
Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2022 లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. నేడు కంపెనీ Vivo Y22 డివైజ్ 6జిబి వేరియంట్ పై ధరు తగ్గించింది. ఆసక్తిగల వారు ఫోన్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి Vivo Y22 ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Vivo Y22 ధర
- కొత్త ధర = రూ.15,499
- పాత ధర = రూ.16,499
- డిస్కౌంట్ = రూ.1,000
Vivo Y22 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.16,499 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ మోడల్ పై రూ.1000 ధర తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. అంటే 6జిబి + 128జిబి వేరియంట్ ధర ఇప్పుడు రూ.15,499 కి తగ్గింది. ఈ కొత్త ధర నేటి నుంచి, అనగా జులై 11 నుంచి అందుబాటులోకి వచ్చింది. Vivo Y22 ఫోన్ ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Vivo Y22 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y22 లో 6.55-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ 164.3 మి.మీ పొడవు, 76.1 మి.మీ వెడల్పు, 8.38 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.
- ఓఎస్: Vivo Y22 డివైజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ప్రాసెసర్: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఎమ్‌టీ6769 చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y22 డివైజ్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా 2జిబి వరకు ర్యామ్ మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo Y22 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో ఐపీఎక్స్4/ఎక్స్5 రేటింగ్, డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుంది.
- కనెక్టివిటీ: Vivo Y22 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.











