
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo Y27 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత వారం గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y27 4G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo Y27 4G ధర, లభ్యత, కలర్స్
- Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
- అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా Vivo Y27 4G ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
- అలాగే Vivo Y27 4G డివైజ్ ని ఎంపిక చేయబడిన రిటైల్ పార్ట్‌నర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
- Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ గార్డెన్ గ్రీన్, బర్గండీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y27 4G స్పెసిఫికేషన్స్
Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ రీసెంట్ గా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. సరే, ఓసారి స్పెసిఫికేషన్స్ ని వివరంగా చూద్దాం.
- డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
- రియర్ కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉన్నాయి.
- సెల్ఫీ కెమెరా: Vivo Y27 4G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
- చిప్సెట్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ, ర్యామ్: Vivo Y27 4G డివైజ్ లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y27 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.0, వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్/5 గిగాహెర్ట్జ్, టైప్-సీ పోర్ట్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
- డైమెన్షన్స్: Vivo Y27 4G డివైజ్ 8.07 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.











