Vivo Y22 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Jul 2023 09:27:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Price Cut: Vivo Y22 6GB వేరియంట్ ధర తగ్గింపు! https://www.91mobiles.com/telugu/vivo-y22-6gb-variant-price-cut-by-rs-1000/ Tue, 11 Jul 2023 09:27:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=7156 Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2022 లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. నేడు కంపెనీ Vivo Y22 డివైజ్ 6జిబి వేరియంట్ పై ధరు తగ్గించింది. ఆసక్తిగల వారు ఫోన్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి Vivo Y22 ధర, […]

The post Price Cut: Vivo Y22 6GB వేరియంట్ ధర తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y22 6జిబి వేరియంట్ ధర తగ్గింపు
  • రూ.1000 డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
  • జులై 11 నుంచి కొత్త ధర వర్తింపు

Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2022 లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. నేడు కంపెనీ Vivo Y22 డివైజ్ 6జిబి వేరియంట్ పై ధరు తగ్గించింది. ఆసక్తిగల వారు ఫోన్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి Vivo Y22 ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo Y22 ధర

  • కొత్త ధర = రూ.15,499
  • పాత ధర = రూ.16,499
  • డిస్కౌంట్ = రూ.1,000

Vivo Y22 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.16,499 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ మోడల్ పై రూ.1000 ధర తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. అంటే 6జిబి + 128జిబి వేరియంట్ ధర ఇప్పుడు రూ.15,499 కి తగ్గింది. ఈ కొత్త ధర నేటి నుంచి, అనగా జులై 11 నుంచి అందుబాటులోకి వచ్చింది. Vivo Y22 ఫోన్ ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y22 లో 6.55-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ 164.3 మి.మీ పొడవు, 76.1 మి.మీ వెడల్పు, 8.38 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఓఎస్: Vivo Y22 డివైజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఎమ్‌టీ6769 చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y22 డివైజ్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా 2జిబి వరకు ర్యామ్ మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y22 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో ఐపీఎక్స్4/ఎక్స్5 రేటింగ్, డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo Y22 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post Price Cut: Vivo Y22 6GB వేరియంట్ ధర తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/vivo-y16-vivo-y22-new-variants-introduced/ Wed, 12 Apr 2023 10:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=5847 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo T2 ని లాంచ్ చేసింది. దీంతో పాటు కంపెనీ నుంచి Vivo Y16, Vivo Y22 డివైజెస్ యొక్క కొత్త వేరియంట్లను కూడా లాంచ్ అయ్యాయి. ఇంతకంటే ముందు వై-సిరీస్ లో వివో Vivo Y100A డివైజ్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి వివో వై16 మరియు వై22 డివైజెస్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త వేరియంట్స్ తో వచ్చిన Vivo Y16, Vivo Y22
  • 4జిబి ర్యామ్ తో లాంచైన రెండు స్మార్ట్ ఫోన్స్
  • Vivo Y16 ధర రూ.12,999, Vivo Y22 ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo T2 ని లాంచ్ చేసింది. దీంతో పాటు కంపెనీ నుంచి Vivo Y16, Vivo Y22 డివైజెస్ యొక్క కొత్త వేరియంట్లను కూడా లాంచ్ అయ్యాయి. ఇంతకంటే ముందు వై-సిరీస్ లో వివో Vivo Y100A డివైజ్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి వివో వై16 మరియు వై22 డివైజెస్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్లు

  • 4జిబి ర్యామ్ తో లాంచ్

Vivo Y16, Y22 స్మార్ట్ ఫోన్లు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యాయి. వై16 కొత్త వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. మరోవైపు వై22 కొత్త వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.

Vivo Y16 డివైజ్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y22 డివైజ్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
  • డ్యూయల్ రియర్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ ఎమ్‌టీ6769 చిప్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ 2.5డి డిస్ప్లే ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ ఎమ్‌టీ6769 ప్రాసెసర్ వాడారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా వచ్చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y22 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించరాు. ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
6.5-inch డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y22: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత https://www.91mobiles.com/telugu/vivo-y22-launched-india-price-specs-availability/ Mon, 12 Sep 2022 13:16:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2274 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Vivo Y22 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ ఎంటీ6769 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి కెమెరా సెన్సర్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు Vivo Y22 ధర రూ.14,499 Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, సన్నని బెజెల్స్ కలిగి ఉంది. Vivo […]

The post 6.5-inch డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y22: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Vivo Y22
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ ఎంటీ6769 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి కెమెరా సెన్సర్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • Vivo Y22 ధర రూ.14,499

Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, సన్నని బెజెల్స్ కలిగి ఉంది. Vivo Y22 లో 3.5ఎంఎం ఆడియో జాక్, సెకండరీ మైక్ ఉన్నాయి. వివో ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo Y22.

భారత్ లో Vivo Y22 ధర, సేల్ వివరాలు

Vivo Y22 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: స్టార్‌లిట్ బ్లూ, మెటావర్స్ గ్రీన్. ఈ ఫోన్ ని ఆఫ్ లైన్ ద్వారా ఎస్బీఐ, కొటక్ మహింద్ర, వన్ క్రెడిట్ కార్డ్స్ తో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ లభించనుంది. ఆన్ లైన్ ద్వారా కొనే కస్టమర్లకు రూ.750 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

Vivo Y22 లో 6.5 అంగుళాల హెచ్డీ+ 2.5డీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 530 నిట్స్ బ్రైట్నెస్, బ్లూ-లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్ సర్ఫేస్, మీడియాటెక్ ఎంటీ6769 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo Y22 స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి సెకండరీ సెన్సర్. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ని ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 8ఎంపి కెమెరాను అందించారు.

ఈ హ్యాండ్సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ని కలిగి ఉంది. 4జీ కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. Vivo Y22 లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంది.

Vivo Y22 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: స్టార్‌లిట్ బ్లూ, మెటావర్స్ గ్రీన్. ఈ ఫోన్ ని ఆఫ్ లైన్ ద్వారా ఎస్బీఐ, కొటక్ మహింద్ర, వన్ క్రెడిట్ కార్డ్స్ తో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ లభించనుంది. ఆన్ లైన్ ద్వారా కొనే కస్టమర్లకు రూ.750 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 6.5-inch డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y22: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>