Vivo Y27 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 May 2024 15:32:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో https://www.91mobiles.com/telugu/vivo-reduced-y-series-phones-prices/ Wed, 01 May 2024 15:32:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి. Vivo Y27 ధర Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ […]

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో ఫోన్ల ధర తగ్గింపు
  • Vivo Y27, Y17s ధర తగ్గింపు
  • ప్రారంభ ధర రూ.9499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి.

Vivo Y27 ధర

Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ఇదివరకు రూ.11,999 ధరకి అమ్ముడైంది. ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు దీన్ని రూ.10,999 కి కొనుగోలు చేయవచ్చు. వివో వై27 బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది.

Vivo Y17s ధర

Vivo Y17s స్మార్ట్‌ఫోర్ రెండు మొమరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. రూ.1,000 ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.9,499 కి లభించనుంది.

Vivo Y17s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.11,499 గా ఉంది. ఇప్పుడు రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.10,499 కి లభించనుంది.

Vivo Y27 స్పెసిఫికేషన్స్

Vivo Y27 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Vivo Y17s స్పెసిఫికేషన్స్

Vivo Y17s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y27-vivo-t2-5g-price-drop-know-the-details/ Thu, 01 Feb 2024 18:26:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10038 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా తన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలను వివో తగ్గించింది. వీటిలో Vivo Y27, Vivo T2 5G 6gb, Vivo T2 5G 8gb మోడల్స్ ఉన్నాయి. ఈ డివైజెస్ పై రూ.1,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్లు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల కొత్త ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo Y27 ధర […]

The post Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
  • Vivo Y27 పై రూ.1000 తగ్గింపు
  • Vivo T2 5G పై రూ.1000 తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా తన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలను వివో తగ్గించింది. వీటిలో Vivo Y27, Vivo T2 5G 6gb, Vivo T2 5G 8gb మోడల్స్ ఉన్నాయి. ఈ డివైజెస్ పై రూ.1,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్లు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల కొత్త ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y27 ధర

  • Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,999 గా ఉంది.
  • Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.11,999 కి చేరుకుంది. అంటే రూ.1,000 డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.

Vivo T2 5G 6GB వేరియంట్ ధర

Vivo T2 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.16,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.15,999 కి చేరుకుంది.

Vivo T2 5G 8GB వేరియంట్ ధర

Vivo T2 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.18,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.17,999 కి చేరుకుంది.

Vivo Y27 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
  • రియర్ కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo Y27 4G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Vivo Y27 4G డివైజ్ లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y27 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.0, వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్/5 గిగాహెర్ట్జ్, టైప్-సీ పోర్ట్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: Vivo Y27 4G డివైజ్ 8.07 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo T2 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ వచ్చింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • కెమెరా: Vivo T2 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఒక ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo T2 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కలర్ ఆప్షన్స్: Vivo T2 5G వెలాసిటీ వేవ్ మరియు నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Vivo T2 5G డివైజ్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo T2 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Helio G85 చిప్, 44W ఫ్లాష్‌చార్జ్‌తో భారత్‌లో లాంచైన Vivo Y27 https://www.91mobiles.com/telugu/vivo-y27-4g-launched-india-price-specs-availability/ Thu, 20 Jul 2023 14:57:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=7267 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo Y27 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత వారం గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y27 4G డివైజ్ […]

The post Helio G85 చిప్, 44W ఫ్లాష్‌చార్జ్‌తో భారత్‌లో లాంచైన Vivo Y27 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo Y27
  • గత వారం గ్లోబల్ గా లాంచైన డివైజ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo Y27 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత వారం గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y27 4G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y27 4G ధర, లభ్యత, కలర్స్

  • Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా Vivo Y27 4G ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • అలాగే Vivo Y27 4G డివైజ్ ని ఎంపిక చేయబడిన రిటైల్ పార్ట్‌నర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
  • Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ గార్డెన్ గ్రీన్, బర్గండీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y27 4G స్పెసిఫికేషన్స్

Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ రీసెంట్ గా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. సరే, ఓసారి స్పెసిఫికేషన్స్ ని వివరంగా చూద్దాం.

  • డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
  • రియర్ కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo Y27 4G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Vivo Y27 4G డివైజ్ లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y27 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.0, వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్/5 గిగాహెర్ట్జ్, టైప్-సీ పోర్ట్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: Vivo Y27 4G డివైజ్ 8.07 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post Helio G85 చిప్, 44W ఫ్లాష్‌చార్జ్‌తో భారత్‌లో లాంచైన Vivo Y27 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y27 భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-y27-4g-india-price-revealed/ Tue, 20 Jun 2023 06:17:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=6848 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Vivo Y27 4G పేరుతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే ‘Y’ సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్‌పై వివో పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, కొత్త లీక్ ద్వారా Vivo Y27 4G ధర, మెమరీ వేరియంట్‌లు మరియు లాంచ్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లీకైన Vivo Y27 […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y27 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y27 ప్రారంభ ధర రూ.16,000 గా ఉండే అవకాశం
  • జులై మొదటి వారంలో లాంచ్ కానున్న Vivo Y27
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Vivo Y27 4G పేరుతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే ‘Y’ సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్‌పై వివో పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, కొత్త లీక్ ద్వారా Vivo Y27 4G ధర, మెమరీ వేరియంట్‌లు మరియు లాంచ్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo Y27 4G వివరాలు

ధర శ్రేణి

Vivo Y27 4G కనెక్టివిటీతో వచ్చే మిడ్-బడ్జెట్ ఫోన్. లీక్‌లో, ఈ ఫోన్ ధర సుమారు రూ. 16,000 అని చెప్పబడింది. ఇది ఫోన్ యొక్క ప్రారంభ ధర కావచ్చు. లీక్ ప్రకారం, ఈ Vivo ఫోన్ నలుపు, ఆకుపచ్చ మరియు ముదురు ఎరుపు రంగులలో విక్రయించబడుతుంది.

మెమొరీ వేరియంట్స్

Vivo Y27 4G ఫోన్‌ను రెండు మెమరీ వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చు. దాని బేస్ వేరియంట్‌లో, 4 GB RAMతో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చు. పెద్ద వేరియంట్‌లో 6 GB RAM, 128 GB స్టోరేజీ ఉండవచ్చు. ఈ ఫోన్ గరిష్ట ధర దాదాపు రూ.18 వేలు.

లాంచ్ టైమ్‌లైన్

కొత్త వివో ఫోన్ ని భారతదేశంలో సదరు కంపెనీ జులై నెలలో లాంచ్ చేయనుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది భారతీయ మార్కెట్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. జూలై మొదటి వారంలోనే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు.

Vivo Y27 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo Y27 4G డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ82 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఉంటుంది. మరో సెన్సర్ వివరాలు తెలియలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo Y27 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>