Vivo Y56 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Sep 2023 14:39:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచైన Vivo Y56 5G 4GB ర్యామ్ వేరియంట్! https://www.91mobiles.com/telugu/vivo-y56-5g-4gb-ram-variant-launched-india-price-specs/ Wed, 20 Sep 2023 14:31:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=8079 Vivo తన మిడ్‌రేంజ్ 5G ఫోన్ Y56ని 2023 ఆరంభంలో భారతదేశంలో విడుదల చేసింది. ఈ మొబైల్ 8 GB RAMతో మార్కెట్‌లోకి తీసుకురాబడింది. దీని ధర రూ. 19,999. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో Vivo Y56 5G యొక్క సరసమైన వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. కొత్త మోడల్‌లో 4 GB RAMతో 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. బడ్జెట్ కొనుగోలుదారులకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. సరే, ఓసారి వివో […]

The post 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచైన Vivo Y56 5G 4GB ర్యామ్ వేరియంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచైన Vivo Y56 5G 4జిబి ర్యామ్ మోడల్
  • 4జిబి+128జిబి వేరియంట్ ధర రూ.16,999
  • 8జిబి+128జిబి మోడల్ ధర రూ.18,999

Vivo తన మిడ్‌రేంజ్ 5G ఫోన్ Y56ని 2023 ఆరంభంలో భారతదేశంలో విడుదల చేసింది. ఈ మొబైల్ 8 GB RAMతో మార్కెట్‌లోకి తీసుకురాబడింది. దీని ధర రూ. 19,999. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో Vivo Y56 5G యొక్క సరసమైన వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. కొత్త మోడల్‌లో 4 GB RAMతో 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. బడ్జెట్ కొనుగోలుదారులకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. సరే, ఓసారి వివో వై56 5జీ 4జిబి వేరియంట్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y56 5G ధర

Vivo Y56 5G లో ప్రత్యేకత ఏంటంటే, ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. గేమింగ్ మరియు ఎక్కువ యాప్స్ వాడుతున్నప్పుడు, మల్టీ టాస్కింగ్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. Vivo Y56 5G యొక్క రెండు వేరియంట్‌లలో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సదుపాయం ఉంది. దీంతో మెమొరీని మరింతగా పెంచుకునే అవకాశం యూజర్ కి లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ ఇంజన్ మరియు ఆరెంజ్ షిమ్మర్ రంగులలో అమ్మకానికి అందుబాటులో ఉంది. సరే, ఓసారి వివో వై56 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

వివో వై56 5జీ యొక్క 8జిబి మరియు 4జిబి ర్యామ్ వేరియంట్స్ లో స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. ర్యామ్, స్టోరేజీల్లో మాత్రమే మార్పు ఉంటుంది. Vivo Y56 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, టైప్-సీ పోర్ట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సరే, పూర్తి స్పెసిఫికేషన్స్ క్రింద అందిస్తున్నాం ఓసారి చూడండి.

  • స్క్రీన్: Vivo Y56 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y56 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ చిప్ వాడారు.
  • కెమెరా: Vivo Y56 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo Y56 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y56 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లాంచైన Vivo Y56 5G 4GB ర్యామ్ వేరియంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y16-vivo-y56-get-price-cut-rs-1000/ Mon, 14 Aug 2023 12:13:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=7594 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన యూజర్ల కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y56, Vivo Y16 డివైజెస్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్టు 14 న ఈ వివో ఫోన్లను తగ్గించిన ధరపై కొనుగోలు చేయవచ్చు. ఏయే మోడల్స్ ధరలు ఎంత మేర తగ్గాయో క్రింద అందించాం. ఓసారి చదివి తెలుసుకోండి. అలాగే Vivo Y16, Vivo Y56 ఫోన్ల స్పెసిఫికేషన్స్ పై కూడా కన్నేయండి. ఫోన్ మోడల్ పాత ధర […]

The post Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటన
  • Vivo Y16, Vivo Y56 లపై రూ.1000 తగ్గింపు
  • 5జీ సపోర్ట్ తో వచ్చిన Vivo Y56

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన యూజర్ల కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y56, Vivo Y16 డివైజెస్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్టు 14 న ఈ వివో ఫోన్లను తగ్గించిన ధరపై కొనుగోలు చేయవచ్చు. ఏయే మోడల్స్ ధరలు ఎంత మేర తగ్గాయో క్రింద అందించాం. ఓసారి చదివి తెలుసుకోండి. అలాగే Vivo Y16, Vivo Y56 ఫోన్ల స్పెసిఫికేషన్స్ పై కూడా కన్నేయండి.

ఫోన్ మోడల్ పాత ధర కొత్త ధర డిస్కౌంట్
Vivo Y16 (4జిబి + 64జిబి) రూ.11,999 రూ.10,999 రూ.1,000
Vivo Y16 (4జిబి + 128జిబి) రూ.12,999 రూ.12,499 రూ.5,00
Vivo Y56 (8జిబి + 128జిబి) రూ.19,999 రూ.18,999 రూ.1,000

 

Vivo Y56 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y56 లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y56 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది. అలాగే 8జిబి ఎక్‌పాండబుల్ ర్యామ్ కూడా లభిస్తుంది.
  • ఓఎస్, చిప్సెట్: Vivo Y56 లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. Vivo Y56 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y56 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y56 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y16 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఉన్నాయి.
  • ఓఎస్, చిప్సెట్: Vivo Y16 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్ వాడారు. Vivo Y16 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y16 లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • కనెక్టివిటీ: Vivo Y16 లో 4జీ ఎల్టీఈ, 3.5ఎంఎం ఆడియో జాక్, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వచ్చిన Vivo Y56 5G https://www.91mobiles.com/telugu/vivo-y56-5g-india-available-via-offline-stores-price-specs/ Thu, 16 Feb 2023 09:38:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=4959 Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. మిడ్ రేంజ్ ఆఫరింగ్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ దాదాపుగా ఆఫ్‌లైన్ సెగ్మెంట్ లోనే అందుబాటులో ఉండనుంది. వివో నుంచి వచ్చిన ఇతర వై-సిరీస్ ఫోన్ల మాదిరే ఈ ఫోన్ డిజైన్ ఉంది. భారీ కెమెరా కటౌట్స్, ఫ్లాట్ ఫ్రేమ్ తో ఈ ఫోన్ వచ్చింది. Vivo Y56 5G ధర రూ.20,000 లోపు ఉండనుంది. సింగిల్ స్టోరేజీ […]

The post భారత్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వచ్చిన Vivo Y56 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన Vivo Y56 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న Vivo Y56 5G
  • భారత్ లో Vivo Y56 5G ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. మిడ్ రేంజ్ ఆఫరింగ్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ దాదాపుగా ఆఫ్‌లైన్ సెగ్మెంట్ లోనే అందుబాటులో ఉండనుంది. వివో నుంచి వచ్చిన ఇతర వై-సిరీస్ ఫోన్ల మాదిరే ఈ ఫోన్ డిజైన్ ఉంది. భారీ కెమెరా కటౌట్స్, ఫ్లాట్ ఫ్రేమ్ తో ఈ ఫోన్ వచ్చింది. Vivo Y56 5G ధర రూ.20,000 లోపు ఉండనుంది.

సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో Vivo Y56 5G లభించనుంది. ఈ ఫోన్ ని కంపెనీ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేస్తుందని గతంలో రూమర్లు వినిపించాయి. సరే, ఓసారి Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y56 5G ధర

భారత్ లో Vivo Y56 5G సింగిల్ స్టోరేజీ కన్ఫిగరేషన్ తో లాంచైంది. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. పాపులర్ ఆఫ్‌లైన్ రిటైలర్ మహేశ్ టెలీకామ్ Vivo Y56 5G ధరను రివీల్ చేసింది. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

అఫీషియల్ లిస్టింగ్ ద్వారా Vivo Y56 5G ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. Vivo Y56 5G ప్లాస్టిక్ ఫ్రేమ్ మరియు బాడీతో వచ్చింది. రియర్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ కటౌట్స్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా సెన్సర్స్ కి పక్కన ఉంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

Vivo Y56 5G లో 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo Y56 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y56 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఆల్టర్నేట్ గా ఇందులో ఏఐ ఫేస్ అన్ లాక్ కూడా ఉంది. ఈ డివైజ్ లో ఎంట్రీ లెవెల్ 5జీ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని వాడారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు.

Vivo Y56 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. నైట్ మోడ్ తదితర ఫీచర్లు కెమెరాలో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్, పొట్రెయిట్ మోడ్, పనొరమ, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్ ల్యాప్స్, ప్రో వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

Vivo Y56 5G డివైజ్ 164.05 మిల్లీ మీటర్ల పొడవు, 75.60 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.15 మిల్లీ మీటర్ల మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వచ్చిన Vivo Y56 5G first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo Y56 5G https://www.91mobiles.com/telugu/vivo-y56-5g-specifications-render-leaked-before-launch/ Mon, 13 Feb 2023 06:52:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4888 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రీసెంట్ గా భారత్ లో Y100 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్ రేంజ్ ఫోన్, దీని ధర రూ.24,999. వినూత్నంగా ఉండే, కలర్-చేంజింగ్ డిజైన్ బ్యాక్ గల ఫోన్ కోరుకునే ఆఫ్‌లైన్ బయ్యర్స్ ని టార్గెట్ చేస్తూ వివో సంస్థ Y100 5G ఫోన్ ని తీసుకొచ్చింది. వై-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు వివో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ […]

The post MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo Y56 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y56 5G
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Vivo Y56 5G
  • తాజాగా టిప్‌స్టర్ ద్వారా లీకైన Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రీసెంట్ గా భారత్ లో Y100 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్ రేంజ్ ఫోన్, దీని ధర రూ.24,999. వినూత్నంగా ఉండే, కలర్-చేంజింగ్ డిజైన్ బ్యాక్ గల ఫోన్ కోరుకునే ఆఫ్‌లైన్ బయ్యర్స్ ని టార్గెట్ చేస్తూ వివో సంస్థ Y100 5G ఫోన్ ని తీసుకొచ్చింది. వై-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు వివో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ లో Vivo Y56 5G డివైజ్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం.

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ ఒక బడ్జెట్ రేంజ్ 5జీ డివైజ్. కంపెనీ ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. అయితే, కొత్త లీక్ ద్వారా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, Vivo Y56 5G స్పెసిఫికేషన్స్, తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo Y56 5G ఇండియా లాంచ్ వివరాలు

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ కంపెనీ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్. త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. లాంచ్ కి ముందు ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల చేశాడు. Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో భారత మార్కెట్ లోకి లాంచ్ కానుంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ 6.5-హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండనుంది. ఈ ఫోన్ లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం, Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Vivo Y56 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo Y56 5G first appeared on 91Mobiles Telugu.

]]>