Vivo Y78+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 14 Apr 2023 19:02:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో కనిపించిన Vivo Y78+ https://www.91mobiles.com/telugu/vivo-y78-plus-spotted-geekbench-key-specs-revealed/ Fri, 14 Apr 2023 18:28:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5896 Vivo Y78+ స్మార్ట్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపిస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్ బెంచ్ పై కనిపించింది. రీసెంట్ గా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. అయితే ఆ లిస్ట్ ద్వారా పెద్దగా వివరాలు తెలియలేదు. కానీ, ఇప్పుడు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా చిప్సెట్, ర్యామ్, ఓఎస్ వివరాలు తెలిసాయి. పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. Vivo Y78+ గీక్ బెంచ్ లిస్టింగ్ V2271A […]

The post గీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో కనిపించిన Vivo Y78+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గీక్ బెంచ్ పై కనిపించిన Vivo Y78+ స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

Vivo Y78+ స్మార్ట్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపిస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్ బెంచ్ పై కనిపించింది. రీసెంట్ గా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. అయితే ఆ లిస్ట్ ద్వారా పెద్దగా వివరాలు తెలియలేదు. కానీ, ఇప్పుడు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా చిప్సెట్, ర్యామ్, ఓఎస్ వివరాలు తెలిసాయి. పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Vivo Y78+ గీక్ బెంచ్ లిస్టింగ్

V2271A అనే మోడల్ నంబర్ తో బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై Vivo Y78+ కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ డివైజ్ 670 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1976 పాయింట్లు సాధించింది. మైస్మార్ట్‌ప్రైస్ వెబ్ సైట్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మిడ్ రేంజ్ డివైజ్ అని, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోందని తెలిసింది.

Vivo Y78+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

త్వరలో రాబోవు Vivo Y78+ గురించి ఎక్కువ సమాచారం లేదు. కానీ, Vivo Y78+ డివైజ్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందని అంచనా. 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు వివో సంస్థ Vivo Y78+ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎన్నో బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్స్ పై కనిపించడంతో త్వరలోనే Vivo Y78+ లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది.

ఈ నెలలో వివో కంపెనీ Vivo T2, Vivo T2x డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇవి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్. వివో టీ2 రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి/128జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి/128జిబి వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. వివో టీ2ఎక్స్ డివైజ్ 4జిబి/128జిబి, 6జిబి/128జిబి, 8జిబి/128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.13,999 మరియు రూ.15,999 గా ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో కనిపించిన Vivo Y78+ first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo Y78+ https://www.91mobiles.com/telugu/vivo-y78-plus-spotted-google-play-supported-devices-list-3c-certification-website/ Fri, 31 Mar 2023 05:54:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=5682 వివో సంస్థ వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు Vivo Y78+ అయ్యుంటుందని ఒక రూమర్ వినిపిస్తోంది. 2023 ఏప్రిల్ లో Vivo Y78+ డివైజ్ చైనాలో లాంచ్ కానుందని సమాచారం. ఈలోపు Vivo Y78+ డివైజ్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజ్ లిస్ట్ లో దర్శనమిచ్చింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క పేరు మాత్రమే తెలిసింది. అయితే ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అంచనా […]

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo Y78+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే Vivo Y78+ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న వివో
  • తాజాగా గూగుల్ ప్లే సపోర్ట్ డివైజ్ లిస్ట్ పై కనిపించిన Vivo Y78+
  • డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలియజేస్తున్న లిస్టింగ్

వివో సంస్థ వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు Vivo Y78+ అయ్యుంటుందని ఒక రూమర్ వినిపిస్తోంది. 2023 ఏప్రిల్ లో Vivo Y78+ డివైజ్ చైనాలో లాంచ్ కానుందని సమాచారం. ఈలోపు Vivo Y78+ డివైజ్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజ్ లిస్ట్ లో దర్శనమిచ్చింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క పేరు మాత్రమే తెలిసింది. అయితే ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo Y78+ గురించి తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

గూగుల్ ప్లే సపోర్ట్ డివైజ్ లిస్ట్ పై కనిపించిన Vivo Y78+

Vivo Y78+ ఫోన్ Vivo V2271A/PD2271 అనే మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. వచ్చే నెలలో ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక Vivo Y78+ డివైజ్ భారత మార్కెట్ లాంచ్ పై కూడా ఒక రూమర్ వినిపిస్తోంది.

గూగుల్ ప్లే సపోర్ట్ డివైజెస్ లిస్ట్ లో Vivo Y78+ ఫోన్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి ఏమీ తెలియలేదు. గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ తర్వాత ఆ వెనువెంటనే గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వస్తుంది. ఈ లిస్టింగ్ ద్వారా డిజైన్ మరియు ఫీచర్లు రివీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

దీంతో పాటు Vivo Y78+ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, Vivo Y78+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పనిచేయనుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo Y78+ first appeared on 91Mobiles Telugu.

]]>