Vivo Y36 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 16 Nov 2023 15:56:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36 5G https://www.91mobiles.com/telugu/vivo-y36-5g-launched-china-specs-price-availability/ Thu, 16 Nov 2023 15:56:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8868 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, ఇప్పటికే Vivo Y36 భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. అయితే భిన్నమైన స్పెసిఫికేషన్స్ తో Vivo Y36 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y36 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 6.56 ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఆఫర్ […]

The post 12GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y36
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన ఫోన్
  • Vivo Y36 ప్రారంభ ధర CNY 1,399

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, ఇప్పటికే Vivo Y36 భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. అయితే భిన్నమైన స్పెసిఫికేషన్స్ తో Vivo Y36 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y36 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 6.56 ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తోంది. సరే, ఓసారి Vivo Y36 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y36 ధర (చైనా)

Vivo Y36 స్మార్ట్‌ఫోన్ చైనాలో 5 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • 6జిబి + 128జిబి మోడల్ ధర CNY 1,399 (సుమారు రూ.16,100)
  • 8జిబి + 128జిబి వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ.18,400)
  • 8జిబి + 256జిబి మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.20,700)
  • 12జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,000)
  • 12జిబి + 512జిబి మోడల్ ధర CNY 2,399 (సుమారు రూ.27,500)

Vivo Y36 డిజైన్, కలర్ ఆప్షన్స్

చైనాలో లాంచైన Vivo Y36 డివైజ్ స్పెసిఫికేషన్స్ పరంగానే కాదు, డిజైన్ విషయంలో కూడా భిన్నంగా ఉంది. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్, సర్క్యులర్ కెమెరా రింగ్, డ్యూయల్ రియర్ కెమెరా, వివో బ్రాండింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. స్పేస్ గ్రే, గెలాక్సీ గోల్డ్ మరియు ఫ్యాంటసీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Vivo Y36 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Vivo Y36 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post 12GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36 5G first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G https://www.91mobiles.com/telugu/vivo-y36-5g-launched-globally-price-specs-availability/ Fri, 22 Sep 2023 11:33:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8126 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo Y36 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఈ డివైజ్ ప్రవేశించింది. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా భారత మార్కెట్ లాంచ్ పై కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. ఈలోపు, ఇండియన్ రిటైల్ బాక్స్ ని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో కొన్ని రోజుల్లోనే Vivo Y36 5G భారత్ లో విడుదలవ్వనుందని అర్థమవుతోంది. సరే, […]

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో లాంచైన Vivo Y36 5G
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • రివీలైన ఇండియన్ రిటైల్ బాక్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo Y36 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఈ డివైజ్ ప్రవేశించింది. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా భారత మార్కెట్ లాంచ్ పై కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. ఈలోపు, ఇండియన్ రిటైల్ బాక్స్ ని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో కొన్ని రోజుల్లోనే Vivo Y36 5G భారత్ లో విడుదలవ్వనుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Vivo Y36 5G యొక్క గ్లోబల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y36 5G ధర

  • ఇండేనోషియాలో Vivo Y36 5G డివైజ్ సింగిల్ వేరియంట్ లోనే లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 37,99,000 (సుమారు రూ.20,000).
  • Vivo Y36 5G డివైజ్ క్రిస్టల్ గ్రీన్, మిస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y36 5G ఇండియన్ రిటైల్ బాక్స్

Vivo Y36 5G యొక్క ఇండియన్ రిటైల్ బాక్స్ రివీల్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది. భారత్ లో Vivo Y36 5G ధర రూ.15,000 వద్ద ఉంటుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఇండియా లాంచ్ కి సంబంధించి వివో నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Vivo Y36 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 5G లో 6.64-ఇంచ్ హెచ్డీ+ అల్ట్రా-ఓ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • మెమొరీ: Vivo Y36 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉన్నాయి. అలాగే 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ5ఎక్స్4 రేటింగ్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! https://www.91mobiles.com/telugu/vivo-y36-series-launch-date-may-25-expected-specs-leaked-info/ Fri, 19 May 2023 11:04:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6391 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y36 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo Y36 5జీ మరియు Vivo Y36 4జీ. ఈ రెండు ఫోన్లు కూడా మే నెలలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ విషయం తెలిసింది. ఇకపోతే అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ, […]

The post డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్న Vivo Y36 సిరీస్
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్
  • ఇండోనేషియన్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y36 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo Y36 5జీ మరియు Vivo Y36 4జీ. ఈ రెండు ఫోన్లు కూడా మే నెలలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ విషయం తెలిసింది. ఇకపోతే అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ ని పొందింది. అంతేకాదు కొన్ని రోజులక్రితం గీక్ బెంచ్ పై కూడా ఈ Vivo Y36 సిరీస్ కనిపించింది. ఈ సిరీస్ డైనమిక్ గ్లాస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. వివో ఇండోనేషియన్ వెబ్ సైట్ ద్వారా ఈ సిరీస్ వివరాలు తెలిసాయి.

డైనమిక్ గ్లాస్ డిజైన్, 8జిబి ర్యామ్ తో రానున్న Vivo Y36 సిరీస్

  • డైనమిక్ గ్లాస్
  • 8జిబి ర్యామ్
  • 5జీ, 4జీ
  • 44వాట్ చార్జింగ్

Vivo Y36 సిరీస్ వివరాలు వివో యొక్క అధికార వెబ్ సైట్ పై కనిపించాయి. Vivo Y36 లైనప్ డైనమిక్ గ్లాస్ డిజైన్ తో రానున్నట్లు స్పష్టమైంది. Vivo Y36 సిరీస్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్నాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్లలో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఫోన్లలో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ కనెక్టివిటీ, 4జీ కనెక్టివిటీ ఉంటాయి. Vivo Y36 4జీ విషయానికి వస్తే, ఈ ఫోన్ గ్లిట్టర్ ఆక్వాల, మిటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Vivo Y36 5జీ వేరియంట్ క్రిస్టల్ గ్రీన్, మిస్టిల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y36 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.8-ఇంచ్ స్క్రీన్
  • ఎల్సీడీ ప్యానెల్

Vivo Y36 4జీ స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇతర డిస్ప్లే సంబంధిత సమాచారం ఇంకా తెలియలేదు.

చిప్సెట్, ర్యామ్

  • మీడియాటెక్ హీలియో జీ99
  • స్నాప్ డ్రాగన్ 680
  • 8జిబి ర్యామ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. అయితే గీక్ బెంచ్ రిజల్ట్ ని బట్టి, ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ యూఐ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.

Vivo Y36 4జీ ధర

Vivo Y36 4జీ మోడల్ ధర భారత్ లో రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక Vivo Y36 5జీ స్పెసిఫికేషన్స్, ధర ఇంకా రివీల్ కాలేదు.

The post డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>