
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo Y36 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఈ డివైజ్ ప్రవేశించింది. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా భారత మార్కెట్ లాంచ్ పై కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. ఈలోపు, ఇండియన్ రిటైల్ బాక్స్ ని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో కొన్ని రోజుల్లోనే Vivo Y36 5G భారత్ లో విడుదలవ్వనుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Vivo Y36 5G యొక్క గ్లోబల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Y36 5G ధర
- ఇండేనోషియాలో Vivo Y36 5G డివైజ్ సింగిల్ వేరియంట్ లోనే లాంచ్ అయ్యింది.
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 37,99,000 (సుమారు రూ.20,000).
- Vivo Y36 5G డివైజ్ క్రిస్టల్ గ్రీన్, మిస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y36 5G ఇండియన్ రిటైల్ బాక్స్
Vivo Y36 5G యొక్క ఇండియన్ రిటైల్ బాక్స్ రివీల్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది. భారత్ లో Vivo Y36 5G ధర రూ.15,000 వద్ద ఉంటుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఇండియా లాంచ్ కి సంబంధించి వివో నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Vivo Y36 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y36 5G లో 6.64-ఇంచ్ హెచ్డీ+ అల్ట్రా-ఓ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
- మెమొరీ: Vivo Y36 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉన్నాయి. అలాగే 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ5ఎక్స్4 రేటింగ్ ఉన్నాయి.











