక్షన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Vivo Y02 లో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ వాడారు. ఇది 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజీ కలిగి ఉంది.

ఇప్పుడు Vivo Y02 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y02 లో 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం Vivo Y02 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ 2.0 చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఫుల్ బ్యాటరీ తో ఏకధాటిగా 18 గంటల పాటు ఆన్‌లైన్ హెచ్డీ వీడియో స్ట్రీమింగ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Vivo Y02 స్మార్ట్ ఫోన్ 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 75.64 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. ఓఎస్ విషయానికి వస్తే, Vivo Y02 ఆండ్రాయిడ్ 12 గో ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo Y02 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వోల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. Vivo Y02 లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1 టెరాబైట్ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000mAh బ్యాటరీ, MediaTek Helio P22 చిప్ తో లాంచైన Vivo Y02 first appeared on 91Mobiles Telugu.

]]>
బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y02 ని లాంచ్ చేసిన వివో https://www.91mobiles.com/telugu/vivo-y02-launched-globally-specs-price/ Tue, 29 Nov 2022 04:25:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3718 హైలైట్స్ గ్లోబల్ గా లాంచ్ అయిన Vivo Y02 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జిబి ర్యామ్ తో వచ్చిన Vivo Y02 త్వరలోనే ఇతర ఆసియా దేశాల్లో లాంచ్ కానున్న Vivo Y02 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y02 ని లాంచ్ చేసింది. ప్రస్తుతం Vivo Y02 ఇండోనేషియా మార్కెట్ కే పరిమితం కానుంది. త్వరలోనే ఇతర ఆసియా మార్కెట్స్ లో […]

The post బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y02 ని లాంచ్ చేసిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గ్లోబల్ గా లాంచ్ అయిన Vivo Y02 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జిబి ర్యామ్ తో వచ్చిన Vivo Y02
  • త్వరలోనే ఇతర ఆసియా దేశాల్లో లాంచ్ కానున్న Vivo Y02

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y02 ని లాంచ్ చేసింది. ప్రస్తుతం Vivo Y02 ఇండోనేషియా మార్కెట్ కే పరిమితం కానుంది. త్వరలోనే ఇతర ఆసియా మార్కెట్స్ లో లాంచ్ కానుంది. ఎటువంటి హడావుడి లేకుండా Vivo Y02 ని తన గ్లోబల్ వెబ్ సైట్ ద్వారా వివో లాంచ్ చేసింది. 3జిబి ర్యామ్, మీడియాటెక్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y02 స్పెసిఫికేషన్స్

2.5డి యూనిబాడీ డిజైన్ పై Vivo Y02 స్మార్ట్ ఫోన్ తయారైంది. 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఫోన్ డిస్ప్లే మూడు వైపులా బెజెల్స్ లేకుండా, క్రింద భాగాన మందపాటి చిన్ ని కలిగి ఉంది. Vivo Y02 డివైజ్ 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 75.63 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y02 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 పై పని చేస్తుంది. గూగుల్ గో యాప్స్ ని ఈ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసి వాడుకోవచ్చు. తక్కువ ర్యామ్ ని మాత్రమే వాడుకుని ఈ గూగుల్ గో యాప్స్ పని చేస్తాయి. అలాగే ఈ యాప్స్ తక్కువ స్టోరేజీని తీసుకోవడంతో పాటు, తక్కువ ఇంటర్నెట్ డేటాను వాడుకుంటాయి. Vivo Y02 లో మీడియాటెక్ ప్రాసెసర్ వాడారు. అయితే కంపెనీ చిప్సెట్ పేరు తెలపలేదు.

Vivo Y02 స్మార్ట్ ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y02 లో 8 మెగా పిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y02 డ్యూయల్ సిమ్ ఫోన్. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం, Vivo Y02 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y02 ధర

Vivo Y02 స్మార్ట్ ఫోన్ వివో గ్లోబల్ వెబ్ సైట్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ లో కనిపిస్తోంది. బేస్ వేరియంట్ 2జిబి ర్యామ్ తో వస్తుండగా, మరొక వేరియంట్ 3జిబి ర్యామ్ తో వస్తోంది. రెండు వేరియంట్లు కూడా 32జిబి ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉన్నాయి. Vivo Y02 ఆర్కిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y02 ధర IDR 14,99,000 (సుమారు రూ.7,700). భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యాక ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y02 ని లాంచ్ చేసిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo Y02 స్పెసిఫికేషన్స్, ధర https://www.91mobiles.com/telugu/vivo-y02-launch-timeline-specs-price-leaked-before-launch/ Mon, 14 Nov 2022 08:58:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3414 హైలైట్స్ లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Vivo Y02 ధర, స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Vivo Y02 రూ.10,000 లోపు ధరతో వస్తోన్న Vivo Y02 ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో చైనాలో X90 సిరీస్ ని లాంచ్ చేసే పనుల్లో నిమగ్నమైంది. నవంబర్ 22 న ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ లాంచ్ ఉండనుంది. ఈ లైనప్ లో మూడు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. […]

The post లీకైన Vivo Y02 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Vivo Y02 ధర, స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Vivo Y02
  • రూ.10,000 లోపు ధరతో వస్తోన్న Vivo Y02

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో చైనాలో X90 సిరీస్ ని లాంచ్ చేసే పనుల్లో నిమగ్నమైంది. నవంబర్ 22 న ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ లాంచ్ ఉండనుంది. ఈ లైనప్ లో మూడు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అవి: X90, X90 Pro, X90 Pro+ 5G. ఇదిలా ఉండగా, లో-బడ్జెట్ ఫోన్ అయిన Vivo Y02 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వబోతోంది.

ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయిన Vivo Y01 కి సక్సెసర్ గా Vivo Y02 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. Vivo Y02 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y02 స్పెసిఫికేషన్స్

త్వరలోనే Vivo Y02 భారత్ లో లాంచ్ కానుంది. ఈలోపు ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని అప్‌కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. టిప్‌స్టర్ ప్రకారం, Vivo Y02 మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో వస్తోంది. స్టోరేజీ వివరాలను గుగ్లాని తెలపలేదు. కానీ, 2జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజీ ఉంటాయని అంచనా వేయవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 256జిబి లేదా 512జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

Vivo Y02 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 8 మెగా పిక్సెల్ సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని అంచనా వేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్ కెమెరా ఉండనుంది.

Vivo Y02 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 5 వాట్ లేదా 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో రావొచ్చు. ఈ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హాలో ఫుల్ వ్యూ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 1600 * 720 పిక్సెల్ రెజుల్యూషన్ ఇందులో ఉంటుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, ఐ ప్రొటెక్షన్ మోడ్, డ్యూయల్ సిమ్ స్లాట్ తో ఈ ఫోన్ వస్తుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు.

Vivo Y02 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo Y02 రూ.8,449 ధరతో భారత్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ వెల్లడించాడు. రానున్న కొన్ని వారాల్లో Vivo Y02 లాంచ్ కానుందని అతడు తెలిపాడు. ఇప్పటి వరకు Vivo Y02 స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీ గురించి వివో ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. త్వరలోనే వివో నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo Y02 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>