చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m; రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights

  • చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y36m
  • రివీలైన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో జూన్ నెలలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ Vivo Y36m చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా, Vivo Y36m డివైజ్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. లిస్టింగ్ ద్వారా Vivo Y36m డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y36m ధర

Vivo Y36m డివైజ్ యొక్క బేస్ మోడల్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను CNY 1,499 (సుమారు రూ.17,200) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ.20,600) గా ఉంది.

Vivo Y36m స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36m లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y36m లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ లేదా 6020 చిప్ ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడే అవకాశం ఉంది.
  • ఓఎస్: Vivo Y36m డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y36m లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y36m లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo Y36m లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
  •  ఇతర ఫీచర్లు: Vivo Y36m లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
  •  కలర్ ఆప్షన్స్: Vivo Y36m డివైజ్ గ్రీన్ గేజ్, బ్లాక్ ఇంక్‌స్టోన్ కలర్ ఆప్షన్స్ లో రానుంది.
Previous articleలాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్
Next articleDimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.