Vivo Y36m - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 Nov 2023 17:01:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m; రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-y36m-spotted-china-telecom-website-design-key-specs/ Tue, 14 Nov 2023 15:18:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=8832 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో జూన్ నెలలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ Vivo Y36m చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా, Vivo Y36m డివైజ్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. లిస్టింగ్ ద్వారా Vivo Y36m డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం […]

The post చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m; రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m
  • రివీలైన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో జూన్ నెలలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ Vivo Y36m చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా, Vivo Y36m డివైజ్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. లిస్టింగ్ ద్వారా Vivo Y36m డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y36m ధర

Vivo Y36m డివైజ్ యొక్క బేస్ మోడల్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను CNY 1,499 (సుమారు రూ.17,200) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ.20,600) గా ఉంది.

Vivo Y36m స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36m లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36m లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ లేదా 6020 చిప్ ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడే అవకాశం ఉంది.
  • ఓఎస్: Vivo Y36m డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y36m లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y36m లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo Y36m లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
  •  ఇతర ఫీచర్లు: Vivo Y36m లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
  •  కలర్ ఆప్షన్స్: Vivo Y36m డివైజ్ గ్రీన్ గేజ్, బ్లాక్ ఇంక్‌స్టోన్ కలర్ ఆప్షన్స్ లో రానుంది.

The post చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m; రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>