Vivo Y300 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Oct 2024 14:37:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/#respond Thu, 10 Oct 2024 14:37:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=14042 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Vivo Y300 Plus […]

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo Y300 Plus విడుదల
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • నేటి నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo Y300 Plus ధర, సేల్ వివరాలు

Vivo Y300 Plus స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.23,999 గా నిర్ణయించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. రిటైల్ స్టోర్స్ మరియు సాధారణ మొబైల్ షాప్స్ లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Vivo Y300 Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Plus 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y300 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y300 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300 Plus 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y300 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y300 Plus 5G లో భద్రత కోసం ఐపీ54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు. ఇది తేలికపాటి నీటి జల్లులు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ అందిస్తుంది.

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/feed/ 0
Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/#respond Mon, 07 Oct 2024 07:42:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Vivo Y300+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ద్వారా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo Y300+ భారత మార్కెట్ ధర (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y300+ యొక్క వివరాలను […]

The post Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y300+ విడుదల
  • తాజాగా లీకైన వై300 ప్లస్ వివరాలు
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Vivo Y300+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ద్వారా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y300+ భారత మార్కెట్ ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y300+ యొక్క వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిప్‌స్టర్ తన పోస్ట్ ద్వారా ధర మరియు స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.

Vivo Y300+ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo Y300+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo Y300+ లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y300+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ చాలా పాతకాలం నాటిది. మరి దీన్ని ఈ ఫోన్ లో వాడటం ద్వారా యూజర్లను వివో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిప్సెట్ వివరాల వద్ద, టిప్‌స్టర్ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు. దీన్ని బట్టి వివో స్టెప్ ఏ విధంగా ఉందోనని పరోక్షంగా టిప్‌స్టర్ తెలిపినట్లయ్యింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y300+ డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo Y300+ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బరువు, మందం: Vivo Y300+ డివైజ్ 7.57మి.మీ/7.49మి.మీ మందం, 183/172 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y300+ లో ఐపీ54 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

The post Vivo Y300+: లాంచ్‌కి ముందు లీకైన వివో వై300 ప్లస్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-indian-market-price-and-specs-leaked/feed/ 0