భారత్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వచ్చిన Vivo Y56 5G

Highlights

  • ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన Vivo Y56 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న Vivo Y56 5G
  • భారత్ లో Vivo Y56 5G ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. మిడ్ రేంజ్ ఆఫరింగ్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ దాదాపుగా ఆఫ్‌లైన్ సెగ్మెంట్ లోనే అందుబాటులో ఉండనుంది. వివో నుంచి వచ్చిన ఇతర వై-సిరీస్ ఫోన్ల మాదిరే ఈ ఫోన్ డిజైన్ ఉంది. భారీ కెమెరా కటౌట్స్, ఫ్లాట్ ఫ్రేమ్ తో ఈ ఫోన్ వచ్చింది. Vivo Y56 5G ధర రూ.20,000 లోపు ఉండనుంది.

సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో Vivo Y56 5G లభించనుంది. ఈ ఫోన్ ని కంపెనీ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేస్తుందని గతంలో రూమర్లు వినిపించాయి. సరే, ఓసారి Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo Y56 5G ధర

భారత్ లో Vivo Y56 5G సింగిల్ స్టోరేజీ కన్ఫిగరేషన్ తో లాంచైంది. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. పాపులర్ ఆఫ్‌లైన్ రిటైలర్ మహేశ్ టెలీకామ్ Vivo Y56 5G ధరను రివీల్ చేసింది. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

అఫీషియల్ లిస్టింగ్ ద్వారా Vivo Y56 5G ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. Vivo Y56 5G ప్లాస్టిక్ ఫ్రేమ్ మరియు బాడీతో వచ్చింది. రియర్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ కటౌట్స్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా సెన్సర్స్ కి పక్కన ఉంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

Vivo Y56 5G లో 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo Y56 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y56 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఆల్టర్నేట్ గా ఇందులో ఏఐ ఫేస్ అన్ లాక్ కూడా ఉంది. ఈ డివైజ్ లో ఎంట్రీ లెవెల్ 5జీ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని వాడారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు.

Vivo Y56 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. నైట్ మోడ్ తదితర ఫీచర్లు కెమెరాలో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్, పొట్రెయిట్ మోడ్, పనొరమ, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్ ల్యాప్స్, ప్రో వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

Vivo Y56 5G డివైజ్ 164.05 మిల్లీ మీటర్ల పొడవు, 75.60 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.15 మిల్లీ మీటర్ల మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.